By: Arun Kumar Veera | Updated at : 07 Dec 2024 01:07 PM (IST)
డిసెంబర్ నెలలో కీలక తేదీలు ( Image Source : Other )
Important Dates Of December: 2024వ సంవత్సరం చివరి నెలలో ఇప్పుడు ఉన్నాం, మరికొన్ని రోజుల్లో ఈ నెలతో పాటు సంవత్సరం కూడా పూర్తవుతుంది. సంవత్సరాంతంలోకి వచ్చిన నేపథ్యంలో, కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి తుది గడువు కూడా ముగింపు అంచున ఉంది. ఆ ముఖ్యమైన పనుల్లో... ఆధార్ కార్డ్ అప్‌డేట్ (Aadhar Card Update), ఆదాయ పన్ను పత్రాల సమర్పణ (ITR Filing), క్రెడిట్ కార్డ్ వడ్డీ రేటు (Credit Card Interest Rate), స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (Special Fixed Deposit) వంటివి ఉన్నాయి.
ఆదాయ పన్ను పత్రాల సమర్పణ
మీరు 2023-24 ఆర్థిక సంవత్సరానికి (FY 2023-24) ఇప్పటికీ ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, మీకు ఈ నెలాఖరు (డిసెంబర్ 31) వరకు సమయం ఉంది. ఇది కాకుండా, అడ్వాన్స్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి గడువు డిసెంబర్ 15 తేదీ. 2025 మార్చి 15లోగా 100 శాతం అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. ముందస్తు పన్నులో 45 శాతాన్ని సెప్టెంబర్ 15లోగా; 75 శాతాన్ని డిసెంబర్ 15లోగా; 100 శాతం మొత్తాన్ని మార్చి 15లోగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డ్ అప్‌డేట్
మీ ఆధార్ కార్డ్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఫోటోను మార్చాలనుకుంటే, ఇప్పుడు ఆ పనులను ఆన్‌లైన్‌లో పూర్తి ఉచితంగా పూర్తి చేయొచ్చు. దీనికి డిసెంబర్ 14 వరకు గడువుంది. ఆధార్ కార్డ్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేయడానికి myAadhaar పోర్టల్‌ను సందర్శించాలి. ఈ డేట్ మిస్ అయితే, అప్‌డేట్ పూర్తి చేయడానికి కొంత ఫీజ్ చెల్లించాలి. ఆధార్ కేంద్రానికి వెళ్లి కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు, అక్కడ కూడా కొంత రుసుము చెల్లించాలి.
మంచి రాబడి ఇచ్చే స్పెషల్ ఎఫ్‌డీలు - మిస్ కావద్దు!
IDBI బ్యాంక్ 300, 375, 444 & 700 రోజులలో మెచ్యూర్ అయ్యే FDలపై "ఉత్సవ్ FD" పథకం కింద మంచి రాబడిని అందిస్తోంది. పంజాబ్ & సింధ్ బ్యాంక్ కూడా వివిధ మెచ్యూరిటీ పీరియడ్‌లతో కూడిన FDలపై మెరుగైన రాబడిని ఇస్తోంది. ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంది. వీటి సంగతి పక్కనబెడితే... RBI MPC తదుపరి మీటింగ్ (ఫిబ్రవరి 2025) నుంచి వడ్డీ రేట్లు తగ్గొచ్చని గట్టి అంచనాలు ఉన్నాయి. కాబట్టి, ఏ రకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద అయినా గరిష్ట వడ్డీ ప్రయోజనం పొందాలంటే, పెట్టుబడికి ఇదే సరైన సమయం అని నిపుణులు చెబుతున్నారు.
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై వడ్డీ
యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), తన క్రెడిట్ కార్డ్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను డిసెంబర్ 20 నుంచి మార్చబోతోంది. ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (Airtel Axis Bank Credit Card)పై వడ్డీ రేటును నెలకు 3.60 శాతం నుంచి 3.75 శాతానికి పెంచబోతోంది.
ఈ ఆర్థిక గడువును మీ క్యాలెండర్‌లో, చూడగానే మీకు కనిపించేలా గుర్తు పెట్టండి. తద్వారా, వీటి ద్వారా ప్రయోజనాలను కోల్పోకుండా పనులను సకాలంలో పూర్తి చేయవచ్చు.
మరో ఆసక్తికర కథనం: QR కోడ్‌తో ఉన్న కొత్త పాన్ కార్డ్ కావాలా? - ఇలా అప్లై చేయండి
UIDAI New Rule: ఏదైనా హోటల్‌లో ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు! కొత్త నిబంధన గురించి తెలుసా?
Post Office Scheme : ఈ పోస్టాఫీసు పథకంలో ఒకసారి డబ్బులు జమ చేయండి నెలకు ₹5,550 గ్యారెంటీ పెన్షన్ వడ్డీని పొందండి!
RBI Key Decisions: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
IndiGo Flight Crisis : ఈ తేదీ వరకు ఇండిగో టికెట్ రద్దు చేస్తే పూర్తి రీఫండ్! పూర్తి వివరాలు తెలుసుకోండి!
Airtel Recharge Plan: ఎయిర్టెల్ వినియోగదారులకు బిగ్ షాక్ ! రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను సైలెంట్‌గా క్లోజ్!
HYD Lover Death: ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
Parakamani case: పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్
Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 94 రివ్యూ... కళ్యాణ్ తో కూతురు తీరుపై భరణి అవాక్కయ్యే కామెంట్స్... చచ్చేదాకా చంపుతారా? అంటూ ఒక్కసారిగా బరస్ట్ అయిన సంజన