By: Arun Kumar Veera | Updated at : 30 Dec 2024 11:09 AM (IST)
ఈ రోజు బంగారం, వెండి ధరలు 30 డిసెంబర్ 2024 ( Image Source : Other )
Latest Gold-Silver Prices Today: యూఎస్ బాండ్ ఈల్డ్స్ నిరంతరం పెరగడంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు తడబడుతోంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,638 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 160 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 150 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 120 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి ధర 100 రూపాయలు తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,000 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,500 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,500 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 99,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,000 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 71,500 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,500 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 99,900 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 78,000 | ₹ 71,500 | ₹ 58,500 | ₹ 99,900 |
విజయవాడ | ₹ 78,000 | ₹ 71,500 | ₹ 58,500 | ₹ 99,900 |
విశాఖపట్నం | ₹ 78,000 | ₹ 71,500 | ₹ 58,500 | ₹ 99,900 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 7,150 | ₹ 7,800 |
ముంబయి | ₹ 7,150 | ₹ 7,800 |
పుణె | ₹ 7,150 | ₹ 7,800 |
దిల్లీ | ₹ 7,165 | ₹ 7,815 |
జైపుర్ | ₹ 7,165 | ₹ 7,815 |
లఖ్‌నవూ | ₹ 7,165 | ₹ 7,815 |
కోల్‌కతా | ₹ 7,150 | ₹ 7,800 |
నాగ్‌పుర్ | ₹ 7,150 | ₹ 7,800 |
బెంగళూరు | ₹ 7,150 | ₹ 7,800 |
మైసూరు | ₹ 7,150 | ₹ 7,800 |
కేరళ | ₹ 7,150 | ₹ 7,800 |
భువనేశ్వర్ | ₹ 7,150 | ₹ 7,800 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 6,844 | ₹ 7,391 |
షార్జా (UAE) | ₹ 6,844 | ₹ 7,391 |
అబు ధాబి (UAE) | ₹ 6,844 | ₹ 7,391 |
మస్కట్ (ఒమన్) | ₹ 6,940 | ₹ 7,395 |
కువైట్ | ₹ 6,676 | ₹ 7,281 |
మలేసియా | ₹ 6,944 | ₹ 7,231 |
సింగపూర్ | ₹ 6,843 | ₹ 7,592 |
అమెరికా | ₹ 6,669 | ₹ 7,097 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 50 పెరిగి రూ. 25,280 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త! - ప్రభుత్వం కరవు భత్యాన్ని ఎంత పెంచుతుందంటే?
DA Hike News: ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త! - ప్రభుత్వం కరవు భత్యాన్ని ఎంత పెంచుతుందంటే?
Loan on Aadhar Card: ఆధార్ కార్డ్ ఉంటే రూ.80,000 బ్యాంక్ లోన్ - గ్యారెంటీ చూపాల్సిన అవసరం లేదు
Retirement Planning: 'సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్'తో పెన్షన్ తరహా బెనిఫిట్స్ - తెలివైన రిటైర్‌మెంట్ ప్లానింగ్!
Flying Pigeon Hologram: ఏటీఎం కార్డ్, క్రెడిట్ కార్డ్‌పై ఎగిరే పావురం గుర్తు - ఏంటి దీని అర్ధం?
EPFO New Facilities: నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Game Changer : 'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
Tigrer Tension: 21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy