By: ABP Desam | Updated at : 04 Feb 2023 01:31 PM (IST)
Edited By: Arunmali
పాత-కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?
Income Tax New Rules: ఆదాయ పన్ను రాయితీలును కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు ఎదురు చూశారు. అయితే, 2023-24 బడ్జెట్‌లో, పన్ను చెల్లింపుదారుల ఈ డిమాండ్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నెరవేర్చారు. 7 లక్షల రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులను ఆదాయపు పన్ను స్లాబ్ పరిధి నుంచి మినహాయించారు, పరిమితిని గతంలోని రూ. 5 లక్షల నుంచి పెంచారు. స్టాండర్డ్ డిడక్షన్ కూడా పెంచారు. కాకపోతే, కేంద్ర ప్రభుత్వానికి పన్ను రూపంలో వచ్చే ఆదాయం తగ్గకుండా, చాలా తెలివిగా, స్లాబ్స్ రూపంలో మెలిక పెట్టారు. కొత్త పన్ను విధానాన్ని అనుసరించే పన్ను చెల్లింపుదార్లకు రూ. 7 లక్షల పరిమితి వర్తిస్తుంది. పాత పన్ను విధానాన్ని అనుసరించే చెల్లింపుదార్లకు రూ. 5 లక్షల పరిమితి అలాగే కొనసాగుతుంది.
ఒక వ్యక్తి కొత్త పన్ను విధానాన్ని అవలంబిస్తే, రూ. 7 లక్షల ఆదాయం వరకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. 2020 బడ్జెట్‌లో ఈ కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చింది. దశాబ్దాల నాటి పాత పన్ను విధానం కూడా కొనసాగుతోంది. ఈ రెండు పన్ను విధానాల మధ్య తేడా ఏమిటో ముందుగా తెలుసుకుందాం:
కొత్త - పాత పన్ను విధానం మధ్య ఉన్న తేడా ఏంటి?
కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విధానం ప్రకారం, సెక్షన్ 87A కింద రూ. 25,000 వరకు పన్ను రాయితీ వస్తుంది. కానీ, ఆర్థిక మంత్రి వేసిన మెలికను అక్కడే అర్ధం చేసుకోవాలి. ఒకవేళ మీ ఆదాయం 7 లక్షల రూపాయలు దాటితే, దాటిన మొత్తానికి మాత్రం పన్ను చెల్లించాలి అనుకుంటున్నారా?, కానే కాదు. మీ ఆదాయం 7 లక్షల రూపాయలు దాటితే, తక్షణం మీరు స్లాబ్ సిస్టమ్‌లోకి వస్తారు. అంటే.. మీరు సంపాదించిన ఆదాయంలో మొదటి 3 లక్షల రూపాయలను మినహాయించి, ఆ తర్వాతి మొత్తానికి దఫదఫాలుగా పన్ను చెల్లించాల్సిందే.
కొత్త ఆదాయపు పన్ను విధానం ప్రకారం, మొదటి రూ. 3 లక్షలపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆ తర్వాత.. రూ. 3 - 6 లక్షల ఆదాయానికి 5%
రూ. 6 - 9 లక్షల ఆదాయానికి 10%
రూ. 9 - 12 లక్షల ఆదాయానికి 15%
రూ. 12 - 15 లక్షల ఆదాయానికి 20%
రూ. 15 లక్షలకు పైగా ఉన్న ఆదాయాన్ని 30% ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పాత పన్ను విధానం ప్రకారం, రూ. 12,500 వరకు పన్ను మినహాయింపు అందుబాటులో ఉంది కాబట్టి రూ. 5 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, 5 లక్షలు దాటి మీకు ఆదాయం ఉంటే, ఈ విధానం ప్రకారం కూడా స్లాబ్స్‌లోకి వస్తారు.
ఏ విధానమైనా మీరు ఎంచుకోవచ్చు?
ఇప్పుడు, పన్ను చెల్లింపుదార్ల మనస్సుల్లో ఉన్న పెద్ద ప్రశ్న.. పాత - కొత్త పన్ను విధానాలను మార్చుకోవచ్చా?, దీనికి సమాధానం అవును. కొన్ని వర్గాల పన్ను చెల్లింపుదార్లు తమ వీలును బట్టి ప్రతి సంవత్సరం కొత్త - పాత పన్ను విధానానికి మారవచ్చు. జీతం పొందే వ్యక్తి, అద్దె రూపంలో ఆదాయం సంపాదించే వ్యక్తి ప్రతిసారీ పన్ను విధానాన్ని మార్చుకోవచ్చు. అయితే.. వ్యాపారం ద్వారా ఆదాయం సంపాదించే వ్యాపారవేత్త ప్రస్తుతం పాత పన్ను విధానాన్ని అనుసరిస్తుంటే, ఎంతకాలమైనా దానిలో కొనసాగవచ్చు. ఒకసారి కొత్త పన్ను విధానానికి మారితే, పాత పన్ను విధానానికి అతను తిరిగి రాలేడు.
Gold-Silver Prices Today 20 Dec: మీ నగరంలో చవకగా మారిన గోల్డ్, సిల్వర్ నగలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Instant Loan Apps: అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్‌స్టాంట్ లోన్ యాప్స్ ఇవి, కానీ జాగ్రత్త!
Instant Loan: తక్షణం రూ.10,000 లోన్ తీసుకోవచ్చు - ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేయాలి?
Trending Gold Jewellery: ధర తక్కువ, మన్నిక ఎక్కువ - ఇప్పుడు ఎవరి ఒంటిపై చూసినా ఇవే నగలు!
Building Wealth: ఈ 5 అలవాట్లు మీకు ఉంటే ధనలక్ష్మి మీ ఇంటి నుంచి వెళ్లదు గాక వెళ్లదు!
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం