search
×

Social Media Income Tax: కంటెంట్ క్రియేటర్స్‌కు వార్నింగ్; సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ నిఘా! దాస్తే జైలు శిక్ష తప్పదా?

Social Media Income Tax: సోషల్‌ మీడియా కంటెంట్ క్రియేటర్లు సంపాదనపై ఐటీ శాఖ నిఘా ఉంది. వచ్చిన ఆదాయంపై రిటర్న్‌లలో చూపితే నోటీసులు, పెనాల్టీలు, వడ్డీ, జైలు శిక్ష వంటి తీవ్రమైన ఇబ్బందులను నివారించగలరు.

FOLLOW US: 
Share:

Social Media Income Tax: ఆధునిక డిజిటల్ యుగంలో పెరుగుతున్న సాంకేతికతను ప్రజలకు విస్తృతంగా వాడుకుంటున్నారు. అంతే కాదు దాన్ని ఓ సంపాదన మార్గంగా కూడా మలుచుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాను వేదికంగా చేసుకొని కంటెంట్ క్రియేట్ చేసి రెగ్యులర్ ఉద్యోగాల కంటే ఎక్కువగా సంపాదిస్తున్న వారు ఉన్నారు. మరికొందరు దీన్నే ప్రధాన వృత్తిగా కూడా మార్చుకుంటున్నారు.

కంటెంట్ క్రియేషన్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టిన వాళ్లు వారి సంపాదన గురించి, ఇతర ఆదాయాలు గురించి ఐటీ రిటర్న్స్‌లో ఫైల్ చేస్తుంటారు. వేరే పని చేస్తూ సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించే వాళ్లు, దీన్ని ఐటీ రిటర్న్స్‌లో చూపించడని వాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి వారు కచ్చితంగా డేంజర్ జోన్‌లో పడతారు. సోషల్ మీడియా కూడా ఓ సంపాదన మార్గంగా మారినందున ఐటీ శాఖ వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. నిత్యం ప్రతి పౌరుడి ఆర్థిక లావాదేవీలపై నిగా ఉంటోంది. ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చినందున ఏ మాత్రం తేడా ఉన్నా వెంటనే అధికారులకు సమాచారం చేరిపోతోంది. దీంతో  అనుమానాస్పద లావాదేవీలపై 8 ఏళ్లలో ఎప్పుడైనా నోటీసులు వచ్చే ఆస్కారం ఉంది. అప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాలి. 

స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సౌలభ్యంతో యువతరం తమ సృజనాత్మకతను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ సహా ఇతర వేదికల్లో ప్రదర్శిస్తూ లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయాన్ని కేవలం 'పాకెట్ మనీ'గా మాత్రమే ప్రభుత్వాలు చూడటం లేదు. దీన్ని కూడా చట్ట ప్రకారం పన్ను విధించదగిన 'ఆదాయ వనరు'గా భారత ప్రభుత్వం పరిగణిస్తోంది. ఈ ఆదాయాన్ని ఐటీ రిటర్న్‌లలో చూపించకపోతే ఎదురయ్యే తీవ్ర పరిణామాలపై ఆదాయపు పన్ను శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది.

1. సోషల్ మీడియా ఆదాయం – చట్టం దృష్టిలో ఎలా చూస్తుంది?

సోషల్ మీడియాలో డబ్బు సంపాదించడం (ఉదాహరణకు స్పాన్సర్‌షిప్‌లు, యాడ్ రెవెన్యూ, అఫిలియేట్ మార్కెటింగ్ మొదలైనవి) భారతదేశంలో ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణిస్తోంది.

ఐటీ చట్టం ప్రకారం ఈ ఆదాయాన్ని ప్రధానంగా రెండు విభాగాలుగా వర్గీకరిస్తారు:

1. వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం : కంటెంట్ క్రియేటర్లు సృష్టికర్త లేదా ఇన్‌ఫ్లూయెన్సర్ దీన్ని ప్రధాన వృత్తిగా, క్రమం తప్పకుండా నిర్వహిస్తే ఈ విభాగం కింద చూపించాల్సి ఉంటుంది.

2. ఇతర వనరుల నుంచి ఆదాయం : సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేషన్ అప్పుడప్పుడు లేదా అనుకోకుండా వచ్చే ఆదాయం అయినప్పుడు ఈ విభాగంలో పరిధిలోకి వస్తారు.  

