By: ABP Desam | Updated at : 22 Jul 2022 07:57 PM (IST)
ఐటీ రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయలేదా ? ఈ సారి గడువు పెంపు ఉండదు ! ( Image Source : Getty )
ITR Filing Last Date : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గతంలో మాదిరిగా ఈ సారి గడువు పెంచే చాన్స్ లేదని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో కరోనా ఇతర ఆర్థిక కారణాల వల్ల రెండేళ్లు రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు పెంచుకుంటూ పోయారు. కానీ ఈ సారి మాత్రం ఎలాంటి గడువు ఇచ్చే ఉద్దేశంలో కేంద్రం లేదు. జూలై 31వ తేదీ కల్లా అందరూ రిటర్నులు ఫైల్ చేయాల్సిందే్. గత ఆర్థిక సంవత్సరం 2021-22 ఐటీ రిటర్న్స్ పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ సబ్‌మిట్ చేయాల్సిందేనని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ శుక్రవారం స్పష్టం చేశారు.
ఉద్యోగులకు గుడ్‌న్యూస్! 3 నెలలకోసారి ప్రమోషన్లు! లిస్టులో మీ కంపెనీ ఉందా?
త ఏడాది జూలై 20 నాటికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్‌ను 2.3 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు దాఖలు చేశారని, రోజురోజుకు ఐటీఆర్ దాఖలు చేసే వారి సంఖ్య పెరుగుతుందని తరుణ్ బజాజ్ చెప్పారు.గతేడాది డిసెంబర్ 31 నాటికి గత ఆర్థిక సంవత్సరంలో 5.89 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయని తరుణ్ బజాజ్ తెలిపారు. పన్ను చెల్లింపుదారులు ప్రతియేటా మాదిరిగానే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు పొడిగిస్తారని భావిస్తున్నారు. అందుకే ప్రారంభ దశలో ఐటీఆర్ ఫైలింగ్స్ చాలా నెమ్మదిగా ఉన్నాయి.
Also Read: బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టేసిన గౌతమ్ అదానీ - ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానానికి ఇండియన్
ఈ కారణంగా ప్రభుత్వం ముందస్తుగానే క్లారిటీ ఇస్తోంది. పొడిగింపు ఉండదని చెబుతోంది. ప్రస్తుతం ప్రతి రోజూ 15 లక్షల నుంచి 18 లక్షల ఐటీ రిటర్న్స్ సబ్మిట్ అవుతున్నాయని మున్ముందు రోజూ 25 నుంచి 30 లక్షల రిటర్న్స్ దాఖలవుతాయని అంచనా వేస్తున్నారు. సాధారణంగా పన్ను చెల్లింపుదారులు ప్రతియేటా ఐటీఆర్ దాఖలు చేయడానికి తుది గడువు వరకు వెయిట్ చేస్తుంటారు. `గత ఏడాది 9-10 శాతం మంది చివరి రోజు ఐటీఆర్ సబ్మిట్ చేశారు. ఈ కారణంగా వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు కూడా వచ్చాయి. ఈ రష్‌ను ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి కాస్త ముందుగానే రిటర్న్స్ ఫైల్ చేయాలని కేంద్ర అధికారులు చెబుతున్నారు.
గత ఏడాది కొత్త వెబ్‌సైట్ ద్వారా రిటర్నులు స్వీకరించి ప్రాసెస్‌ను సులువు చేసే ప్రయత్నం చేశారు. అయితే అనేకసమస్యలు ఏర్పడ్డాయి. ఐటీ రిటర్నులు ఫైల్ చేయడానికి కూడా ఇబ్బంది ఏర్పడింది. ఫైల్ చేసినా చేయలేదని చూపించింది. అయితే ఈ సారి అలాంటి సమస్యలేమీ లేవని చెబుతున్నారు. గడువులోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే.. జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
World Cheapest Silver Price: ప్రపంచంలో అత్యంత చౌకగా వెండి లభించే దేశం ఏదీ? భారత్ కంటే 40 వేల రూపాయల వరకు తక్కువ!
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Hyderabad Crime News: పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి
The Raja Saab Box Office Collection Day 1: ప్రభాస్ టాప్ 5లో లేదు కానీ... 'ది రాజా సాబ్' ఫస్ట్ డే ఇండియా నెట్ ఎంతంటే?
Viral News: పాతికేళ్ల యువకుడికి 70 ఏళ్ల మెదడు! మెడికల్ హిస్టరీలోనే వింతైన కేసు!
KTM RC 160 - Yamaha R15 మధ్య కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? తేడాలను కేవలం 2 నిమిషాల్లో తెలుసుకోండి