వక్రంలో గురుడు, నవంబరు వరకూ ఈ రాశులవారికి డబ్బే డబ్బు



జూలై 28న దేవగురువైన బృహస్పతి మీనంలో తిరోగమనం ప్రారంభమవుతుంది.ఈ తిరోగమన స్థితి నవంబరు 27 వరకూ ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశులవారికి అత్యంత యోగదాయకమైన సమయం



వృషభం
బృహస్పతి వృషభ రాశివారికి 11 వ ఇంట తిరోగమనంలో ఉండడం వల్ల ఆర్థికంగా మీకు కలిసొచ్చే సమయం ఇది. నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయి, ఉద్యోగులకు పదోన్నతులు లేదా జీతం పెరుగుదల ఉంటుంది. వృత్తి, వ్యాపారాల వారికి బాగా కలిసొస్తుంది.



మిథునం
మిథున రాశివారికి గురుగ్రహం తిరోగమనం 10వ ఇంట ఉంటుంది. ఈ సందర్భంగా మీ పనితీరుతో పై అధికారులను మెప్పిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు, కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూల సమయం. మాట తూలొద్దు.



కర్కాటకం
గురు గ్రహం తిరోగమనం కర్కాటక రాశివారికి కూడా కలిసొస్తుంది.ఆర్థిక పరిస్థితి అధ్భుతంగా ఉంటుంది. వ్యాపారులు ధీమాగా ఉన్నా లాభాలు వచ్చి పడతాయి. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న సొమ్ము కూడా చేతికందుతుంది.



సింహం
బృహస్పతి వక్రగమనం సింహరాశివారికి ఆకస్మిక ధనలాభాలను తెచ్చిపెడుతుంది. ఇప్పటికే ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఒక్కొక్కటీ తొలగిపోతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. పెండింగ్ లో ఉన్న మొత్తం వసూలవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.



వృశ్చికం
గురుగ్రహం సంచారం ఈ రాశివారికి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో ఉద్యోగులకు అనుకోని ఆదాయం వచ్చిపడుతుంది. పెట్టుబడుల ద్వారా లాభం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.



మకరం
ఆర్థిక ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగి చేతిలో ధనం స్థిరంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నంచి ఆర్థిక సహకారం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో సత్సంబంధాలుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి.



కుంభం
బృహస్పతి మీనంలో తిరోగమనం చెందడంతో..ఈ ప్రభావంతో ఈ రాశివారికి లక్కు కలిసొస్తుంది. ఉద్యోగులు,వ్యాపారులు, విద్యార్థులు, వృత్తుల వారికి మంచి సమయం. ధనం సంపాదించడానికి, ఆదా చేయడానికి ఇదే మంచి సమయం.



ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…