చాలా మంది ఇన్‌ఫ్లూయెన్సర్‌లు తమ యాక్టివిటీని ఒక వృత్తిగా నిర్వహిస్తారు కాబట్టి, వారు తమ ఆదాయాన్ని 'వ్యాపారం/వృత్తి' విభాగం కింద చూపించాలి.

2. ఎప్పుడు చూపించాలి? మినహాయింపు పరిమితి ఎంత?

మీరు సోషల్ మీడియా ద్వారా సంపాదించిన మొత్తం ఆదాయం, ఇతర వనరుల నుంతి వచ్చే ఆదాయంతో కలిపి, ప్రస్తుత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి కంటే ఎక్కువగా ఉంటే, కచ్చితంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేసి, ఈ ఆదాయాన్ని చూపించాలి. మినహాయింపు పరిమితి కంటే మీ ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీకు ఆస్తులు లేదా విదేశీ ఆదాయం వస్తున్నట్టు అయితే ఇలా చేయాలి.  

నికర ఆదాయాన్ని ఎలా లెక్కించాలి?

ఇక్కడ కంటెంట్‌ క్రియేటర్స్‌కు ఉన్న ముఖ్యమైన సౌలభ్యం ఏమిటంటే, వారు తమ స్థూల ఆదాయం నుంచి సంబంధిత ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఆదాయం సంపాదించడానికి అయిన ఖర్చులను తగ్గించిన తర్వాతే నికర ఆదాయం మీద పన్ను లెక్కిస్తారు.  

ఎలాంటి ఖర్చులు చూపించి తగ్గించుకోవచ్చు:
• వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు.
• ఇంటర్నెట్ బిల్లులు.
• కెమెరాలు, మైక్రోఫోన్‌లు వంటి పరికరాల కొనుగోలు 
• స్టూడియో రెంట్లు లేదా ఇతర వృత్తిపరమైన ఖర్చులు.

ఈ ఖర్చులకు సంబంధించిన రికార్డులు (బిల్లులు, ఇన్వాయిస్‌లు) స్పష్టంగా రిటర్న్‌లలో చూపించాలి.  

3. చిన్న క్రియేటర్లకు ఉపశమనం: సెక్షన్ 44ADA

చిన్న, మధ్యస్థాయి కంటెంట్ క్రియేటర్స్‌కు, పన్నుల విధానాన్ని సరళతరం చేయడానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 44ADA కింద ప్రీసమ్‌ప్టివ్ టాక్సేషన్ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

44ADA ప్రత్యేకత: ఒకవేళ మీ వార్షిక ఆదాయం రూ. 75 లక్షలలోపు ఉంటే, మీరు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. దీని ప్రకారం:

• మీరు ఖర్చుల వివరాలు చూపించాల్సిన పని లేదు.  
• మీ స్థూల ఆదాయంలో 50% నికర లాభంగా పరిగణిస్తారు. 
• మీరు మిగిలిన 50% ఖర్చుగా చూపించి, కేవలం ఆ 50% లాభంపై మాత్రమే పన్ను చెల్లించవచ్చు.

ఉదాహరణకు, ఒక క్రియేటర్ సంవత్సరానికి రూ. 10 లక్షలు సంపాదిస్తే, రూ. 5 లక్షలు మాత్రమే లాభంగా పరిగణిస్తారు. ఇది చిన్న క్రియేటర్లకు పెద్ద ఉపశమనం, ఎందుకంటే ఇది అకౌంటింగ్ సంక్లిష్టతలను తగ్గిస్తుంది.

4. దాచిపెడితే ఎదురయ్యే తీవ్ర పరిణామాలు

ఆదాయాన్ని దాచడం లేదా ఐటీ రిటర్న్‌లో చూపించకపోవడం అనేది పన్ను ఎగవేతగా పరిగణలోకి తీసుకుంటారు. ఇది తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారి తీస్తుంది. పన్ను అధికారులు మీ ఆదాయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా, బ్యాంకు లావాదేవీల ద్వారా, లేదా స్పాన్సర్‌ల ద్వారా సులభంగా గుర్తించగలరు. యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్‌లు కూడా పన్ను అధికారులకు ఆదాయ వివరాలను అందించవచ్చు.

ఒకవేళ పన్ను ఎగవేత రుజువైతే, కింది పరిణామాలు ఎదురవుతాయి:

ఎ. భారీ పెనాల్టీలు:

• సెక్షన్ 271(1)(c): ఆదాయాన్ని దాచినట్లు లేదా తప్పుగా చూపినట్లు రుజువు అయితే, దాచిన ఆదాయంపై చెల్లించాల్సిన పన్నుకు 100% నుంచి 300% వరకు జరిమానా విధిస్తారు.

• సెక్షన్ 270A: ఆదాయాన్ని తక్కువగా చూపినందుకు 50% పెనాల్టీ, ఉద్దేశపూర్వకంగా దాచినట్లయితే 200% పెనాల్టీ విధించవచ్చు.

బి. వడ్డీ- జైలు శిక్ష:

• వడ్డీ: చెల్లించని పన్నుపై వడ్డీ సెక్షన్ 234A, 234B, 234C కింద విధిస్తారు. 
• జైలు శిక్ష : ఎగవేసిన ఆదాయం గణనీయంగా ఎక్కువగా ఉంటే (ముఖ్యంగా రూ. 25 లక్షలకు మించి), ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 276C కింద 3 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 

ఈ తీవ్రమైన నిబంధనలు, చిన్న మొత్తంలో ఆదాయం ఉన్నప్పటికీ, పారదర్శకతను పాటించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. ఆదాయాన్ని దాచడం ఏ విధంగానూ సురక్షితం కాదు.

5. కంటెంట్ క్రియేటర్స్‌కు కీలక సలహాలు 

సోషల్ మీడియా క్రియేటర్లు పన్ను సమస్యలను నివారించడానికి, చట్టబద్ధంగా ముందుకు సాగడానికి కింది అంశాలను తప్పక పాటించాలి:

1. కచ్చితమైన రికార్డులు నిర్వహణ: ఆదాయం, ఖర్చులు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను స్పష్టంగా రికార్డ్ చేయాలి.

2. చార్టర్డ్ అకౌంటెంట్ సహాయం: ఆదాయాన్ని సరైన విభాగం కింద వర్గీకరించి, ఐటీ రిటర్న్ సరిగ్గా ఫైల్ చేయడానికి CA సహాయం తీసుకోవడం ఉత్తమం.

3. TDS ధృవీకరణ: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు లేదా స్పాన్సర్‌లు మీ ఆదాయంపై TDS కట్ చేసి ఉంటే, దానిని ఫారమ్ 26ASలో తనిఖీ చేయాలి. రిటర్న్‌లో క్లెయిమ్ చేయాలి.

4. అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు: మీ పన్ను సంవత్సరానికి రూ. 10,000 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తే, అడ్వాన్స్ టాక్స్ చెల్లించడం ద్వారా వడ్డీ, జరిమానాలను నివారించవచ్చు.

సోషల్ మీడియా ఇప్పుడు కేవలం వినోద వేదిక కాదు. ఆర్థిక వ్యవస్థలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక వృత్తి రంగం. లక్షల్లో ఆదాయం ఆర్జించే క్రియేటర్స్‌ వృత్తిపరమైన బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చిన్న మొత్తాల ఆదాయం అయినప్పటికీ, పారదర్శకత కోసం దాన్ని ఐటీ రిటర్న్‌లో చూపించడం మంచిది. 

Published at : 08 Oct 2025 04:05 PM (IST) Tags: Social Media Income Tax India Taxation for YouTubers Influencer Tax Rules Section 44ADA Presumptive Taxation

ఇవి కూడా చూడండి

YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే

YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే

Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?

Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

టాప్ స్టోరీస్

Maoists surrender: మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!

Maoists surrender: మావోయిస్టులు లొంగిపోవడమంటే సరెండర్ కాదు.. అడవిని వదిలిన అన్నలను అవమానించొద్దు..!

Donald Trump: ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్

Donald Trump: ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్

Dhurandhar Shararat Song: తమన్నాను తీసేసి ఆమెకు అవకాశం ఇచ్చారా? ఒకర్ని పైకి లేపడం కోసం ఇంకొకరిని తొక్కేయాలా?

Dhurandhar Shararat Song: తమన్నాను తీసేసి ఆమెకు అవకాశం ఇచ్చారా? ఒకర్ని పైకి లేపడం కోసం ఇంకొకరిని తొక్కేయాలా?

Nepal T20 World Cup Team: టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన నేపాల్.. గత ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్న ఆసియా టీం

Nepal T20 World Cup Team: టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన నేపాల్.. గత ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్న ఆసియా టీం