By: Arun Kumar Veera | Updated at : 19 Dec 2024 10:44 AM (IST)
ఈ రోజు బంగారం, వెండి ధరలు 19 డిసెంబర్ 2024 ( Image Source : Other )
Latest Gold-Silver Prices Today: యూఎస్ ఫెడ్ తన పాలసీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు కట్ చేసింది. అయితే, 2025లో వడ్డీ రేట్ల కోతల్లో వేగం ఉండబోదని సిగ్నల్ ఇవ్వడంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు ఒకేసారి 2% పైగా పడింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,621 డాలర్ల వద్ద ఉంది. అయితే, ఈ ప్రభావం మన దేశంలోని బులియన్ మార్కెట్ మీద ప్రతిబింబించలేదు. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 10 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 10 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 10 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర 100 రూపాయలు తగ్గింది, చాలా కాలం తర్వాత రూ.లక్ష కంటే దిగువకు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,830 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,340 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,370 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 99,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,830 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 71,340 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,370 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 99,900 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 77,830 | ₹ 71,340 | ₹ 58,370 | ₹ 99,900 |
విజయవాడ | ₹ 77,830 | ₹ 71,340 | ₹ 58,370 | ₹ 99,900 |
విశాఖపట్నం | ₹ 77,830 | ₹ 71,340 | ₹ 58,370 | ₹ 99,900 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 7,134 | ₹ 7,783 |
ముంబయి | ₹ 7,134 | ₹ 7,783 |
పుణె | ₹ 7,134 | ₹ 7,783 |
దిల్లీ | ₹ 7,149 | ₹ 7,798 |
జైపుర్ | ₹ 7,149 | ₹ 7,798 |
లఖ్‌నవూ | ₹ 7,149 | ₹ 7,798 |
కోల్‌కతా | ₹ 7,134 | ₹ 7,783 |
నాగ్‌పుర్ | ₹ 7,134 | ₹ 7,783 |
బెంగళూరు | ₹ 7,134 | ₹ 7,783 |
మైసూరు | ₹ 7,134 | ₹ 7,783 |
కేరళ | ₹ 7,134 | ₹ 7,783 |
భువనేశ్వర్ | ₹ 7,134 | ₹ 7,783 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 6,867 | ₹ 7,417 |
షార్జా (UAE) | ₹ 6,867 | ₹ 7,417 |
అబు ధాబి (UAE) | ₹ 6,867 | ₹ 7,417 |
మస్కట్ (ఒమన్) | ₹ 6,971 | ₹ 7,424 |
కువైట్ | ₹ 6,700 | ₹ 7,307 |
మలేసియా | ₹ 6,858 | ₹ 7,141 |
సింగపూర్ | ₹ 6,786 | ₹ 7,530 |
అమెరికా | ₹ 6,635 | ₹ 7,061 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 25,550 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: ఎయిర్ ఇండియా టిక్కెట్ మీద 25 శాతం డిస్కౌంట్, మరెన్నో స్పెషల్ ఆఫర్లు - వీళ్లకు మాత్రమే
Desert Cooler Vs Tower Cooler: డెజెర్ట్ కూలర్ లేదా టవర్ కూలర్ - మీ ఇంటికి ఏది బెస్ట్ ఛాయిస్?
OTP Scam: OTP స్కామ్ నుంచి మీ డబ్బును ఎలా రక్షించుకోవాలి, నకిలీ రిక్వెస్ట్‌ను ఎలా గుర్తించాలి?
New Money Rules: మార్చి నుంచి కొత్త ఫైనాన్షియల్ రూల్స్- తెలుసుకోకపోతే నష్టపోతారు!
UPI Lite New Feature: యూపీఐ లైట్ లావాదేవీలు, నిల్వ పరిమితి పెంపు - కొత్తగా ఓ సూపర్ ఫీచర్
Gold-Silver Prices Today 03 Mar: స్థిరంగా కొనసాగుతున్న పసిడి రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
MLC Results: గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫస్ట్ రౌండ్‌లో టీడీపీకి భారీ లీడ్ - ఈ ట్రెండ్ కొనసాగితే ఆలపాటి గెలుపు ఈజీనే !
Rashmika Mandanna: 'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
YSRCP On Amaravati: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
Revanth Reddy: ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు