By: ABP Desam | Updated at : 04 Jan 2024 02:44 PM (IST)
ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచిన పెద్ద బ్యాంకులు
New Fixed Deposit Rates in 2024: కొత్త సంవత్సరంలో, ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాల్లో పెట్టుబడి పెట్టే వారికి శుభవార్త. దేశంలోని పెద్ద బ్యాంకులు FD స్కీమ్స్ మీద వడ్డీ రేట్లు పెంచాయి. నూతన సంవత్సరం సందర్భంగా, కొన్ని బ్యాంకులు కస్టమర్ల కోసం ప్రత్యేక టర్మ్ డిపాజిట్లను ప్రారంభించాయి.
వివిధ బ్యాంక్‌ల్లో కొత్త ఎఫ్‌డీ రేట్లు ఇవి:
బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక FD పథకం
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా, పెద్ద డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని అందిస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా స్పెషల్ FD పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, కస్టమర్లు 175 రోజుల కాలపు టర్మ్ డిపాజిట్‌కు 7.50% వడ్డీ పొందుతారు. రూ.2 నుంచి రూ.50 కోట్ల డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. ఈ పథకం జనవరి 1, 2024 నుంచి ప్రారంభమైంది.
పెరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ వడ్డీ రేట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీ స్కీమ్స్ మీద వడ్డీ రేట్లను పెంచింది. 180-270 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు (0.50%) పెంచింది. సాధారణ పౌరులు ఈ కాల వ్యవధిలో 6% వడ్డీని పొందుతారు. 271-1 సంవత్సరం కాలావధి FDపై వడ్డీ రేటును 45 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ కాలానికి డిపాజిట్ చేసిన మొత్తంపై 7.25% వడ్డీ రేటు వస్తుంది. 400 రోజుల FD పథకంలో, ఇప్పుడు 6.80%కు బదులుగా 7.25% వడ్డీ ఆదాయం లభిస్తుంది. కొత్త రేట్లు జనవరి 1, 2024 నుంచి అమలులోకి వచ్చాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన సంవత్సరం కానుక
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ (SBI), రూ.2 కోట్ల లోపు FD పథకాల రేట్లు పెంచింది. 7-45 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 3 నుంచి 3.50% వడ్డీ ప్రయోజనాన్ని అందిస్తోంది. 46-179 రోజుల ఎఫ్‌డీ స్కీమ్‌పై 4.5% నుంచి 4.75% వరకు, 180-210 రోజుల కాలావధికి 5.25% నుంచి 5.75% వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. 1-2 సంవత్సరాల టర్మ్ డిపాజిట్ల రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. 2-3 సంవత్సరాల FD పథకంపై 7.00% వడ్డీని, 3-5 సంవత్సరాల డిపాజిట్‌పై 6.75% వడ్డీని, 5-10 సంవత్సరాల స్కీమ్‌లో 6.50% వడ్డీ ప్రయోజనాలను సాధారణ కస్టమర్లు పొందుతున్నారు.
ICICI బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు
ప్రైవేట్ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్, 389 రోజుల స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై వడ్డీ రేట్లను 6.7% నుంచి 7.25%కు పెంచింది. 61-90 రోజుల ఎఫ్‌డీ స్కీమ్‌పై 4.50%కు బదులుగా 6%, 91-184 రోజుల స్కీమ్‌పై 4.75% బదులుగా 6.50%, 185-270 రోజుల ఎఫ్‌డీపై 5.75% ఇంట్రస్ట్‌ను ఆఫర్ చేస్తోంది. కొత్త రేట్లు జనవరి 3, 2023 నుంచి అమలులోకి వచ్చాయి.
యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు
యాక్సిస్ బ్యాంక్ కొత్త రేట్లు 2023 డిసెంబర్ 26 నుంచి అమలులో ఉన్నాయి. ఈ బ్యాంక్, 1 సంవత్సరం-15 నెలల FD పథకాలపై 7.10% వడ్డీ రేటును అందిస్తోంది. 15 నెలల కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న పథకాలపై 4.75% నుంచి 6% వరకు వడ్డీని చెల్లిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా FD స్కీమ్ రేట్లు
బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) 2023 డిసెంబర్ 29 నుంచి వడ్డీ రేట్లను పెంచింది. 1-2 సంవత్సరాల కాలానికి 6.85% వడ్డీని, 2-3 సంవత్సరాల కాలానికి 7.25% వడ్డీని, 3-10 సంవత్సరాల కాలానికి 6.50% వడ్డీని ఆఫర్ చేస్తోంది. 399 రోజుల బరోడా ట్రైకలర్ ప్లస్ డిపాజిట్ స్కీమ్‌పై 7.15% వడ్డీ ఆదాయం కస్టమర్లకు లభిస్తుంది.
DCB బ్యాంక్ వడ్డీ ఆదాయం
DCB బ్యాంక్, 12 నెలలు-12 నెలల 10 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ మీద 7.15%కు బదులుగా 7.85% వడ్డీ రేటు ప్రయోజనాన్ని అందిస్తోంది.
మరో ఆసక్తికర కథనం: భాగ్యనగరంలో సొంతింటికి పెరిగిన డిమాండ్, లగ్జరీ గృహాలకు యమా గిరాకీ
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
SBI Loan: లోన్ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్!
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Mike Tyson Vs Jake Paul: సరైన టైమ్‌లో హ్యాండిచ్చిన నెట్‌ఫ్లిక్స్ - విరుచుకుపడుతున్న నెటిజన్లు!
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు