By: Arun Kumar Veera | Updated at : 09 Mar 2024 01:11 PM (IST)
పోస్టాఫీస్ పొదుపు పథకాలపై కీలక ప్రకటన
Small Saving Schemes New Interest Rates: చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం, ఈసారి కామన్ మ్యాన్‌కు ఎలాంటి వరం ఇవ్వకుండానే సమీక్షను ముగించింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి వడ్డీ రేట్లను ( Interest Rates For April-June Quarter 2024) స్థిరంగా ఉంచింది.
దేశంలో అమలవుతున్న చిన్న మొత్తాల పొదుపు పథకాలపై మార్చి 08న (శుక్రవారం) సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం, రాబోయే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి వడ్డీ రేట్లను (Small Saving Schemes Interest Rates For Q1 FY 2024-25) యథాతథంగా కొనసాగించింది. కనీసం ఒక్క పొదుపు పథకానికైనా వడ్డీ రేటును మార్చకపోవడం గత 7 త్రైమాసికాల్లో ఇదే తొలిసారి.
వడ్డీ రేట్లపై ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం, 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై ఇంట్రస్ట్ రేట్లు 01 ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభమై 30 జూన్ 2024తో ముగుస్తాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం... 2024 జనవరి 01 మార్చి 31 వరకు అమలైన వడ్డీ రేట్లే ఏప్రిల్ 01 నుంచి జూన్ 30 వరకు వర్తిస్తాయి.
చిన్న పథకాలపై అమల్లో ఉన్న వడ్డీ రేట్లు
సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana Interest Rate) ---- వడ్డీ రేటు 8.20 శాతం
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS Interest rate) ---- వడ్డీ రేటు 8.20 శాతం
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC Interest rate) ---- వడ్డీ రేటు 7.70 శాతం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF Interest rate) ---- వడ్డీ రేటు 7.10 శాతం
కిసాన్ వికాస్ పత్ర (KVP Interest rate) ---- వడ్డీ రేటు 7.50 శాతం (115 నెలల మెచ్యూరిటీ కాలం)
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS Interest rate) ---- వడ్డీ రేటు 7.40 శాతం
పొదుపు ఖాతా ---- వడ్డీ రేటు 4.00 శాతం
1 సంవత్సరం టైమ్ డిపాజిట్ ---- వడ్డీ రేటు 6.90 శాతం
2 సంవత్సరాల కాల డిపాజిట్ ---- వడ్డీ రేటు 7.00 శాతం
3 సంవత్సరాల కాల డిపాజిట్ ---- వడ్డీ రేటు 7.10 శాతం
5 సంవత్సరాల కాల డిపాజిట్ ---- వడ్డీ రేటు 7.50 శాతం
5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ ---- వడ్డీ రేటు 6.70 శాతం
PPF పెట్టుబడిదార్లకు మళ్లీ నిరాశ
స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో PPF (Public Provident Fund) బాగా పాపులర్ అయింది. ఈ అకౌంట్‌లో జమ చేసే మొత్తంలో, మెచ్యూరిటీ అమౌంట్‌కు ఆదాయ పన్ను వర్తించదు. ఈ పథకంపై వడ్డీ రేటు ఈసారి కూడా మారలేదు, దీనిపై గతంలోలాగే 7.10 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం కొనసాగించింది. PPFపై వడ్డీ రేటును 2020 ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం మార్చలేదు.
చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు ఎందుకు మారలేదు?
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ఒక ఫార్ములా ప్రకారం నిర్ణయిస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలపై రాబడుల ఆధారంగా 0-100 బేసిస్ పాయింట్ల పరిధిలో మార్పులు చేస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలపై రాబడి (బాండ్ ఈల్డ్) పడిపోయినప్పుడు, చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కూడా తగ్గించాలి. ప్రభుత్వ బాండ్ ఈల్డ్ పడిపోయినప్పటికీ, Q1 FY 2024-25 కాలానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గించలేదు.
మరో ఆసక్తికర కథనం: రూ.67,000 దాటిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
Gold Investment: స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ లాభం ఇచ్చిన పెట్టుబడి ఇది - డబ్బుల వర్షంలో తడిసిన ఇన్వెస్టర్లు
Aadhaar Card: మీ ఆధార్ కార్డు పోయిందా?, ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా డూప్లికేట్ ఆధార్ కార్డ్ పొందొచ్చు
LIC Kanyadan Policy: మీ కుమార్తె భవిష్యత్ కోసం ఒక తెలివైన నిర్ణయం - దాదాపు రూ.23 లక్షలు లబ్ధి!
Gold-Silver Prices Today 16 Feb: ఓ మెట్టు దిగి వచ్చిన పసిడి రేటు - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Inactive Credit Card: క్రెడిట్ కార్డ్‌ను పక్కన పడేశారా? - మీ క్రెడిట్ స్కోర్ మీ చేతులారా పాడు చేసుకుంటున్నట్లే!
Revanth Reddy: ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్