By: ABP Desam | Updated at : 22 Jul 2022 03:57 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pixels )
Stock Market Closing Bell 22 July 2022: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే వచ్చినప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 114 పాయింట్ల లాభంతో 16,719 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 390 పాయింట్ల లాభంతో 56,072 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు పెరిగి 79.85 వద్ద క్లోజైంది.
BSE Sensex
క్రితం సెషన్లో 55,681 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 55,800 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 55,685 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 56,186 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 390 పాయింట్ల లాభంతో 56,072 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 16,605 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,661 వద్ద ఓపెనైంది. 16,610 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,752 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 114 పాయింట్ల లాభంతో 16,719 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో క్లోజైంది. ఉదయం 36,322 వద్ద మొదలైంది. 36,286 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,823 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 537 పాయింట్ల లాభంతో 36,738 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ముగిశాయి. అల్ట్రాటెక్ సెమ్, గ్రాసిమ్, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడ్డాయి. టాటా కన్జూమర్, ఇన్ఫీ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్, రియాల్టీ సూచీలు ఎగిశాయి.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Tiger Attack Komaram Bheem Asifabad District News: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు