By: Arun Kumar Veera | Updated at : 10 Feb 2024 09:03 AM (IST)
ఫామ్-12B &12BA కూడా కచ్చితంగా సబ్మిట్ చేయాలి!
Income Tax Return Filing 2024: 2023-24 ఫైనాన్షియల్ ఇయర్‌కు (2024-25 అసెస్‌మెంట్ ఇయర్) ఆదాయ పన్ను పత్రాలు సమర్పించే సీజన్ దగ్గర పడుతోంది. పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, ప్రస్తుతం, దీనికి సంబంధించిన అన్ని రకాల పత్రాలను సేకరించే పనిలో పడ్డారు. ఐటీ రిటర్న్‌కు సంబంధించిన అన్ని ఫారాలు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో (https://www.incometax.gov.in/iec/foportal/) ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి, ఏప్రిల్ 01 నుంచి ఫైలింగ్ ప్రారంభించొచ్చు.
కొంతమంది ఉద్యోగులు సంవత్సరాల తరబడి ఒకేచోట పని చేస్తుంటారు, మరికొంతమంది వివిధ కారణాల వల్ల ఉద్యోగాలు మారతారు. ప్రస్తుత ఒక ఆర్థిక సంవత్సరంలో (01 ఏప్రిల్ 2023 - 31 మార్చి 2024 కాలంలో) ఉద్యోగం మారని వాళ్లకు టాక్స్ రిటర్న్ ఫైలింగ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎప్పటిలాగే ITR (Income tax return) ఫైల్ చేయొచ్చు. కానీ.. ఈ ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉద్యోగం మారిన వాళ్లు/ 2024 మార్చి 31 లోపు మరో ఉద్యోగంలోకి మారాలని భావిస్తున్న వాళ్లు, తమ ఆదాయ వివరాలు ప్రకటించే సమయంలో మరో రెండు డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి.
2023-24 ఫైనాన్షియల్ ఇయర్‌లో మీరు ఎన్ని ఉద్యోగాలు మారితే అన్ని ఫామ్-16 (Form-16) తీసుకోవాలి. అంటే.. ప్రస్తుత కంపెనీ నుంచి ఫామ్-16 తీసుకోవాలి & పాత కంపెనీ/కంపెనీల నుంచి కూడా సేకరించాలి. ఈ మొత్తం వివరాలతో రిటర్న్ ఫైల్ చేయాలి.
ఇన్‌కమ్ టాక్స్ ఫామ్-12B &ఫామ్-12BA
ఒక ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉద్యోగం మారిన వాళ్లకు ఐటీ ఫామ్-12B, ఫామ్-12BA వర్తిస్తాయి. పాత కంపెనీ నుంచి మీరు సంపాదించిన జీతం, TDS వివరాలను కొత్త కంపెనీకి వెల్లడించేదే ఫామ్-12B. కంపెనీ మారిన ప్రతి ఉద్యోగి, ఆ ఆర్థిక సంవత్సరంలో మార్చి 31వ తేదీ ముందు వరకు చేసిన అన్ని పెట్టుబడులకు సంబంధించిన రుజువులను కూడా కొత్త యాజమాన్యానికి సబ్మిట్ చేయాలి. దీనివల్ల, ప్రస్తుత యజమాన్యం మీ జీతంలో ఒకే కటింగ్‌ను మరోమారు రిపీట్ కాకుండా చూస్తుంది. ఫలితంగా మీకు జీతం నష్టం ఉండదు.
ఇన్‌కం టాక్స్ ఫామ్-12BAను కూడా కొత్త కంపెనీకి సదరు ఉద్యోగి సమర్పించాలి. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల నైపుణ్యం, పనితీరు, హోదా ఆధారంగా జీతానికి అదనంగా కొన్ని బెనిఫిట్స్ అందిస్తాయి. వాటిని పెర్క్విసైట్స్ లేదా పెర్క్స్ (Perquisites or Perks) అని పిలుస్తారు. ఈ ప్రయోజనాలు నగదు రూపంలో ఉండొచ్చు, లేదా ఇతర రూపాల్లోనూ ఉండవచ్చు. ఉదాహరణకు... ఉద్యోగి పిల్లల కోసం ఉచిత/రాయితీతో కూడిన విద్య, వడ్డీ లేని రుణం, ఆరోగ్య సంరక్షణ, కంపెనీ తరపున బీమా, క్రెడిట్ కార్డ్, అద్దె లేని ఇల్లు, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ప్లాన్ (ESOP) వంటివి పెర్క్స్ పరిధిలోకి వస్తాయి. ఒకవేళ సదరు ఉద్యోగి వీటికి ముందుగా డబ్బు చెల్లించినా, కంపెనీ ఆ మొత్తాన్ని అతనికి రిఫండ్ చేసి ఉండొచ్చు. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఫామ్-12BAలో ఉంటాయి. ఈ ఫారాన్ని కూడా ఆ ఉద్యోగి తన కొత్త కంపెనీకి అందించాలి. ఈ వివరాలన్నింటినీ, తాను ఇచ్చే ఫామ్ 16లో కొత్త కంపెనీ పొందుపరుస్తుంది.
మరో ఆసక్తికర కథనం: సుకన్య సమృద్ధి యోజనతో రూ.70 లక్షలు కూడబెట్టొచ్చు, పక్కా లెక్క ఇదిగో
Silver Shortage : దీపావళికి ముందే దేశంలో వెండి కొరత? ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
RBI Offline Digital Rupee: డిజిటల్ రూపాయి యాప్ వచ్చేసింది! ఇంటర్‌నెట్ లేకపోయినా చెల్లింపు చేయొచ్చు!
Guinness Record Credit Cards: 1638 క్రెడిట్ కార్డులతో మనీష్ గిన్నిస్ రికార్డ్ - ఒక్క రూపాయి అప్పులేదు కానీ వాటితో ఆదాయమే ఆదాయం !
EPFO 100 Percent Withdraw: EPFO నుంచి 100 శాతం డబ్బును ఒకేసారి ఎలా విత్‌డ్రా చేయవచ్చు? చాలా సులభమైన మార్గం తెలుసుకోండి!
Gold Price: బంగారం ధంతేరస్‌కు 1.50 లక్షల మార్కు దాటుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Crime News: ఏపీలో దారుణం, కత్తితో బెదిరించి రైలులో మహిళపై అత్యాచారం
KTR : జూబ్లీహిల్స్ ఓటర్ లిస్టులో 20,000 ఫేక్ ఓట్లు - కాంగ్రెస్ ఓట్ చోరీ చేసిందని KTR ఆరోపణలు- తెలంగాణ భవన్‌లో ప్రజెంటేషన్
Meesaala Pilla Song: ట్రెండింగ్‌లో 'మీసాల పిల్ల' సాంగ్ - 'మన శంకరవరప్రసాద్ గారి' ఎనర్జీ డబుల్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - చీఫ్ ఫోన్ పోలీసులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం