By: Rama Krishna Paladi | Updated at : 29 May 2022 05:53 PM (IST)
Edited By: Ramakrishna Paladi
బ్యాంకింగ్ (Getty) ( Image Source : Getty )
How many bank accounts should you have: ఒకప్పుడు బ్యాంక్ ఖాతా తెరవడం పెద్ద ప్రహసనం! డిజిటలైజేషన్ పుణ్యమా అని ఇప్పుడెంతో సులభంగా మారింది. అసలు బ్యాంకుకే వెళ్లకుండా పనైపోతోంది. వీడియో కాల్ ద్వారా కేవైసీ పూర్తవుతోంది. అప్పుడే ఒరిజినల్ గుర్తింపు కార్డులు, ఇతర పత్రాలు చూపిస్తే సరిపోతోంది. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో కాపీస్ అప్‌లోడ్ చేస్తే క్షణాల్లో బ్యాంక్ ఖాతా వచ్చేస్తోంది. ఈ మధ్యన చాలామంది రెండు కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలే మెయింటేన్ చేస్తున్నారు. అలా ఉండటం వల్ల ప్రయోజనలేంటో చూసేద్దాం!
Perks and Privileges: చాలా బ్యాంకులు కస్టమర్లకు మల్టిపుల్ లాకర్లు, ఇన్సూరెన్స్, ప్రీమియం డెబిట్ (Debit Card), క్రెడిట్ కార్డుల (Credit Card) వంటి సౌకర్యాలు ఇస్తున్నాయి. కరెంటు బిల్లులు (Power bills), ఇతరత్రా పేమెంట్లు, షాపింగ్, ఈఎంఐ (EMIs) కడుతోంటే రాయితీలు, రివార్డులు ప్రకటిస్తున్నాయి. ఎక్కువ ఖాతాలు ఉండటం వల్ల ఖర్చులపై ఎక్కువ ఆదా చేసుకోవచ్చు.
Ease of ATM Access: ఒకప్పుడు ఏటీఎం కార్డులతో (ATM Cards) నెలకు ఎన్నిసార్లైనా ఉచితంగా డబ్బులు తీసుకొనే అవకాశం ఉండేది. ఇప్పుడు నెలకు కొన్ని లావాదేవీలే (ATM Transactions) ఉచితంగా ఇస్తున్నారు. పరిమితికి మించి చేస్తే అదనపు రుసుము వసూలు చేస్తున్నారు. ఎక్కువ బ్యాంకు ఖాతాలుంటే ఎక్కువ ఏటీఎం కార్డులుంటాయి. ఎక్కువసార్లు ఏటీఎం లావాదేవీలు చేయొచ్చు.
Goal based Bank Accounts: చాలా మంది కస్టమర్లు తమ లక్ష్యాలను బట్టి వేర్వేరు ఖాతాలు మెయింటేన్ చేస్తారు. ఉదాహరణకు విదేశీ ప్రయాణాలు, వాహన కొనుగోళ్లు, ఉన్నత విద్య కోసం అన్నమాట! రోజువారీ ఖర్చుల కోసం జాయింట్ అకౌంట్లు ఉంటాయి. గోల్‌ను బట్టి సెపరేట్ ఖాతాలు ఉండటం మంచిదే.
E-Commrce Offers: ప్రస్తుతం చాలా ఈ-కామర్స్ కంపెనీలు బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ప్రత్యేకమైన ఆఫర్లు, డీల్స్ ఇస్తున్నాయి. ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండటం వల్ల ఎక్కువ ఆఫర్లు, ప్రయోజనాలు పొందొచ్చు.
Security, Insurance: భద్రత పరంగానూ ఎక్కువ ఖాతాలు ఉండటం ప్రయోజనకరమే! ప్రస్తుతం షెడ్యూలు బ్యాంకుల్లో ఒక ఖాతాపై రూ.5 లక్షల వరకు డిపాజిట్ బీమా ఉంటోంది. అంతకన్నా ఎక్కువ డబ్బు ఉంటే వేర్వేరు ఖాతాల్లో దాచుకోవడం ఉత్తమం. అప్పుడు ఆ డిపాజిట్ల పైనా బీమా ఉంటుంది.
Also Read: Biggest Bank Scams in India: బ్యాంకులకు రూ.22వేల కోట్ల షాక్
Also Read: రూ.10 వేల సిప్ - 3 ఏళ్లలో రూ.5 లక్షల రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ ఇది
Tata Capital IPO: టాటా క్యాపిటల్ IPOకి లైన్ క్లియర్ - ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే?
House Prices In Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు - దేశ రాజధానితో పోలిస్తే భాగ్యనగరం చాలా బెటర్
Gold-Silver Prices Today 26 Feb: ఊపిరి పీల్చుకోండి, తగ్గిన గోల్డ్-సిల్వర్ రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
ELI Scheme Update: EPFO మెంబర్లకు భారీ శుభవార్త - ఉద్యోగులకు మరో నెల టైమ్ ఇచ్చిన సర్కారు
Stock Market Holiday: మహా శివరాత్రి సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవా, ట్రేడింగ్ జరుగుతుందా?
Posani Krishna Murali Arrest: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు- మీరెవరు అంటూ పోలీసులతో వాగ్వాదం
Telangana schools Holiday: ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్..తెలంగాణలో పాఠశాలలకు ఇవాళ సెలవు
TDP Warning Bells: వార్నింగ్ బెల్స్ వినిపిస్తున్నాయా బాబుగారూ..?
AFG Vs Eng Result Update: ఆఫ్గాన్ అద్భుత విజయం.. టోర్నీ నుంచి ఇంగ్లాండ్ ఔట్.. రూట్ సెంచరీ వృథా
Revanth Chitchat: 3 అనుమానాస్పద మరణాలకు కేటీఆర్‌కు లింకేంటి ? - ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్