By: ABP Desam | Updated at : 29 Jun 2023 01:35 PM (IST)
బంగారం రేటు భారీగా తగ్గింది, పెట్టుబడి పెట్టేందుకు చాలా ఆప్షన్స్!
Gold Investment Options: భారతీయులకు బంగారమంటే మహా మోజు. మన వాళ్లు ఏటా వందల టన్నులు కొంటారు. గోల్డ్ కొనే వాళ్లలో ఎక్కువ మంది ఆర్నమెంట్స్ రూపంలోనే తీసుకుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే బిస్కట్స్, ఇతర రూపాల్లో పర్చేజ్ చేస్తుంటారు. ఇప్పుడు బంగారం రేటు భారీగా తగ్గింది, 4 నెలల కనిష్ట స్థాయిలో ఉంది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 60 వేల కిందకు చేరింది. బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే ఇదే సరైన సమయమని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
బంగారంలో పెట్టుబడి అంటే కేవలం ఫిజికల్ గోల్డ్ మాత్రమే కాదు, ఇంకా చాలా మార్గాలున్నాయి. పైగా, భౌతిక బంగారం కంటే వాటి వల్ల ఎక్‌స్ట్రా బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
పసిడిలో పెట్టుబడి మార్గాలు:
గోల్డ్ బాండ్స్
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (SGB) పేరిట కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రన్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SGBలను జారీ చేస్తుంది. కనిష్టంగా ఒక గ్రాము నుంచి గరిష్ఠంగా 4 కిలోల వరకు గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. బాండ్ల జారీని ప్రకటించడానికి ముందున్న మూడు రోజుల్లో బంగారం ధరను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. ఆ మూడు రోజుల ధరలకు సగటును లెక్కించి, ఆ మొత్తాన్ని సావరిన్ గోల్డ్ బాండ్‌లో ఒక గ్రాము బంగారం ధరగా నిర్ణయిస్తారు. ఏ బ్యాంక్ నుంచైనా సావరిన్ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయవచ్చు. వీటిపై ఏడాదికి 2.50 శాతం వడ్డీని చెల్లిస్తారు. వీటి కాల గడువు (మెచ్యూరిటీ పిరియడ్) 8 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. రిడీమ్ చేసుకునే సమయంలో ఉన్న రేటు ప్రకారం డబ్బు చెల్లిస్తారు. ఈ బాండ్లను బ్యాంకులో తనఖా పెట్టి లోన్ కూడా తీసుకోవచ్చు. ఇవి డిజిటల్ ఫార్మాట్‌లో ఉంటాయి కాబట్టి దొంగల భయం ఉండదు.
డిజిటల్ గోల్డ్
ఇది వర్చువల్ గోల్డ్. ఆన్‌లైన్‌లో మీడియేటర్ కంపెనీ ద్వారా కొనుగోలు చేయాలి. మీరు డబ్బు కట్టిన ప్రతిసారీ, ఆ డబ్బుకు సమానమైన బంగారాన్ని మీడియేటింగ్ కంపెనీ కొని, మీ పేరిట తన వద్ద దాస్తుంది. కనిష్టంగా ఒక గ్రాము కూడా కొనుగోలు చేయొచ్చు. మీ బంగారం తిరిగి కావాలని అనుకున్నప్పుడు భౌతిక లోహం రూపంలో తిరిగి మీకు అప్పగిస్తుంది. ఇప్పుడు.. స్టాక్ బ్రోకింగ్ కంపెనీలతో పాటు పేటీఎం, ఫోన్‌పే వంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థల ద్వారా కూడా డిజిటల్ గోల్డ్ కొనవచ్చు.
గోల్డ్ ETFs
దీనిని గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లేదా గోల్డ్ ETFs గా పిలుస్తారు. ఇది కూడా ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే బంగారమే. ఎలక్ట్రానిక్ రూపంలో సులభంగా వీటిని కొనవచ్చు, అమ్మవచ్చు. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా వీటిని ట్రేడ్ చేయొచ్చు. ETFs ద్వారా కొన్న పసిడి డీమ్యాట్ రూపంలో ఉంటుంది. కాబట్టి, బంగారం భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టవచ్చు. దీని కోసం వివిధ మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు నుంచి వివిధ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు జమ చేసే డబ్బును గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ పేరుతో మ్యూచువల్ ఫండ్స్ ETFల్లో పెట్టుబడి పెడతాయి. మీకు డీమ్యాట్ అకౌంట్ లేకపోయినా వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు.
మరో ఆసక్తికర కథనం: డౌన్ మార్కెట్‌లోనూ డబ్బును కాపాడే 'బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్'!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
New Year Financial Planning: ఇలాంటి ఫైనాన్షియల్ ప్లాన్‌తో కొత్త సంవత్సరం ప్రారంభించండి - ఏడాదంతా మీకు తిరుగుండదు!
Bank Timings Changed: బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్ - అన్ని బ్యాంకుల పని వేళల్లో మార్పులు
Bank Cheque: బ్యాంక్ చెక్కుల్లో 9 రకాలు - ఏది, ఎక్కడ ఉపయోగిస్తారో మీకు తెలుసా?
Gold-Silver Prices Today 18 Dec: ఈ రోజు చవకగా బంగారం కొనే అవకాశం - మీ ప్రాంతంలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Investment Secret: డబ్బులు సంపాదించే ట్రిక్ - ఈ బడా ఇన్వెస్టర్ల సీక్రెట్ ఎవరూ మీకు చెప్పి ఉండరు!
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement: "స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్