By: ABP Desam | Updated at : 14 Sep 2021 04:13 PM (IST)
Edited By: Ramakrishna Paladi
LIC_Pay_Direct
కొవిడ్-19 మహమ్మారి వల్ల అనేక రంగాలు డీలా పడ్డాయి. పర్యాటక రంగం వంటివైతే పూర్తిగా కుదేలయ్యాయి. కొన్నింట్లో మాత్రం ఊహించలేనంత వృద్ధి నమోదైంది. బ్యాంకింగ్, బీమా, ఆన్‌లైన్, ఇంటర్నెట్ సేవలు, యూపీఐ, ఆన్‌లైన్ చెల్లింపుల్లో వృద్ధిరేటు మాత్రం అమాంతం పెరిగింది.
ఇదే సమయంలో ఆన్‌లైన్‌లో బీమా తీసుకోవడం, ప్రీమియం చెల్లించడం పెరిగింది. ప్రభుత్వ రంగ బీమా సంస్థైన భారతీయ జీవిత బీమా (ఎల్‌ఐసీ) సైతం ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లించేలా వినియోగదారులను ప్రోత్సహించింది. ఇందుకోసం మొబైల్ యాప్ 'LIC Pay Direct' (ఎల్‌ఐసీ పే డైరెక్ట్) వినియోగించాలని సూచించింది.
ఇది ఎల్‌ఐసీ అధీకృత యాప్ కావడంతో వినియోగించేందుకు భయం అవసరం లేదు! ఈ యాప్‌ను ఉపయోగించి ప్రీమియం చెల్లించి రిసిప్ట్‌ను ముద్రించుకోవద్దు.
Also Read: Hiring sentiment improves: పండగల వేళ ఉద్యోగ నియామకాల హేళ..! పెరగనున్న జీతాలు..!
ఎల్‌ఐసీ పే డైరెక్ట్ యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే..
1. మొదట గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి ఎల్‌ఐసీ పే డైరెక్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. ఆ తర్వాత యాప్‌ను ఓపెన్ చేసి 'పే ప్రీమియం' ఆప్షన్‌ను ఓపెన్ చేయాలి. అప్పుడు యాప్‌లో ప్రీమియం పేమెంట్ స్క్రీన్ తెరచుకుంటుంది.
3. ఇప్పుడు ఆ స్క్రీన్‌లో సూచించిన విధంగా చేయాలి.
4. మీ పాలసీ సంఖ్య, ప్రీమియం, పుట్టిన తేదీ, మెయిల్ ఐడీ వంటి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.
5. వివరాలను పూర్తిగా నింపిన తర్వాత వాటన్నిటినీ సరి చూసుకోవాలి. ఆ తర్వాత పేమెంట్ బటన్‌పై నొక్కాలి.
6. ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు చెల్లించాలి.
7. డబ్బులు చెల్లించాక ఎలక్ట్రానిక్ పేమెంట్ రిసిప్ట్ మీ మెయిల్ ఐడీకి వస్తుంది.
ఇలా మీరు ఎల్‌ఐసీ పే డైరెక్ట్ యాప్ ఉపయోగించి ఆన్‌లైన్‌లోనే నిశ్చింతంగా ప్రీమియం చెల్లించొచ్చు.
Also Read: JioBook Laptop: జియో చవకైన ల్యాప్ టాప్ వచ్చేస్తుంది.. ఫీచర్లు కూడా లీక్!
లిస్టింగ్‌పై ఉద్యోగులకు హెచ్చరిక!
ఆర్థికంగా తిరుగులేని సంస్థ కావడంతో ఎల్‌ఐసీ లిస్టింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. షేరు ధర ఎలా ఉండబోతోంది? ఎప్పుడు లిస్టింగ్‌కు వస్తుంది? ఆఫర్ విలువ ఏంటి? వంటి వివరాల కోసం మదుపర్లు ఎదురు చూస్తున్నారు. కాగా ఐపీవో, ధర, లిస్టింగ్, విలువ గురించి బహిరంగంగా మాట్లాడొద్దని తమ ఉద్యోగులను ఎల్‌ఐసీ హెచ్చరించింది. సంబంధిత వ్యవహారంపై ఎల్‌ఐసీ ఛైర్మన్, నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు మాత్రమే మీడియాకు వివరాలు చెబుతారని స్పష్టం చేసింది.
Also Read: IPL 2021: ఎరుపు రంగు నుంచి నీలి రంగు జెర్సీకి మారిన ఆర్‌సీబీ.. ఎందుకో తెలుసా?
Today Gold and Silver Prices: నేడు బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో చూడండి! 10 గ్రాముల పసిడి కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది?
PF Salary Limit: పీఎఫ్ జీతాల పరిమితి 25-30 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం! దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?
World Cheapest Silver Price: ప్రపంచంలో అత్యంత చౌకగా వెండి లభించే దేశం ఏదీ? భారత్ కంటే 40 వేల రూపాయల వరకు తక్కువ!
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్