By: ABP Desam | Updated at : 18 May 2023 11:29 AM (IST)
ఇళ్లను ఈజీగా కొని పడేస్తున్నారు!
Housing Sales in FY23: కొవిడ్‌తో కూలబడ్డ స్థిరాస్తి రంగానికి 2022-23 ఆర్థిక సంవత్సరం బూస్ట్ కలిపి ఇచ్చింది. మళ్లీ నిలదొక్కుకునేలా జవసత్వాలు అందించింది. గృహ నిర్మాణ రంగంలో, గత ఆర్థిక సంవత్సరంలో, మన దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రూ. 3.47 లక్షల కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడుపోయాయి. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం కంటే 48 శాతం ఎక్కువ. 2022-23లో గృహ రుణాలపై వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి పెరుగుదల, ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగినా ప్రజలు ఖాతరు చేయలేదు. అందువల్లే ఇళ్ల విక్రయంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది.
2022-23లో విపరీతమైన హౌసింగ్ డిమాండ్
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ అనరాక్ (ANAROCK Property Consultants) సమాచారం ప్రకారం, 2022-23లో హౌసింగ్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. అయితే, అదే కాలంలో ఇళ్ల ధరలు కూడా పెరిగాయి. 2021-22లో, రూ. 2,34,850 కోట్ల విలువైన గృహ విక్రయాలు జరిగాయి. ఈ మొత్తం 2022-23లో రూ. 3,46,960 కోట్లకు పెరిగింది. మొత్తం విలువను కాకుండా ఇళ్ల సంఖ్య వరకు చూసినా... 2021-22లో మొత్తం 2,77,783 గృహాలు చేతులు మారాయి. 2022-23లో ఈ సంఖ్య 3,79,095 యూనిట్లకు పెరిగింది. భారత రియల్ ఎస్టేట్ రంగంలో హౌసింగ్ విభాగం స్థిరమైన వృద్ధిని చూపుతోందని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పురి (Anuj Puri) చెప్పారు.
అనరాక్ డేటా ప్రకారం, దిల్లీ-ఎన్‌సీఆర్‌లో గృహాల విక్రయాల విలువ 2021-22లోని రూ. 35,610 కోట్లుగా ఉంది, 2022-23లో ఇది 42 శాతం పెరిగి రూ. 50,620 కోట్లకు పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో గృహాల విక్రయాల టోటల్ వాల్యూ 2021-22లో రూ. 1,14,190 కోట్లుగా ఉంది. 2022-23లో అది రూ. 1,67,210 కోట్లుగా నమోదైంది. అంటే, ఏడాదిలో 46 శాతం జంప్ కనిపించింది. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం గృహాల విక్రయాల్లో MMR వాటా 30 శాతం.
హైదరాబాద్‌లో 50% పెరిగిన ఇళ్ల అమ్మకాలు
2021-22 ఆర్థిక సంవత్సరంలో, బెంగళూరులో మొత్తం రూ. 26,100 కోట్ల విలువైన ఇళ్లను విక్రయించగా, 2022-23లో 49 శాతం పెరుగుదలతో రూ. 38,870 కోట్లు గృహాలు అమ్ముడుబోయాయి. పుణెలో, 2022-23లో రూ. 33,730 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 2021-22లోని రూ. 19,100 కోట్ల నుంచి 2022-23లో 77 శాతం పెరిగింది. హైదరాబాద్‌లో 2022-23లో రూ. 34,820 కోట్ల విలువైన ఇళ్లను విక్రయించగా, 2021-22లో రూ. 23,190 కోట్ల విలువైన యూనిట్లు అమ్మారు. ఇక్కడ, 2021-22 కంటే 50 శాతం ఎక్కువ విలువైన ఇళ్లను 2022-23లో విక్రయించారు. చెన్నైలో 2021-22లో రూ. 8,940 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరగ్గా, 2022-23లో 24 శాతం వృద్ధితో రూ. 11,050 కోట్ల విలువకు చేరాయి. కోల్‌కతాలో, 2022-23లో రూ. 10,660 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు జరిగాయి, 2021-22లోని రూ. 7,720 కోట్ల నుంచి ఇది 38 శాతం వృద్ధి చెందింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గృహ రుణ రేట్లు, ఇళ్ల ధరల్లో పెరుగుదల ప్రభావం భారతదేశ గృహనిర్మాణ రంగంపై పూర్తిగా ప్రతిఫలించలేదు. 2022-23 కాలంలో, ఆర్‌బీఐ తన రెపో రేటును 4 శాతం నుంచి 6.50 శాతానికి పెంచిన తర్వాత అన్ని బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అన్ని గృహ నిర్మాణ వస్తు ధరలు పెరిగాయి, బిల్డర్లు ఇళ్లను మరింత ఖరీదుగా మార్చారు. అయినా, దేశవ్యాప్తంగా గృహ విక్రయాల్లో రికార్డ్ స్థాయి జంప్ వచ్చింది.
PAN Card: ఇక నుంచి QR కోడ్‌తో కొత్త పాన్ కార్డ్‌లు - "ఫ్రీ"గా తీసుకోవచ్చు
Car Insurance: కారు బీమా - వారెంటీల విషయంలో ఓనర్‌లకు ఉన్న అపోహలు, వాస్తవాలు ఇవీ
Gold Rate Ttoday: రూ.1,300 తగ్గిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Bank Account Nominee: ప్రతి బ్యాంక్ ఖాతాలో 4 నామినీ పేర్లు - అతి త్వరలో మార్పులు!
NTPC Green Energy IPO: ఎన్‌టీపీసీ గ్రీన్ ఐపీవో అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఇంట్లో కూర్చునే ఇలా చెక్ చేయండి
Kavitha Latest News: రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
Kulasekhar death : టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మృతి - గాంధీ ఆస్పత్రిలో అనాథలా మృతదేహం
Samlan Khan : మహేష్ బాబు సినిమాల్లో ఒకలా, బయట ఒకలా ఉంటారన్నా సల్మాన్ కామెంట్స్.. సూపర్ స్టార్ మరదలు రిప్లై ఇదే
SCR Sabarimala Special Trains: ఉత్తరాంధ్ర, హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే!