search
×

ITR: మీకు ఈ-వెరిఫికేషన్‌ నోటీస్‌ రాకూడదనుకుంటే ఇలా చేయండి

కంప్లైయన్స్‌ పోర్టల్ ద్వారా సదరు టాక్స్‌ పేయర్‌కు సెక్షన్ 133(6) కింద నోటీసు పంపుతుంది.

FOLLOW US: 
Share:

ITR E-Verification: ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఐటీ రిటర్న్‌లు ఫైల్‌ చేస్తారు. అయితే, ప్రతి ఒక్క రిటర్న్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్‌ క్షుణ్నంగా పరిశీలించదు, పరిశీలించలేదు కూడా. కాబట్టి, ర్యాండమ్‌గా కొన్ని అప్లికేషన్స్‌ సెలెక్ట్‌ చేసి తనిఖీ చేస్తుంది. దానినే ఈ-వెరిఫికేషన్ అంటారు. ఈ-వెరిఫికేషన్‌ కోసం ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని వేల కేసులను మాత్రమే ఐటీ డిపార్ట్‌మెంట్‌ ఎంపిక చేస్తుంది. ఇలా సెలెక్ట్‌ చేసినవాటిని పూర్తిగా పరిశీలిస్తుంది, కొందరు టాక్స్‌ పేయర్లకు నోటీసులు పంపుతుంది. 

ఈ-వెరిఫికేషన్ ఎందుకు?
ఈ-వెరిఫికేషన్‌ స్కీమ్‌ ఉద్దేశం పన్ను ఎగవేతలు లేకుండా, టాక్స్‌ పేయర్లు ఏ సమాచారాన్ని దాచకుండా, నిజాయితీగా ఐటీఆర్‌ ఫైల్‌ చేసేలా చూడడం. ఒక టాక్స్‌ పేయర్‌కు సంబంధించి బ్యాంక్‌లు/ఆర్థిక సంస్థలు నుంచి వచ్చిన డేటాను.. పన్ను చెల్లింపుదారు ITR ద్వారా అందించిన సమాచారాన్ని ఐటీ డిపార్ట్‌మెంట్‌ పోల్చి చూస్తుంది. రెండు డేటాల్లో తేడా ఉండకూడదు. ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే రియాక్ట్‌ అవుతుంది. ఐటీ డిపార్ట్‌మెంట్‌, కంప్లైయన్స్‌ పోర్టల్ (compliance portal) ద్వారా సదరు టాక్స్‌ పేయర్‌కు సెక్షన్ 133(6) కింద నోటీసు పంపుతుంది. ఫైల్‌ చేసిన రిటర్న్‌లో సంబంధిత లావాదేవీ లేదా లావాదేవీలను చూపనందుకు వివరణ లేదా రుజువు కోరతుంది. పన్ను చెల్లింపుదారు కంప్లైయెన్స్ పోర్టల్‌లోనే సమాధానం చెప్పాలి. దీనికి డిపార్ట్‌మెంట్ సంతృప్తి చెందితే అక్కడితో ఆ సమస్య ముగిసినట్లే. సంతృప్తి చెందకపోతే రిటర్న్‌ను అప్‌డేట్ చేయమని అడుగుతుంది.

నోటీసు అందుకున్న తర్వాత ఏమి చేయాలి?
ఈ-వెరిఫికేషన్ స్కీమ్‌ కింద ఐటీ డిపార్ట్‌మెంట్‌ పంపిన నోటీసు కంప్లైయెన్స్ పోర్టల్‌లో కనిపిస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ అడ్రెస్‌కు కూడా అరెల్ట్‌ కూడా వస్తుంది. ఒకవేళ ఈ-వెరిఫికేషన్‌ నోటీసు అందుకుంటే.. ముందుగా ఆదాయపు పన్ను పోర్టల్ https://eportal.incometax.gov.in/ కి లాగిన్ అవ్వాలి. 'పెండింగ్ యాక్షన్స్‌' ట్యాబ్‌కు వెళ్లి, 'కంప్లయన్స్ పోర్టల్'పై క్లిక్ చేసి, 'eVerification'ని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్‌పై క్లిక్ చేయాలి. నోటీసును డౌన్‌లోడ్ చేయడానికి, డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్‌పై (DIN) క్లిక్ చేయాలి. సమాధానం ఇవ్వడానికి 'సబ్మిట్‌' లింక్‌పై క్లిక్ చేసి, సంబంధిత పత్రాలను జోడించి, సబ్మిట్‌ బటన్‌పై క్లిక్ చేయాలి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి
ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా ఈ-వెరిఫికేషన్ నోటీసు మీకు రాకూడదు అనుకుంటే, ITRను ఫైల్‌ చేసే ముందే AISను (Annual Information Statement) చూడండి. పన్ను చెల్లింపుదారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని ఖాతాలు AISలో ఉంటాయి. బ్యాంకు డిపాజిట్లు, షేర్ల కొనుగోలు, అమ్మకం వంటివాటిపై వడ్డీ ఆదాయాలు, లాభనష్టాలన్నీ అందులో కనిపిస్తాయి. AISలో ఉన్న లెక్కలు, మీ ITRలో ఉన్న లెక్కలు సరిపోయాయో లేదో చెక్‌ చేసుకోండి, తేడా ఉంటే తదనుగుణంగా మార్పులు చేయండి. ఒకవేళ ITR ఫైల్‌ చేసిన తర్వాత వ్యత్యాసాన్ని మీరు గుర్తిస్తే, అప్‌డేటెడ్‌ రిటర్న్‌ను ఫైల్ చేయండి. ఒక ఆర్థిక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అప్‌డేటెడ్‌ రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు, మళ్లీ మళ్లీ ఫైల్‌ చేయడం కుదరదు. మీకు సందేహాలు ఉంటే టాక్స్‌ అడ్వైజర్‌ లేదా CA సాయం తీసుకోండి. ఇన్‌కం టాక్స్‌ రిటర్న్ ఈ-వెరిఫికేషన్‌కు, ఈ-వెరిఫికేషన్ మధ్య కన్‌ఫ్యూజ్‌ కావద్దు. ఆ రెండూ వేర్వేరు విషయాలు. రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ముందే AIS తనిఖీ చేయండం చాలా ముఖ్యం. తద్వారా ITR ఫైల్ చేసేటప్పుడు ఎటువంటి పొరపాటు జరగదు, అప్‌డేటెడ్‌ రిటర్న్‌ను ఫైల్ చేయవలసిన అవసరం రాదు.

మరో ఆసక్తికర కథనం: ఇబ్బడిముబ్బడిగా పెరిగిన డబ్బు, అదృష్టవంతులంటే వీళ్లే!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 26 Jun 2023 03:26 PM (IST) Tags: Income Tax tax ITR AIS

ఇవి కూడా చూడండి

CIBIL Score: 'నేను ఇప్పటివరకు బ్యాంక్‌ లోన్‌ తీసుకోలేదు' - నా సిబిల్‌ స్కోర్‌ పెరుగుతుందా, తగ్గుతుందా?

CIBIL Score: 'నేను ఇప్పటివరకు బ్యాంక్‌ లోన్‌ తీసుకోలేదు' - నా సిబిల్‌ స్కోర్‌ పెరుగుతుందా, తగ్గుతుందా?

Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌

Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌

Gold-Silver Prices Today 27 Dec: రూ.600 పెరిగిన ప్యూర్‌ గోల్డ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 24K, 22K పసిడి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 27 Dec: రూ.600 పెరిగిన ప్యూర్‌ గోల్డ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 24K, 22K పసిడి ధరలు ఇవీ

SBI Special FD: ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్‌ స్కీమ్‌ స్టార్టెడ్‌

SBI Special FD: ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్‌ స్కీమ్‌ స్టార్టెడ్‌

New Rules 2025: కొత్త సంవత్సరం, కొత్త రూల్స్‌ - అన్నీ నేరుగా మీ పాకెట్‌పై ప్రభావం చూపేవే!

New Rules 2025: కొత్త సంవత్సరం, కొత్త రూల్స్‌ - అన్నీ నేరుగా మీ పాకెట్‌పై ప్రభావం చూపేవే!

టాప్ స్టోరీస్

Shock for YCP: వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !

Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ

Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ

TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?

TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?

Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?

Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?