By: ABP Desam | Updated at : 16 Mar 2023 03:19 PM (IST)
Edited By: Arunmali
పొదుపు ఖాతాపై ఏ బ్యాంక్‌లో ఎక్కువ వడ్డీ వస్తుందో తెలుసా?
Best Interest Rates: ప్రస్తుతం, చాలా బ్యాంకులు సేవింగ్స్ ఖాతాపై మంచి వడ్డీని ఇవ్వడం ప్రారంభించాయి. పొదుపు ఖాతాలపై ఫిక్స్‌డ్ డిపాజిట్లకు దాదాపు సమానమైన వడ్డీని ఇచ్చే బ్యాంకులు కూడా కొన్ని ఉన్నాయి. అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో సీనియర్ సిటిజన్‌లకు అధిక వడ్డీ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది, సేవింగ్స్ అకౌంట్ల విషయంలో ఈ ఆప్షన్ లేదు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన రెపో రేటును పెంచిన తర్వాత, డిపాజిట్ల సేకరణ కోసం చాలా బ్యాంకులు పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచాయి. SBI, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌ల పొదుపు ఖాతాల వడ్డీ గురించిన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు ఖాతాపై వడ్డీ (Interest Rate on SBI Savings Account)
దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన SBI, సేవింగ్స్ ఖాతాలో రూ. 10 కోట్ల వరకు డిపాజిట్ల మీద 2.70 శాతం వడ్డీని, రూ. 10 కోట్ల కంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద 3 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పొదుపు ఖాతాపై వడ్డీ (Interest Rate on HDFC Bank Savings Account)
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సేవింగ్స్ ఖాతాలోని రూ. 50 లక్షల కంటే తక్కువ విలువైన డిపాజిట్ల మీద 3 శాతం వడ్డీని చెల్లిస్తోంది. రూ. 50 లక్షల కంటే మించిన డిపాజిట్ల మీద 3.50 శాతం వడ్డీని ఇస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంక్ పొదుపు ఖాతాపై వడ్డీ (Interest Rate on ICICI Bank Savings Account)
ఈ బ్యాంకులో రూ. 50 లక్షల వరకు ఉన్న డిపాజిట్ల మీద 3% వడ్డీ అందుతుంది. అదే సమయంలో, రూ. 50 లక్షల కంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద 3.50 శాతం వడ్డీ అందుతుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ పొదుపు ఖాతాపై వడ్డీ (Interest Rate on PNB Savings Account)
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 10 లక్షల వరకు విలువైన డిపాజిట్ల మీద 2.70 శాతం వడ్డీని చెల్లిస్తోంది. రూ. 10 లక్షల కంటే పైబడి విలువున్న డిపాజిట్ల మీద 2.75 శాతం వడ్డీ ఇస్తోంది. ఇదే సమయంలో, 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న డిపాజిట్ల మీద 3 శాతం వడ్డీ ఇవ్వబడుతుంది.
కెనరా బ్యాంక్ పొదుపు ఖాతాపై వడ్డీ (Interest Rate on Canara Bank Savings Account)
కెనరా బ్యాంక్ వివిధ మొత్తాల మీద 2.90 శాతం నుంచి 4 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. 2000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద గరిష్టంగా 4 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
యూనియన్ బ్యాంక్ పొదుపు ఖాతాపై వడ్డీ (Interest Rate on Union Bank Savings Account)
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 50 లక్షల డిపాజిట్ల మీద 2.75 శాతం, రూ. 50 లక్షల నుంచి 100 కోట్ల వరకు డిపాజిట్లపై 2.90 శాతం వడ్డీ ఇస్తోంది. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద 3.10 శాతం వడ్డీ ఇస్తోంది. రూ. 500 కోట్లకు పైగా ఉన్న డిపాజిట్ల మీద వార్షిక వడ్డీగా 3.40 శాతం చెల్లిస్తోంది. రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద అత్యధికంగా 3.55 శాతం వడ్డీ ఇస్తోంది.
Investment Tips: ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
Gold-Silver Prices Today 19 Nov: మార్కెట్‌లో మళ్లీ 'గోల్డ్ రష్, సిల్వర్ షైనింగ్' - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Stock Market Trading: ట్రేడింగ్‌లో రూ.50 లక్షల కోట్ల నష్టం - ఈ 5 తప్పులతో 'శని'ని రెడ్ కార్పెట్ వేసి పిలిచినట్లే!
Income Tax: ఆ వివరాలు వెల్లడించకపోతే రూ.10 లక్షలు ఫైన్ - ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వార్నింగ్
High Interest: ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ధనలక్ష్మికి నకళ్లు - అధిక రాబడికి గ్యారెంటీ
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Hydra Commissioner: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్ రంగనాథ్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?