By: Arun Kumar Veera | Updated at : 02 Dec 2024 10:11 AM (IST)
సెక్షన్ 92E కింద రిపోర్ట్‌లు సబ్మిట్ చేయాలి ( Image Source : Other )
ITR Filing Deadline: ఆదాయ పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును (Last Date For ITR Filing) పొడిగిస్తూ 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్' (CBDT) నిర్ణయం తీసుకుంది. తద్వారా, పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ పన్ను రిటర్న్‌లను సమర్పించేందుకు అదనపు సమయం దొరికింది.
అయితే, ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఈ పొడిగింపు, గ్లోబల్ లావాదేవీలు (global transactions) చేసిన పన్ను చెల్లింపుదారులకు వర్తిస్తుంది. వాళ్లు, సెక్షన్ 92E కింద రిపోర్ట్‌లు సబ్మిట్ చేయాలి. అంతర్జాతీయ లేదా నిర్దిష్ట దేశీయ లావాదేవీలలో పాల్గొన్న సంస్థలకు కూడా ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది.
మరో 15 రోజులు సమయం
వాస్తవానికి, 2023-24 ఆర్థిక సంవత్సరం (FY 2023-24) లేదా 2025-25 మదింపు సంవత్సరానికి (AY 2024-25) ఐటీఆర్ ఫైల్ చేసేందుకు కొత్త పన్ను చెల్లింపుదారులకు గతంలో విధించిన గడువు నవంబర్ 30, 2024. తాజాగా, ఈ లాస్ట్ డేట్‌ను డిసెంబర్ 15, 2024కు CBDT పొడిగించింది. అంటే, పన్ను చెల్లింపుదారులకు మరో 15 రోజుల సమయం దొరికింది.
CBDT Extends Due Date for furnishing Return of Income for Assessment Year 2024-25.
➡️The due date for the assessees referred to in clause (aa) of Explanation 2 to Sub Section (1) of Section 139 has been extended from 30th November, 2024, to 15th December, 2024.
➡️ Circular No.… pic.twitter.com/4umO91ELAQ— Income Tax India (@IncomeTaxIndia) November 30, 2024
మరో ఆసక్తికర కథనం: ఇది గమనించారా?, - మీరు ప్రతిరోజూ వాడే సబ్బులు, టీ పొడి రేట్లు పెరిగాయి
చిక్కుల్లో ఉన్న లేదా కంటికి కనిపించని ఆస్తులను సంపాదించడం, విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం; ఆదాయం, రాబడి, నష్టాలు, లాభాలు, రుణం ఇవ్వడం లేదా రుణం తీసుకోవడం మొదలైన వ్యాపార లావాదేవీలకు సెక్షన్ 92E వర్తిస్తుంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో నిర్దిష్ట దేశీయ లేదా అంతర్జాతీయ లావాదేవీలలో పాల్గొన్న సంస్థలు అర్హత కలిగిన చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి రిపోర్ట్ తీసుకోవాలి. ఫామ్ 3CEB ద్వారా ఆ రిపోర్ట్‌ను ఆదాయ పన్ను అధికారులకు సమర్పించాలి.
మరో ఆసక్తికర కథనం: అత్యవసర ఖర్చుల్లో ఉన్నారా ? - పెద్దగా భారం పడని నాలుగు పర్సనల్ లోన్ మర్గాలు ఇవిగో
Look Back 2024: ఇది మల్టీబ్యాగర్ స్టాక్స్ సంవత్సరం - ఇన్వెస్టర్ల ఇళ్లు డబ్బులమయం
Aadhaar Card Updating: ఆధార్ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Gold-Silver Prices Today 15 Dec: నగలు కొనడానికి వెళ్తున్నారా?, - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Vande Bharat Train: వందే భారత్ రైలు టిక్కెట్లను ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకోవాలి?
Home Loan: మీ హోమ్ లోన్‌లో లక్షలాది రూపాయలు ఆదా + అదనపు లాభం - ఈ చిన్న మార్పుతో..
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Bigg Boss 8 Telugu Prize Money: బిగ్ బాస్ ప్రైజ్ మనీ... నిఖిల్‌కు రూ. 50 లక్షలతో పాటు కారు కూడా - రోజుకు ఎంతో తెలుసా?
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్ పోస్టు వైరల్