By: ABP Desam | Updated at : 07 Jun 2022 02:41 PM (IST)
Edited By: Ramakrishna Paladi
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
HDFC Bank Hikes MCLR by 35 bps Effect from May 7 Housing Vehicle Personal Loan EMI Become Expensive : దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల రుణాలపై ఎంసీఎల్‌ఆర్ (MCLR) వడ్డీరేటును 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. 2022, జూన్ 7 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. కొన్ని రోజుల ముందే హెచ్‌డీఎఫ్‌సీ 25 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్‌ఆర్ రేటును పెంచడం గమనార్హం. మొత్తంగా కస్టమర్లపై ఈఎంఐ (EMI) భారం మరింత పెరుగనుంది.
ఎంసీఎల్‌ఆర్ రేటును పెంచితే గృహ, వాహన, వ్యక్తిగత, ఇతర రుణాలు మరింత ప్రియం అవుతాయి. వివిధ రుణాలపై చెల్లించాల్సిన నెలసరి వాయిదాల మొత్తం పెరుగుతుంది. సోమవారం రాత్రి వరకు హెచ్‌డీఎఫ్‌సీ ఎంసీఎల్‌ఆర్ వడ్డీరేటు 7.15 శాతంగా ఉండగా ఇప్పుడది 7.55 శాతానికి చేరుకుంది.
ప్రస్తుతం నెల రోజుల ఎంసీఎల్‌ఆర్ 7.55 శాతంగా ఉండగా 3, 6 నెలల ఎంసీఎల్‌ఆర్ వరుసగా 7.60%, 7.70%గా ఉన్నాయి. సాధారణంగా వినియోగదారుల రుణాలు ఎక్కువగా వార్షిక ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమై ఉంటాయి. ఇప్పుడా రేటు 7.85 శాతంగా మారింది. రెండు, మూడేళ్ల రేటు వరుసగా 7.95%, 8.05% ఉండటం గమనార్హం.
ఇంటి రుణాలు తీసుకున్న కస్టమర్లు ఓ విషయం గమనించాలి. మీ లోన్ రీసెట్ తేదీ సమీపించినప్పుడు మాత్రమే ఈఎంఐపై సవరించిన ఎంసీఎల్‌ఆర్ రేటు అమల్లోకి వస్తుంది. రీసెట్ తేదీ రాగానే మీ ఇంటి రుణంపై అప్పటి ఎంసీఎల్‌ఆర్‌ను బ్యాంకు వర్తింపజేస్తుంది. సాధారణంగా బ్యాంకులు ఇంటి రుణాలను వార్షిక వడ్డీరేటుకు అనుసంధానం చేస్తాయి.
ఉదాహరణకు మీ ఇంటిరుణం ఎంసీఎల్‌ఆర్‌కు లింకైందని అనుకుందాం. ఆగస్టులోనే రీసెట్ తేదీ వచ్చిందనుకుందాం. అలాంటప్పుడు మీ హౌజ్ లోన్ ఈఎంఐ ఆగస్టులోనే పెరుగుతుంది. అప్పటి వరకు పాతదే ఉంటుంది. సాధారణంగా రుణాల వడ్డీరేట్లను ప్రతి మూడు నెలలకు సమీక్షిస్తారు. అందుకే రెపో రేటు పెంచగానే ఈఎంఐపై భారం పెరుగుతుంది.
Gold-Silver Prices Today 30 Nov: ప్యూర్ గోల్డ్, ఆర్నమెంట్ గోల్డ్ రేట్లు తగ్గాయ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Minor PAN Card: పిల్లల కోసం పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఏంటి లాభం?
Gold-Silver Prices Today 29 Nov: నగలు కొనేవాళ్లకు రోజుకో షాక్ ఇస్తున్న గోల్డ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
ఎఫ్డి మ్యాక్స్: బజాజ్ ఫైనాన్స్ యొక్క తాజా అధిక- రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫర్
Good Personal Loan: అత్యవసర ఖర్చుల్లో ఉన్నారా ? - పెద్దగా భారం పడని నాలుగు పర్సనల్ లోన్ మర్గాలు ఇవిగో
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది