By: ABP Desam | Updated at : 28 Jul 2023 11:38 AM (IST)
ఇకపై అందరికీ ఒకటే ఐటీఆర్ ఫామ్
Common ITR Form: ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్‌లో గజిబిజి గందరగోళం, తలనొప్పులకు చెక్ పెట్టే టైమ్ వస్తోంది. ఆదాయాలను ప్రకటించడానికి ప్రస్తుతం ఉన్న 7 రకాల ఫారాలను రద్దు చేసి, వాటి స్థానంలో అందరికీ కలిసొచ్చేలా ఒకే ఒక్క ఐటీ ఫామ్ తీసుకొచ్చేందుకు అడుగులు పడుతున్నాయి.
వీలైనంత త్వరగా 'ఉమ్మడి ఐటీఆర్ ఫారం'
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంటరీ కమిటీ, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా 'ఉమ్మడి ఐటీఆర్ ఫారం' (Common ITR Form) జారీ చేయాలని ఫైనాన్స్ మినిస్ట్రీని కోరింది. కామన్ టాక్స్ పేయర్లను దృష్టిలో పెట్టుకుని ఆదాయ పన్ను రిటర్న్‌ల దాఖలు పనిని సులభంగా మార్చాలని, వ్యాపారేతర పన్ను చెల్లింపుదార్ల కోసం కామన్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫారాన్ని త్వరలో జారీ చేయాలని సూచించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఉమ్మడి ఐటీఆర్ ఫామ్ కోసం గత సంవత్సరం ఒక ప్రతిపాదన చేసింది. దీనికి సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలని అప్పట్లోనే వాటాదార్లకు సూచించింది. దీనిపై పార్లమెంటరీ కమిటీ భేటీలో తాజాగా చర్చ జరిగింది.
ఆదాయ పన్ను రిటర్న్‌ల దాఖలులో పన్ను చెల్లింపుదార్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జయంత్ సిన్హా ప్రస్తావించారు. ఐటీఆర్ ఫైలింగ్ ప్రాసెస్ ఈజీగా ఉండేలా చూడాలని, సీబీడీటీకి (Central Board of Direct Taxes) విజ్ఞప్తి చేశారు. ఒక వ్యక్తికి జీతం, అద్దె, వ్యాపార ఆదాయం ఉంటే చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఎక్స్‌పర్ట్ సాయం లేకుండా ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయలేకపోతున్నారని పార్లమెంటరీ కమిటీ కామెంట్ చేసింది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా, సొంతంగా ITR ఫైల్ చేయగలిగేలా, ప్రాసెస్‌ను సరళీకృతం చేయాలని చెప్పింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానం ఇది
పన్ను వర్తింపును సులభంగా ఉండేలా చూడడానికి, జీతం ఆదాయాన్ని ఐటీఆర్‌లో ముందస్తుగానే నింపి అందుబాటులో ఉంచుతున్నామని పార్లమెంటరీ కమిటీకి ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానం చెప్పింది. ఆస్తి ఆదాయం, బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ ఆదాయం, డివిడెండ్ మొత్తం కూడా ఐటీఆర్‌లో ప్రి-ఫిల్ చేస్తున్నట్లు చెప్పింది. ప్రపంచంలోనే అత్యుత్తమ విధానం ఆధారంగా, ఉమ్మడి ఐటీఆర్ ఫామ్‌ను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని చెప్పిన ఫైనాన్స్ మినిస్ట్రీ, కామన్ ఐటీఆర్ ఫామ్‌లో ఐటీఆర్-7 మినహా మిగిలిన అన్ని ఐటీఆర్‌లను కలిపేస్తామని డిక్లేర్ చేసింది. ఈ ప్రక్రియను స్పీడప్ చేయాలని పార్లమెంటరీ కమిటీ మంత్రిత్వ శాఖను కోరింది.
గత సంవత్సరం, పన్ను చెల్లింపుదార్లందరికీ ఉమ్మడి ఆదాయపు పన్ను రిటర్న్ ఫామ్‌ను ప్రతిపాదించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ, 2022 డిసెంబర్ 15 నాటికి వాటాదార్ల నుంచి సలహాలు కోరింది. 2023-24 బడ్జెట్‌లో కామన్ ఐటీఆర్ ఫామ్ తీసుకువచ్చే ప్రకటన ఉండొచ్చని అంతా ఊహించారు, కానీ అది జరగలేదు.
ప్రస్తుతం, వివిధ వర్గాల టాక్స్ పేయర్ల కోసం 7 రకాల ఐటీఆర్ ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు, ITR-7 మినహా అన్ని ITR ఫారాలను విలీనం చేయాలని ఫైనాన్స్ మినిస్ట్రీ చూస్తోంది. ITR-1 & ITR-4 కొనసాగుతాయని గతంలో CBDT చెప్పింది. అయితే, ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతున్న ప్రకారం పన్ను చెల్లింపుదార్లంతా కామన్ ITR ద్వారా రిటర్న్ దాఖలు చేసే అవకాశం ఉంది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇవాళ్టి రేట్లివి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Gold-Silver Prices Today 23 Nov: మళ్లీ రూ.80,000లకు చేరిన స్వర్ణం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
Bank Locker Rules: బ్యాంక్ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ
Safe Investment: రిస్క్ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్ ఆప్షన్ దొరకవు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!