పేటీఎంలో UPI పిన్ ఈజీగా మార్చుకోండి - ప్రాసెస్ ఇదీ! నోట్ల రద్దు తర్వాత యూపీఐ పేమెంట్లు వేగంగా పెరిగాయి. ఇందుకు 4 లేదా 6 అంకెల పిన్ అవసరం. ఒకవేళ మీ యూపీఐ ఐడీ పిన్ ఎవరికైనా తెలిస్తే వెంటనే మార్చాలి. పేటీఎం ద్వారా ఇది ఈజీయే. మొదట పేటీఎం యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత స్క్రోల్ డౌన్ చేసి ప్రొఫైల్ సెట్టింగ్‌పై నొక్కండి. సెక్యూరిటీ అండ్ ప్రైవసీపై నొక్కి Change UPI Pin ఆప్షన్ ట్యాప్ చేయండి. అప్పుడు పేటీఎం యాప్‌లో లింకైన బ్యాంకుల వివరాలు కనిపిస్తాయి. మీరు మార్చాలనుకున్న యూపీఐ బ్యాంకు ఐడీపై క్లిక్ చేయండి. 'ఛేంజ్ పిన్'పై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ సెక్షన్‌లో ఆ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఆ కిందే యూపీఐ ఐడీ కొత్త పిన్ ఎంటర్ చేసి సబ్మింట్ చేస్తే సరిపోతుంది.