By: ABP Desam | Updated at : 02 Jan 2024 09:57 AM (IST)
ఐటీఆర్ ఫైలింగ్స్‌లో పాత రికార్డ్ బద్దలు
Income Tax Returns Filing in Assessment Year 2023-24: మన దేశంలో, ఆదాయ పన్ను పత్రాల దాఖలులో (ITR Filing) కొత్త రికార్డ్ నమోదైంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, దేశంలో రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 8 కోట్లు దాటింది.
ఐటీఆర్‌లతో పాటు ఇతర ఫామ్స్‌లోను రికార్డ్
ఆర్థిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన డేటా ప్రకారం.. ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య రికార్డ్ స్థాయిలో పెరిగింది. 2023-24 అసెస్‌మెంట్ ఇయర్‌లో (Assessment Year 2023-24) మొత్తం 8.18 కోట్ల ITRలు దాఖలయ్యాయి. అంతకు ముందు ఏడాది ఈ సంఖ్య 7.51 కోట్లుగా ఉంది. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసిన వారి సంఖ్య ఈ ఏడాది కాలంలో దాదాపు 9 శాతం పెరిగింది. అంతేకాదు, 2023-24 అసెస్‌మెంట్ ఇయర్‌లో మొత్తం 1.60 కోట్ల ఆడిట్ రిపోర్ట్‌లు, ఇతర ఫారాలను సబ్మిట్ చేశారు. గత ఏడాది ఈ సంఖ్య 1.43 కోట్లుగా ఉంది.
Record number of Income Tax Returns (ITRs) filed till 31st December, 2023!
— Income Tax India (@IncomeTaxIndia) January 1, 2024
Few highlights:
👉 8.18 crore ITRs filed for AY 2023-24 upto 31.12.2023 which is 9% higher y-o-y.
👉1.60 crore audit reports and other forms filed.
👉AIS facility was used extensively, resulting in… pic.twitter.com/julWcfycLF
సులభంగా మారిన ఐటీఆర్ ప్రక్రియ
మంత్రిత్వ శాఖ చెప్పిన ప్రకారం... జీతం, వడ్డీ, డివిడెండ్, వ్యక్తిగత సమాచారం, TDS సహా పన్ను చెల్లింపు, నష్టం, MAT క్రెడిట్ సహా చాలా రకాల సమాచారం ప్రి-ఫిల్డ్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. దీంతో, ITR ఫైల్ చేసే ప్రక్రియ మునుపటి కంటే చాలా సులభంగా, సౌకర్యవంతంగా, వేగంగా మారింది. ఈ సౌకర్యాన్ని అసెసీలు విస్తృతంగా ఉపయోగించుకున్నారు, రికార్డ్ స్థాయిలో పన్ను పత్రాలు దాఖలు చేశారు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
ప్రభుత్వం ఇమెయిల్ మరియు SMS సహా అనేక సృజనాత్మక ప్రచారాలను నిర్వహించింది.
ITR సహా ఇతర ఫారాలను సులభంగా, త్వరగా పూరించేలా ఐటీ డిపార్ట్‌మెంట్ తీసుకొచ్చిన సంస్కరణలు (Reforms in ITR Filing) విజయవంతం అయ్యాయని చెప్పడానికి ఈ నంబర్లు ఉదాహరణ. ఐటీఆర్ ప్రక్రియ సరళీకరణపై కేంద్ర ప్రభుత్వం ఇ-మెయిల్, SMS, అనేక ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారాలను నిర్వహించింది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
2023 డిసెంబరు 31న, దాదాపు 27.37 లక్షల ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు ఇ-ఫైలింగ్ సహాయ కేంద్రం ప్రకటించింది.
మరో ఆసక్తికర కథనం: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Auto stocks, LIC, SJVN
పర్సనల్ లోన్ కొరకు అర్హత: బజాజ్ ఫైనాన్స్ తో త్వరిత నిధులకు సులభమైన మార్గదర్శకం
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
Investment Tips: వెండి లేదా గోల్డ్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ? ఏది లాభదాయకం, బెనిఫిట్స్ ఎక్కువ
Year Ender 2025 : ఉద్యోగస్తులకు కలిసి వచ్చిన 2025- పెద్ద ఊరటనిచ్చిన అంశాలు ఇవే!
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!