search
×

ITR Filing: AIS అంటే ఏంటి, టాక్స్‌ ఫైలింగ్‌కు ఫామ్‌-16 ఉంటే సరిపోదా?

జీతం రూపంలో కాకుండా, మీకు తెలీకుండానే మరికొన్ని మార్గాల నుంచి కొంత ఆదాయం వస్తుంది.

FOLLOW US: 
Share:

Income Tax Return Filing: ఆదాయపు పన్ను రిటర్న్‌ల ఫైలింగ్‌ సీజన్‌ స్పీడందుకుంది. ఈ నెల 15 నుంచి కంపెనీలు తమ ఉద్యోగులకు ఫామ్‌-16 ఇవ్వడం ప్రారంభించాయి. దీంతో ఆదాయపు పన్ను పత్రాలు దాఖలు చేసే వారి సంఖ్య వేగంగా పెరిగింది. 2023-24 అసెస్‌మంట్‌ ఇయర్‌లో ఆదాయపు ప్రకటనకు చివరి తేదీ 31 జులై 2023. 

ఫారం-16 మాత్రమే పనిచేయదు
ఆదాయపు పన్ను చెల్లించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే, ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ (Income Tax Department) నుంచి లేనిపోని తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా ఐటీ నుంచి నోటీసు వస్తుంది. కాబట్టి, ఐటీ రిటర్న్‌ (ITR) ఫైల్‌ చేయడానికి ముందే కొన్ని కీలక డాక్యుమెంట్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. వేతనాలు పొందే పన్ను చెల్లింపుదార్లకు ఫారం-16 బాగా ఉపయోగపడుతుంది. జీతం రూపంలో కాకుండా, మీకు తెలీకుండానే మరికొన్ని మార్గాల నుంచి కొంత ఆదాయం వస్తుంది. కాబట్టి, ITR ఫైలింగ్‌ సమయంలో ఫామ్‌-16 ఒక్కటే సరిపోదు.

జీతం కాకుండా, ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం విషయంలో, AIS & TIS మీకు సాయం చేస్తాయి. ఇన్‌కమ్‌ డిక్లరేషన్‌కు ముందు వీటికిని కూడా కచ్చితంగా చూడమని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. ఐటీఆర్ ఫైలింగ్‌ సమయంలో పారదర్శకత తీసుకురావడానికి, పన్ను చెల్లింపుదారు సెల్ఫ్‌-ఫైలింగ్‌ను సులభతరం చేయడానికి డిపార్ట్‌మెంట్ ఈ రెండింటినీ ప్రవేశపెట్టింది. ఫామ్‌-16తో పాటు ఈ రెండు పత్రాలను కూడా చూడడం వల్ల, ఫైలింగ్‌లో తప్పులు జరిగే అవకాశాలు & ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసుల బెడద రెండూ తగ్గుతాయి.

AIS, TIS అంటే ఏంటి, ఎలా చూడాలి?
AIS అంటే వార్షిక సమాచార నివేదిక (Annual Information Statement). TIS అంటే పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం ‍‌(Taxpayer Information Summary). AIS, TISలో.. ఒక పన్ను చెల్లింపుదారు సంపాదించిన మొత్తం ఆదాయ వివరాలు ఉంటాయి. మీకు బ్యాంక్‌ సేవింగ్స్ అకౌంట్‌ ఉంటే, మూడు నెలలకు ఒకసారి ఎంతోకొంత డబ్బు వడ్డీ రూపంలో (Saving Account Interest Income) మీ అకౌంట్‌లో జమ అవుతుంది. మీ బ్యాంక్‌ నేరుగా ఆ డబ్బును మీ అకౌంట్‌లో డిపాజిట్‌ చేస్తుంది. ఇది చాలా తక్కువ మొత్తం కాబట్టి, మీకు తెలియవచ్చు/తెలీకపోవచ్చు. దీంతోపాటు.. రికరింగ్ డిపాజిట్‌, ఫిక్స్‌డ్ డిపాజిట్‌ మీద వడ్డీ ఆదాయాలు, సెక్యూరిటీల లావాదేవీలు, డివిడెండ్ రూపంలో అందిన డబ్బు (Income From Dividend), మ్యూచువల్ ఫండ్స్‌ నుంచి వచ్చిన మొత్తం, ఇలాంటి వివరాలన్నీ ఆ డాక్యుమెంట్స్‌లో ఉంటాయి.

ఇంకా ఈజీగా చెప్పాలంటే, పన్ను విధించదగిన ఆదాయం మొత్తం సమాచారం AISలో ఉంటుంది. జీతం నుంచి కాకుండా ఇతర మూలాల నుంచి వచ్చిన ప్రతి ఆదాయ వివరం అందులో కనిపిస్తుంది. AIS సారాంశమంతా TISలో ఉంటుంది.

AIS/TIS ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download AIS/TIS) 
ఆదాయ పన్ను ఫైలింగ్ పోర్టల్ (www.incometax.gov.in) ఓపెన్‌ చేయండి.
పాన్ నంబర్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వండి.
అప్పర్‌ మెనులో సర్వీసెస్‌ ట్యాబ్‌కు వెళ్లండి.
డ్రాప్‌డౌన్ నుండి 'Annual Information Statement (AIS)' ఎంచుకోండి.
ప్రొసీడ్ పై క్లిక్ చేయగానే ప్రత్యేక విండో ఓపెన్ అవుతుంది.
కొత్త విండోలో AIS ఆప్షన్‌ ఎంచుకోండి.
ఇప్పుడు మీరు AIS, TIS రెండింటినీ డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్‌ కనిపిస్తుంది.
మీరు AIS, TISను PDF లేదా JSON ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరో ఆసక్తికర కథనం: ఎన్‌పీఎస్‌లో 'సిస్టమాటిక్‌ విత్‌డ్రాల్‌ ప్లాన్‌', ఇకపై మరింత బెనిఫిట్‌! 

Published at : 19 Jun 2023 12:42 PM (IST) Tags: ITR Filing AIS TIS Annual Information Statement form 16 Form-16

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today 31 Mar: రూ.93,000 దాటిన స్పాట్‌ గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 31 Mar: రూ.93,000 దాటిన స్పాట్‌ గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Money Facts: దేశంలో సగం మంది వద్ద 3.5 లక్షలు కూడా లేవు, ప్రపంచంలో 90 శాతం మందికి జీతం టెన్షన్..!

Money Facts: దేశంలో సగం మంది వద్ద 3.5 లక్షలు కూడా లేవు, ప్రపంచంలో 90 శాతం మందికి జీతం టెన్షన్..!

Honda SP 125: ట్యాంక్‌ ఫుల్ చేస్తే 700 కి.మీ. మైలేజ్‌! - లోన్‌పై హోండా బైక్ కొంటే ఎంత EMI చెల్లించాలి?

Honda SP 125: ట్యాంక్‌ ఫుల్ చేస్తే 700 కి.మీ. మైలేజ్‌! - లోన్‌పై హోండా బైక్ కొంటే ఎంత EMI చెల్లించాలి?

PPF, SSY, NSC: పోస్టాఫీస్‌ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రకటించిన ప్రభుత్వం

PPF, SSY, NSC: పోస్టాఫీస్‌ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రకటించిన ప్రభుత్వం

Gold-Silver Prices Today 29 Mar: పసిడి మెరుపు పెరిగింది, వెండి వెనక్కు తగ్గింది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 29 Mar: పసిడి మెరుపు పెరిగింది, వెండి వెనక్కు తగ్గింది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

టాప్ స్టోరీస్

Rajiv Yuva Vikasam Scheme: యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు

Rajiv Yuva Vikasam Scheme: యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు

HCU lands Fact: హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

HCU lands Fact: హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

Akkada Ammayi Ikkada Abbayi Trailer: యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ చూశారా? - ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి ఉంటే!

Akkada Ammayi Ikkada Abbayi Trailer: యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ చూశారా? - ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి ఉంటే!

Brand Vizag: విశాఖలో తాజ్ వరుణ్ గ్రూప్ రూ.500 కోట్ల పెట్టుబడులు, 3500 మందికి ఉపాధి అవకాశాలు

Brand Vizag: విశాఖలో తాజ్ వరుణ్ గ్రూప్ రూ.500 కోట్ల పెట్టుబడులు, 3500 మందికి ఉపాధి అవకాశాలు