search
×

ITR 2024: ఇల్లు అమ్మితే వచ్చిన లాభంపై ఎంత పన్ను కట్టాలి, సెక్షన్ 54 ప్రయోజనమేంటి?

Income from Residential Property: అద్దె ద్వారా ఆదాయం సంపాదించినా, లేదా ఆస్తిని అమ్మినా.. ఈ రెండు సందర్భాల్లోనూ పన్ను బాధ్యత (Tax Liability) ఉంటుంది.

FOLLOW US: 
Share:

Income Tax Return Filing 2024 - Income from Residential Property: రియల్ ఎస్టేట్‌లో, నివాసాల విభాగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది సంకోచించరు. ఎందుకంటే, ఇంటిని నమ్ముకుంటే దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా, స్థిరాస్తుల్లో పెట్టుబడుల వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి.. అద్దె రూపంలో తక్షణ ఆదాయం ప్రారంభమవుతుంది. రెండోది.. ఆస్తి విలువ కాలక్రమేణా పెరుగుతుంది, లాంగ్‌టర్మ్‌లో అమ్ముకుంటే భారీ మొత్తాన్ని ఆర్జించొచ్చు.

ఇంటి ఆస్తి నుంచి ఆదాయం సంపాదిస్తుంటే, దానిపై కచ్చితంగా ఆదాయ పన్ను కట్టాలి. అద్దె ద్వారా ఆదాయం సంపాదించినా, లేదా ఆస్తిని అమ్మినా.. ఈ రెండు సందర్భాల్లోనూ పన్ను బాధ్యత (Tax Liability) ఉంటుంది. అయితే, ఈ రెండు సందర్భాల్లో పన్ను బాధ్యత భిన్నంగా ఉంటుంది.

ఇంటిని అమ్మితే వచ్చే లాభంపై పన్ను
ఇంటిని అమ్మడం వల్ల వచ్చే లాభాన్ని మూలధన లాభంగా (Capital Gain) లెక్కిస్తారు. ఈ మూలధన లాభంపై రెండు రకాల పన్నులు ఉంటాయి. ఆ ఇంటిని కొన్న నాటి నుంచి 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత అమ్మితే వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా (LTCG) పరిగణిస్తారు. ఇండెక్సేషన్ బెనిఫిట్‌ ‍‌(Indexation Benefit) తర్వాత మూలధన లాభంపై 20% టాక్స్‌ చెల్లించాలి. కొన్న నాటి నుంచి 24 నెలల లోపు ఇంటిని విక్రయిస్తే వచ్చే లాభాన్ని స్వల్పకాలిక మూలధన లాభంగా (STCG) లెక్కిస్తారు. ఈ లాభం టాక్స్‌పేయర్‌ ఆదాయానికి యాడ్‌ చేయాలి, మొత్తం ఆదాయంపై వర్తించే స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి.

క్యాపిటల్‌ గెయిన్‌ టాక్స్‌ను సేవ్‌ చేయొచ్చు
కొన్ని సందర్భాల్లో, ఇంటిని అమ్మితే వచ్చే లాభంపై పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఇన్‌కమ్‌ టాక్స్‌ యాక్ట్‌లోని సెక్షన్ 54 ప్రకారం, ఒక ఇంటిని విక్రయించడం వల్ల వచ్చే డబ్బుతో మరో ఇంటిని కొంటే పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రయోజనం లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ విషయంలో మాత్రమే వర్తిస్తుంది. 

"నివాస ఆస్తి (Residential property) కొనుగోలు/నిర్మాణానికి మాత్రమే" మూలధన లాభం ఉపయోగించాలని సెక్షన్ 54 స్పష్టంగా చెబుతోంది. వాణిజ్య ఆస్తి ‍‌(Commercial property) కొనుగోలుకు ఈ రూల్‌ వర్తించదు. ఓపెన్‌ ప్లాట్‌ కొని ఇల్లు కట్టినా కూడా ఈ మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. లాభం రూపంలో వచ్చిన డబ్బుతో ఓపెన్‌ ఫ్లాట్‌ కొని వదిలేస్తే ఈ బెనిఫిట్‌ వాడుకోలేం, కచ్చితంగా ఇల్లు నిర్మించాలి. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి, రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ నుంచి వచ్చే క్యాపిటల్‌ గెయిన్‌లో రూ.10 కోట్ల వరకే టాక్స్‌ బెనిఫిట్‌ పొందొచ్చు. రూ.10 కోట్లు దాటితే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాలి.

ఎంత కాలం వరకు టాక్స్‌ బెనిఫిట్‌ వర్తిస్తుంది?
సెక్షన్ 54 ప్రకారం పన్ను మినహాయింపు పొందడానికి, పాత ఆస్తిని అమ్మిన తేదీ నుంచి 2 సంవత్సరాల లోపు కొత్త ఇంటిని కొనుగోలు చేయాలి. ఇంటి నిర్మాణం చేపడితే మూడేళ్ల లోపు దానిని పూర్తి చేయాలి. ఒకవేళ, నివాస ఆస్తిని అమ్మడానికి ఒక సంవత్సరం ముందు కొత్త ఇంటిని కొనుగోలు చేసినా కూడా టాక్స్‌ బెనిఫిట్‌ కోసం క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

అద్దె ఆదాయంపై పన్ను బాధ్యత
అద్దె రూపంలో ఆదాయం వస్తుంటే ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌లో దానిని కచ్చితంగా చూపించాలి. 'అదర్‌ ఇన్‌కమ్‌' హెడ్‌ కింద ఈ ఆదాయాన్ని రిపోర్ట్‌ చేయాలి. తద్వారా, ఇది టాక్స్‌పేయర్‌ టోటల్‌ ఇన్‌కమ్‌లో కలుస్తుంది, స్లాబ్ సిస్టమ్‌ ప్రకారం టాక్స్‌ పే చేయాల్సి ఉంటుంది.

మరో ఆసక్తికర కథనం: ఇదన్నమాట సంపన్నుల సీక్రెట్‌, ఎక్కువ పెట్టుబడులు వీటిలోకే!

Published at : 29 Feb 2024 12:04 PM (IST) Tags: Income Tax it return capital gains tax residential property ITR 2024

ఇవి కూడా చూడండి

Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!

Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!

SBI Loan: లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు

SBI Loan: లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు

Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్‌ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్‌!

Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్‌ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్‌!

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!

టాప్ స్టోరీస్

Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి

Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి

Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు

Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు

BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర

BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు

This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy