By: Arun Kumar Veera | Updated at : 20 Feb 2024 03:16 PM (IST)
ఈ బ్యాంక్‌ల్లో హోమ్ లోన్ రేట్లు బాగా తక్కువ
Home Loan Interest Rates In Various Banks: సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి, సామాన్యుడి దాటాల్సిన అతి పెద్ద అడ్డంకి డబ్బు. డబ్బుంటే చిటికెలో ఇల్లు కొనేయొచ్చు. డబ్బు లేకపోతే, అప్పు కోసం బ్యాంక్‌ల చుట్టూ తిరగాలి. ఇంటి బడ్జెట్ మీద ఎక్కువ భారం పడకుండా ఉండాలంటే, ఏ బ్యాంక్ తక్కువ వడ్డీకి హోమ్ లోన్ ఆఫర్ చేస్తుందో తెలుసుకోవాలి. తక్కువ వడ్డీ వడ్డీ వల్ల EMI మొత్తం కూడా తగ్గుతుంది.
సాధారణంగా, హోమ్ లోన్‌ను దీర్ఘకాలానికి తీసుకుంటారు. అందువల్ల గృహ రుణంపై వడ్డీ పావు శాతం (0.25 శాతం) పెరిగినా, బ్యాంక్‌కు కట్టాల్సిన డబ్బు లక్షల్లో పెరిగిపోతుంది. కాబట్టి, తక్కువ వడ్డీకి హౌసింగ్ లోన్ (Housing Loan) ఇచ్చే బ్యాంక్‌ను ఎంచుకోవడం తెలివైన పని.
కొన్ని బ్యాంక్‌లు, కస్టమర్ క్రెడిట్ స్కోర్ (Credit Score) ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తున్నాయి. కస్టమర్‌కు మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉంటే, ఇతరుల కంటే తక్కువ రేటుకే గృహ రుణం తీసుకోవచ్చు.
హోమ్ లోన్స్ మీద వివిధ బ్యాంక్‌లు/హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు ఇవి (ఆరోహణ క్రమంలో):
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BoI) ---- 8.30% నుంచి 10.75% వరకు
LIC హౌసింగ్ ఫైనాన్స్ (LICHFL) ---- 8.35% నుంచి 10.35% వరకు
యూనియన్ బ్యాంక్ (UBI)---- 8.35% నుంచి 10.75% వరకు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM) ---- 8.35% నుంచి 11.15% వరకు
HDFC బ్యాంక్ ---- 8.35% నుంచి ప్రారంభం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ---- 8.40% నుంచి 10.15% వరకు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) ---- 8.40% నుంచి రేట్ మొదలవుతుంది
బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ---- 8.40% నుంచి 10.65% వరకు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ---- 8.45% నుంచి 9.80% వరకు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ---- 8.45% నుంచి 10.10% వరకు
యూకో బ్యాంక్ (UCO Bank) ---- 8.45% నుంచి 10.30% వరకు
కెనరా బ్యాంక్ ---- 8.50% నుంచి 11.25% వరకు
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (P&S Bank) ---- 8.50% నుంచి 10% వరకు
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ---- 8.50% నుంచి ప్రారంభం
PNB హౌసింగ్ ఫైనాన్స్ ---- 8.50% నుంచి 14.50% వరకు
గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ ---- 8.55% నుంచి ప్రారంభం
కోటక్ మహీంద్ర బ్యాంక్ ---- 8.70% నుంచి ప్రారంభం
యాక్సిస్ బ్యాంక్ ---- 8.70 నుంచి 13.30% వరకు
ICICI బ్యాంక్ ---- 8.75% నుంచి ప్రారంభం
ఆదిత్య బిర్లా క్యాపిటల్ ---- 8.80% నుంచి 14.75% వరకు
ఫెడరల్ బ్యాంక్ ---- 8.80% నుంచి ప్రారంభం
RBL బ్యాంక్ ---- 8.90% నుంచి ప్రారంభం
కరూర్ వైశ్యా బ్యాంక్ ---- 8.95% నుంచి 11.00% వరకు
బంధన్ బ్యాంక్ ---- 9.16% నుంచి 15% వరకు
ICICI హోమ్ ఫైనాన్స్ ---- 9.20% నుంచి ప్రారంభం
ధనలక్ష్మి బ్యాంక్ ---- 9.35% నుంచి 10.50% వరకు
సౌత్ ఇండియన్ బ్యాంక్ (SIB) ---- 9.84% నుంచి 11.24% వరకు
మరో ఆసక్తికర కథనం: ఒకే దెబ్బకు రెండు పిట్టలు - అధిక రాబడితో పాటు పన్ను నుంచి మినహాయింపు
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Provident Fund: ఈపీఎఫ్ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!
Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి
Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