దేశం కోసం 'గోల్డ్‌' కొనడం ఆపేస్తారా ప్లీజ్‌!

ముడి వనరుల లభ్యత తగ్గిపోవడం, ధరలు పెరగడంతో భారత్‌ ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది.

2022, జూన్‌లో దిగుమతులు 63.6 బిలియన్‌ డాలర్లకు చేరుకోవడంతో రూపాయి క్షీణిస్తోంది. వాణిజ్య లోటు పెరిగింది.

ప్రపంచ బంగారం మండలి ప్రకారం 2021లో భారత్‌ ఈ పదేళ్లలోనే అత్యధిక బంగారాన్ని దిగుమతి చేసుకుంది.

బంగారం దిగుమతులు కరెంట్‌ ఖాతా లోటుపై (CAD) ఒత్తిడి పెంచుతున్నాయి. FY22లో 102.2 నుంచి 189. బి.డా. CAD పెరిగింది.

FY21లో జీడీపీలో 0.9% మిగులుతో ఉన్న ఇప్పుడు 1.2 శాతం లోటుకు పెరిగింది.

అందుకే కేంద్రం బంగారంపై దిగుమతి పన్నును 10 నుంచి 15 శాతానికి పెంచింది.

అయినా ప్రజలు బంగారం కొనుగోళ్లను ఆపడం లేదు. పైగా కొందరు స్మగ్లింగ్‌ చేస్తున్నారు.

రూపాయి బలపడేందుకు ఏడాది పాటు ఫిజికల్‌ గోల్డ్‌ దిగుమతి చేసుకోకుంటే మేలని నిపుణులు అంటున్నారు.

బదులుగా గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ కొనుగోలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు.