By: ABP Desam | Updated at : 12 Feb 2023 07:12 AM (IST)
Edited By: Arunmali
రోజుకు కేవలం ఒక్క రూపాయితో ₹10 లక్షల ప్రమాద బీమా
India Post Accident Policy: ఇటీవలి కాలంలో, ప్రమాద బీమా పట్ల ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. జీవిత బీమా, ఆరోగ్య బీమా తరహాలో ప్రమాద బీమా కూడా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇతర సంస్థల తరహాలోనే, తపాలా శాఖ (postal department) కూడా ఒక ప్రమాద బీమా పథకాన్ని ఇటీవల అందుబాటులోకి తీసుకు వచ్చింది. టాటా ఏఐజీతో (Tata AIG General Insurance Company) కలిసి దీనిని ప్రారంభించింది. గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పేరిట, పోస్టాఫీసు ఖాతాదార్ల కోసం ప్రమాద బీమా పాలసీని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ తీసుకున్న వాళ్లు ఏడాదికి కేవలం 399 రూపాయలు చెల్లిస్తే చాలు, 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం పొందవచ్చు. అంటే, రోజుకు ఒక్క రూపాయి కంటే కాస్త ఎక్కువ ఖర్చుతో, ఒక భారీ ప్రమాద బీమా కవరేజీని పొందవచ్చు. తద్వారా, మీ మీద ఆధారపడిన వాళ్లకు ఆర్థిక భరోసా ఇవ్వవచ్చు.
ఎవరు అర్హులు?
18 నుంచి 65 ఏళ్ల వయసు కలిగిన వారు ఎవరైనా ఈ బీమా పాలసీని తీసుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (India Post Payments Bank) ద్వారా మాత్రమే ప్రీమియం చెల్లించాలి. అంటే, ఈ బీమా తీసుకోవాలంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఖాతా ఉండడం తప్పనిసరి. ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, ఏదైనా అవయవం కోల్పోయినా, పక్షవాతం వచ్చినా 10 లక్షల రూపాయలు చెల్లిస్తారు. పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి వైద్యం కోసం ఆసుపత్రిలో చేరితే, ఐపీడీ (ఇన్ పేషెంట్ డిపార్ట్‌మెంట్) కింద 60 వేల రూపాయలు లేదా క్లెయిమ్ చేసిన మొత్తంలో ఏది తక్కువైతే అది చెల్లిస్తారు. ఔట్ పేషెంట్ విషయంలో.. 30 వేల రూపాయలు లేదా క్లెయిమ్ చేసిన మొత్తంలో ఏది తక్కువ అయితే అది చెల్లిస్తారు.
ఇతర అదనపు ప్రయోజనాలు
ఈ పాలసీలో మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా ఇద్దరు పిల్లలకు, ఫీజులో 10 శాతం లేదా లక్ష రూపాయల వరకు ఎంచుకోవచ్చు. కుటుంబ ప్రయోజనం కింద 25 వేల రూపాయలు, అంత్యక్రియల కోసం మరో 5 వేల రూపాయలు అందుతాయి. ఆసుపత్రిలో చికిత్స సమయంలో, రోజువారీ నగదు రూపంలో రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున 10 రోజుల వరకు ఇస్తారు.
రూ. 299కి కూడా..
ఇదే పథకాన్ని 299 రూపాయల ఆప్షన్‌తోనూ తపాలా శాఖ అందిస్తోంది. దీనిని ఎంపిక చేసుకుంటే, ఏడాదికి 299 రూపాయలు చెల్లించినా 10 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. రోడ్డు ప్రమాదంలో మరణం, వైకల్యం, పక్షవాతం, వైద్య ఖర్చులు వంటివి ఈ ఆప్షన్‌లో కవర్ అవుతాయి. పైన చెప్పుకున్న అదనపు ప్రయోజనాలు మాత్రం అందవు.
ALSO READ: టాటా 1mg, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు నోటీసులు - మ్యాటర్ సీరియస్
ALSO READ: కొత్త ఫోన్ కొంటారా? బాబోయ్ వద్దండీ, ఆ డబ్బులు దాచుకుంటాం
Gold-Silver Price 31 March 2023: నగలు కొందామంటే భయపెడుతున్న బంగారం ధర, ఇవాళ కూడా పెరిగిన రేటు
Gold-Silver Price 30 March 2023: 3 రోజులు మురిపించి మళ్లీ పెరిగిన పసిడి, స్థిరంగా వెండి
Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న టాక్స్ రూల్స్ - లాభమో, నష్టమో తెలుసుకోండి
Paytm on UPI charges: యూపీఐ లావాదేవీలపై ఛార్జీల్లేవ్ - అదంతా తప్పుడు సమాచారమే!
ITR E-Verification: మీకు ఈ-వెరిఫికేషన్ నోటీస్ వస్తే వెంటనే ఇలా చేయండి, లేకపోతే చర్యలు తప్పవు!
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు