By: Arun Kumar Veera | Updated at : 20 Feb 2024 02:50 PM (IST)
అధిక రాబడితో పాటు పన్ను నుంచీ మినహాయింపు
Income Tax Return Filing 2024 - Post Office Schemes: మన దేశంలో పోస్టాఫీస్ ఖాతాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి, దశాబ్దాలుగా జనంలో పొదుపు అలవాట్లను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం, పోస్టాఫీస్ ద్వారా అనేక రకాల పెట్టుబడి లేదా పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. చిన్న మొత్తంలో సైతం పొదుపు/ పెట్టుబడిని (Small Saving Schemes) ప్రారంభించగలడం పోస్టాఫీస్‌లో ఖాతాకు ఉన్న అతి పెద్ద సానుకూలత. పోస్టాఫీస్ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలు కాబట్టి, వాటిలో పెట్టుబడి నష్టభయం అస్సలు ఉండదు, నూటికి నూరు శాతం సురక్షితం.
పోస్టాఫీస్ పథకాల్లో డిపాజిట్ చేసిన మొత్తంపై దీర్ఘకాలంలో మంచి రాబడితో పాటు ఆదాయ పన్నును ఆదా (Tax saving) చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఆదాయ పన్ను చెల్లింపుదారు (Income Taxpayer) అయితే, పోస్టాఫీసు పథకాల్లో డబ్బు ఇన్వెస్ట్ చేసి ఆదాయం పొందడంతో పాటు, ఆదాయ పన్ను భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
పోస్టాఫీస్ ద్వారా అమలువుతున్న వివిధ రకాల పథకాల్లో టైమ్ డిపాజిట్ ఒకటి. ఈ ఖాతాలో (Post Office Time Deposit Account) జమ చేసిన డబ్బుపై ఏటా 7.50 శాతం వడ్డీ ఆదాయం వస్తుంది, ITR ఫైలింగ్ సమయంలో సెక్షన్ 80C కింద మినహాయింపు పొందొచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ పిరియడ్ 5 సంవత్సరాలు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ లాగానే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్/ టర్మ్ డిపాజిట్ రన్ అవుతుంది.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ కింద, 5 సంవత్సరాల టెన్యూర్‌తో పాటు వివిధ కాల గడువుల్లో ఖాతాలు తెరవొచ్చు.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై ఎంత వడ్డీ లభిస్తుంది? (Interest on Post Office Time Deposits)
వివిధ కాల పరిమితుల ప్రకారం, పోస్టాఫీస్ టైమ్/టర్మ్ డిపాజిట్ల మీద ఏడాదికి 6.90 శాతం నుంచి 7.50 శాతం వరకు వడ్డీ సంపాదించొచ్చు. 1 సంవత్సరం టైమ్ డిపాజిట్ మీద 6.90 శాతం వడ్డీ, 2 సంవత్సరాల టైమ్ డిపాజిట్ మీద 7 శాతం, 3 సంవత్సరాల టైమ్ డిపాజిట్ మీద 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల కాలానికి డిపాజిట్ చేస్తే 7.50 శాతం వడ్డీని పోస్టాఫీసు చెల్లిస్తుంది.
ఏ కాల డిపాజిట్‌పై ఆదాయ పన్ను క్లెయిమ్ చేసుకోవచ్చు?
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లు వివిధ కాల గడువుల్లో అందుబాటులో ఉన్నప్పటికీ, వాటన్నింటిపైనా ఆదాయ పన్ను మినహాయింపు దక్కదు. కేవలం 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్ మీద మాత్రమే ఆదాయ పన్ను ప్రయోజనం లభిస్తుంది.
ఎంత పన్ను ఆదా అవుతుంది?
పోస్టాఫీస్ 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌లో జమ చేసే మొత్తంపై, ఆదాయ పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80C కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1.50 లక్షల రూపాయల వరకు పన్ను భారం తగ్గించుకోవచ్చు.
NSCలో పెట్టుబడిపై 7.70% వడ్డీ ఆదాయం + పన్ను ఉపశమనం
పోస్టాఫీస్ ద్వారా అందుబాటులో ఉన్న మరో పాపులర్ స్కీమ్ 'నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్' (National Saving Certificate - NSC). దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచైనా ఈ పథకం కింద ఖాతా ప్రారంభించొచ్చు. మార్చి 2024 వరకు, ఈ పథకం కింద 7.70 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. NSCలో పెట్టుబడి ద్వారా మంచి రాబడితో పాటు, టాక్స్ బెనిఫిట్‌ను (Tax Saving Benefit) కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఈ పథకంలో పెట్టుబడికి సైతం సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: అద్దె డబ్బుల్లేక ఆఫీసులు మూసేస్తున్న బైజూస్, బెంగళూరు నుంచి శ్రీకారం
Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Personal loan Interest Rates: దిగొచ్చిన పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు.. టాప్ 5 బ్యాంకులలో ఏది తక్కువ వడ్డీకి లోన్ ఇస్తుంది
PPF vs FD : సేవింగ్స్ చేయడానికి PPF మంచిదా? FD బెటరా? ఎక్కువకాలం పొదుపు చేస్తే ట్యాక్స్, వడ్డీ ఎలా ఉంటాయి?
పర్సనల్ లోన్ కొరకు అర్హత: బజాజ్ ఫైనాన్స్ తో త్వరిత నిధులకు సులభమైన మార్గదర్శకం
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Turmeric Water : రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!