By: Arun Kumar Veera | Updated at : 07 Feb 2024 02:54 PM (IST)
ఐటీఆర్-1 ఎవరు ఫైల్ చేయకూడదు?
Income Tax Return Filing 2024: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY 2023-24) మరో 50 రోజుల్లో ముగుస్తుంది. సాధారణంగా, ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ (Income Tax Rules) ప్రకారం రిటర్న్ ఫైల్ చేయడానికి ఏటా జులై 31 వరకే టైమ్ ఇస్తారు. ఈ గడువు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయాలంటే పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.
ఆదాయ పన్ను ఫైలింగ్ కోసం ఎక్కువ మంది ఎంచుకునే ఫామ్ ITR-1. సర్వసాధారణంగా, జీతభత్యాల ద్వారా ఆదాయం సంపాదించేవాళ్లు దీనిని ఎంచుకుంటారు. ఐటీఆర్-1 ఫారాన్ని సహజ్ ఫామ్ అని కూడా అంటారు.
ఐటీఆర్-1 ఫామ్ ఫైల్ చేసేందుకు ఎవరు అర్హులు? (Who is eligible to file ITR-1 form?)
సాధారణ పన్ను చెల్లింపుదార్లు ITR-1 ఫారం ద్వారా తమ ఆదాయం, పన్ను బాధ్యతను ప్రకటిస్తారు. జీతం, డివిడెండ్, బ్యాంకు వడ్డీ, ఒక ఇంటి ఆస్తి, వ్యవసాయం ద్వారా వార్షిక ఆదాయం రూ. 5000 మించని వ్యక్తి (individual), ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఈ ఫారాన్ని ఎంచుకోవాలి. వార్షిక ఆదాయం రూ. 50 లక్షల వరకు ఉన్న టాక్స్ పేయర్లు ఈ ఫామ్ ద్వారా రిటర్న్ సమర్పించవచ్చు.
ఐటీఆర్-1 ఫారం ఎవరి కోసం కాదు? (Who is not eligible to file ITR-1 form?)
టాక్స్ పేయర్ పన్ను చెల్లించదగిన ఆదాయం రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అతను ITR-1 ఫారం ద్వారా రిటర్న్ ఫైల్ చేయకూడదు.
ఒక వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్, బంగారం, ఈక్విటీ షేర్లు, ఇతర వనరుల నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తే, అతను ITR-1 ఎంచుకోకూడదు.
గుర్రపు పందాలు, లాటరీలు, చట్టబద్ధమైన జూదం వంటి ఆస్తి లేదా సేవల నుంచి ఒక వ్యక్తి ఆదాయం సంపాదించినట్లయితే, అతను కూడా ITR-1 ఫైల్ చేయడానికి అర్హుడు కాదు.
ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తుల ద్వారా ఆదాయం వస్తుంటే, అతను కూడా ITR-1 ఫైల్ చేయలేడు.
NRI (Non-Resident Indian) కూడా ITR-1 ఫైల్ చేయడానికి అర్హుడు కాదు.
బ్యాంక్ నుంచి నగదు విత్‌డ్రా చేస్తున్నప్పుడు, ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లోని సెక్షన్ 194N ప్రకారం TDS (Tax Deducted at Source) కట్ అయితే, అలాంటి టాక్స్ పేయర్ ITR-1 ఫామ్ ఉపయోగించకూడదు.
హిందు అవిభక్త కుటుంబం (HUF), సంస్థలు/కంపెనీలు కూడా ITR-1ని ఫైల్ చేయకూడదు.
అర్హత లేనప్పటికీ ITR-1 ఫైల్ చేస్తే ఏమవుతుంది?
ITR-1 ఫైల్ చేయడానికి అర్హత లేని వ్యక్తి పొరపాటున అదే ఫారం ద్వారా తన ఆదాయ వివరాలు ప్రకటిస్తే, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసు (Income Tax Department Notice) రావచ్చు. అయితే, భయపడాల్సిన అవసరం లేదు. తప్పుడు ఫారం ఫైల్ చేశారని మాత్రరే ఆ నోటీసులో ఉంటుంది. అప్పుడు, IT నోటీసు అందిన తేదీ నుంచి 15 రోజుల లోపు ఆ అసెసీ మళ్లీ సరైన ఫారాన్ని దాఖలు చేయాలి. లేకపోతే, మొదట పంపిన ITR చెల్లకుండా పోతుంది. ఆ తర్వాత, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
మరో ఆసక్తికర కథనం: రిటర్న్ ఫైలింగ్‌లో పాత పద్ధతి బెటరా, కొత్త పద్ధతి బెటరా? సింపుల్‌గా డిసైడ్ చేయొచ్చు
SBI ATM Transaction Fees:ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Best Business Plan: గ్రామంలో పిండి మరను ఎలా తెరవవచ్చు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది?
Today Gold and Silver Prices: నేడు బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో చూడండి! 10 గ్రాముల పసిడి కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది?
PF Salary Limit: పీఎఫ్ జీతాల పరిమితి 25-30 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం! దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన