By: ABP Desam | Updated at : 26 May 2022 05:04 PM (IST)
Edited By: Ramakrishna Paladi
కొటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్
Kotak Emerging Euity Fund Review: ఒక వైపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు ఇస్తున్న వడ్డీ ఏ మాత్రం సరిపోవడం లేదు. మరోవైపు ద్రవ్యోల్బణం దారుణంగా పెరుగుతోంది. ఇంటిఖర్చులు 10-15 శాతం పెరిగాయి. ఆదాయంలో వృద్ధి కనిపించడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇన్‌ఫ్లేషన్‌ను బీట్ చేస్తూ మంచి రిటర్న్స్ ఇచ్చేది ఈక్విటీలు మాత్రమే! స్వల్ప కాలంలో ఒడుదొడుకులకు లోనైనా సుదీర్ఘ కాలంలో భారీ మొత్తమే అందిస్తాయి. ఈక్విటీ మార్కెట్లు విలవిల్లాడుతున్న ప్రస్తుత తరుణంలో ఓ మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్ ప్రదర్శన ఆకట్టుకుంటోంది.
కొటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్
సాధారణంగా బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు పడిపోతుంటే మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు దారుణంగా పతనం అవుతుంటాయి. కొటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ (Kotak Emerging Equity Fund) మాత్రం ప్రస్తుత ఒడుదొడుకులకు తట్టుకుంటూ ఫర్వాలేదనిపిస్తోంది. మార్కెట్‌తో పోలిస్తే తక్కువగా నష్టపోతోంది. 2007, మార్చి 30న ఈ ఫండ్‌ను ఆరంభించారు. ఇది మిడ్‌క్యాప్ కేటగిరీకి చెందిన ఫండ్. ఆరంభం నుంచి వార్షికంగా 13.46 శాతం (CAGR) రాబడి అందించింది. ఈ ఫండ్ కార్పస్ రూ.19,303 కోట్లు. ఎక్స్‌పెన్స్ రేషియో డైరెక్ట్ అయితే 0.48, రెగ్యులర్ అయితే 1.8 శాతంగా ఉంది. పంకజ్ తైబ్రివల్ ఈ ఫండ్ మేనేజర్. 13:67:16 పద్ధతిలో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో పెట్టుబడి పెడతారు. 3, 5, 10 ఏళ్ల రాబడి వరుగా 21.2, 13.5, 20.1 శాతంగా ఉంది.
రూ.10 వేల సిప్‌కు రూ.5.14 లక్షలు
కొటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్‌లో మూడేళ్ల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడది రూ.1.77 లక్షలు అయ్యేది. అదే ప్రతి నెలా రూ.10,000 సిప్ చేసుంటే ఇప్పుడా విలువ రూ.5.14 లక్షలుగా మారేది. 2014, 2017, 2020, 2021లో ఈ ఫండ్ 25 నుంచి 75 శాతం వరకు రిటర్న్ ఇచ్చింది. ఈ ఏడాది మిడ్‌క్యాప్ 11.56 శాతం నష్టపోతే ఈ ఫండ్ 9.15 శాతమే నష్టపోయింది. 2014 జనవరి 29 నుంచి 2015 జనవరి 29 మధ్యన కొటక్ ఎమర్జింగ్ ఫండ్ ఏకంగా 110 శాతం రాబడి ఇవ్వడం గమనార్హం. 2019 ఏప్రిల్ 4 నుంచి 2020 ఏప్రిల్ 3 మధ్యన 25 శాతం పతనమైంది.
టాప్ 10 కంపెనీల్లో 33 శాతం
క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్, ఫైనాన్షియల్, కెమికల్స్, మెటీరియల్స్, హెల్త్‌కేర్ రంగాల్లో ఈ ఫండ్ ఎక్కువగా కేటాయింపులు చేసింది. షెఫ్లర్ ఇండియా, పర్సిస్టెంట్ సిస్టమ్స్, సుప్రీమ్ ఇండస్ట్రీస్, థెర్మాక్స్, కొరమాండల్ ఇంటర్నేషనల్, షీలా ఫోమ్ వంటి కంపెనీల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టింది. ఈ ఫండ్ పోర్టుపోలియోలో 70 షేర్లు ఉన్నాయి. టాప్ 10 స్టాక్స్‌కు 33 శాతం, టాప్-5 స్టాక్స్‌కు 19 శాతం కేటాయింపులు చేసింది. టాప్-3 సెక్టార్లలో 40.48 శాతం పెట్టుబడి పెట్టింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Stock Market Crash: వణికించిన స్టాక్ మార్కెట్లు! 796 పాయింట్ల పతనమైన సెన్సెక్స్
Stock Market Update: రక్తమోడుతున్న స్టాక్ మార్కెట్లు! నేడు రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!
Stock Market Today: 20,200 టచ్ చేసిన నిఫ్టీ - 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
Stock Market Today: హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల అండతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డుల మోత
Stock Market Today: ఒడుదొడుకులు ఎదురైనా.. గరిష్ఠాల్లోనే సెన్సెక్స్, నిఫ్టీ క్లోజింగ్!
Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్
Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్
/body>