By: Arun Kumar Veera | Updated at : 14 Nov 2024 12:29 PM (IST)
మీ పిల్లల కోసం గొప్ప ఆర్థిక బహుమతులు ( Image Source : Other )
Childrens Day 2024 Financial Gifts For Your Children: మీ పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి, వాళ్లకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి మీరు ఇప్పటి నుంచే పెట్టుబడులు లేదా పొదుపు ప్రారంభించాలి. మీ డబ్బును పెట్టుబడి పెట్టడానికి... కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం నుంచి సుకన్య సమృద్ధి యోజన, బ్యాంక్ ఎఫ్‌డీ, మ్యూచువల్ ఫండ్, పిల్లల కోసం ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ ప్లాన్ వరకు అనేక ఎంపికలు నేటి తల్లిదండ్రులకు అందుబాటులో ఉన్నాయి. బాలల దినోత్సవం సందర్భంగా, బెస్ట్ ఆప్షన్లను మీ ముందు ఉంచుతున్నాం.
ఎన్‌పీఎస్ వాత్సల్య (NPS Vatsalya)
నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద, దేశంలోని పిల్లలందరి భవిష్యత్తును ఆర్థికంగా బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ఇటీవల ఈ పథకాన్ని ప్రకటించింది. ఇందులో, తల్లిదండ్రులు తమ పిల్లల కోసం రూ. 1000తో పెట్టుబడి ప్రారంభించవచ్చు, గరిష్ట పరిమితి లేదు. ఈ పథకం మార్కెట్-లింక్డ్ దీర్ఘకాలిక పెట్టుబడి రాబడికి హామీ ఇస్తుంది.
గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF)
గోల్డ్ 'ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్' (ETFs) అనేది బ్యాంక్ FDలు & బ్యాంక్ ఖాతాల కంటే మెరుగైన వడ్డీ రాబడిని అందించే పెట్టుబడి ఎంపిక. స్టాక్ మార్కెట్ కంటే తక్కువ రిస్క్‌తోనే ఇది మంచి రిటర్న్స్ ఇస్తుంది. గోల్డ్ ఇటీఎఫ్ ద్వారా, పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెడతారు. బంగారం ధర పెరిగే కొద్దీ పెట్టుబడిదారులు మంచి రాబడి పొందుతారు.
పిల్లల కోసం ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ ప్లాన్ (Children Special Recurring Deposit Plans)
FD తరహాలోనే, పిల్లల కోసం ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ (RD) పథకాలను అనేక బ్యాంకులు అందిస్తున్నాయి. ఇందులో, తక్కువ మొత్తంలో పెట్టుబడిని ప్రారంభించి అధిక రాబడి ప్రయోజనాన్ని పొందొచ్చు. ఈ RD ఖాతాలో నిర్ణీత వ్యవధిలో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. ఇది FD తరహా ప్రయోజనాన్ని అందిస్తుంది.
మ్యూచువల్ ఫండ్లు (Mutual funds)
ఎక్కువ రిస్క్ వద్దు అనుకునేవాళ్లు తమ పిల్లల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో (MFs) చైల్డ్ సేవింగ్ ప్లాన్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. నేరుగా స్టాక్స్‌కు బదులు MFsలో పెట్టుబడి పెట్టడం ద్వారా, తక్కువ రిస్క్‌తో స్టాక్ మార్కెట్‌లో కొనసాగవచ్చు. . ఇది రెండు రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అవి... 1. దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్ నుంచి అధిక రాబడి, 2. తక్కువ రిస్క్.
సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana)
ఇది, ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. ఈ స్కీమ్‌ల డిపాజిట్లపై, ప్రస్తుతం, ఏడాదికి 8.20% ఆకర్షణీయమైన వడ్డీ రేటు లభిస్తోంది.సుకన్య సమృద్ధి యోజన (SSY) కింద కనీసం రూ. 250తో తమ కుమార్తె కోసం ఖాతా తెరవవచ్చు. అమ్మాయికి 10 ఏళ్లు నిండకముందే ఖాతా తెరవాలన్నది షరతు. ఇందులో పెట్టుబడులపై తల్లిదండ్రులకు కూడా ఆదాయ పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
పిల్లల కోసం పీపీఎఫ్ ఖాతా (Children Special PPF Account)
పిల్లల కోసం PPF ఖాతాను (Public Provident Fund Account) ఓపెన్ చేయడం వల్ల, తల్లిదండ్రులు తమ చిన్నారుల కోసం దీర్ఘకాలంలో మంచి సంపదను కూడగట్టవచ్చు. ఈ అకౌంట్ 15 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధితో ఉంటుంది. ఈ మధ్యలో డబ్బు విత్‌డ్రా చేసినా, అది పిల్లల ప్రయోజనం కోసమే అయివుండాలి. పిల్లల పీపీఎఫ్ ఖాతాలో తల్లిదండ్రులలో ఒకరు లేదా ఇద్దరూ ఉమ్మడిగా పెట్టుబడి పెట్టే సౌలభ్యం కూడా ఉంది.
పిల్లల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (Children Special Fixed Deposit Account)
పిల్లల కోసం ప్రత్యేక FDలు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులు వీటిపై ఆకర్షణీయమైన వడ్డీని ఇస్తున్నాయి. మీ పిల్లల కోసం PNB గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ స్కీమ్, PNB ఉత్తమ్ నాన్-కాలబుల్ టర్మ్ డిపాజిట్ స్కీమ్, YES బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఫర్ చైల్డ్, SBI చైల్డ్ FD వంటి కొన్ని మంచి ఆప్షన్లు మార్కెట్‌లో ఉన్నాయి.
మరో ఆసక్తికర కథనం: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!
RBI MPC Meeting: సైబర్ మోసాల నుంచి రక్షణ కోసం ప్రత్యేక ఇంటర్నెట్ సర్వీస్ ప్రకటించిన ఆర్‌బీఐ
RBI MPC Meeting Highlights: రెపో రేట్ నుంచి ద్రవ్యోల్బణం లెక్కల వరకు - ఆర్‌బీఐ గవర్నర్ ప్రధాన ప్రకటనలు
RBI Repo Rate Cut: రెపో రేట్ కటింగ్ తర్వాత రూ.25 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి హోమ్ లోన్‌పై EMI ఎంత తగ్గుతుంది?
RBI Repo Rate Cut: రెపో రేట్ 0.25 శాతం కట్ - ఐదేళ్లలో మొదటిసారి చవకగా మారిన రుణాలు, భారీ EMIల నుంచి ఉపశమనం
Gold-Silver Prices Today 07 Feb: రికార్డ్‌లు తిరగరాస్తున్న పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Repo Rate Cut: బ్రేకింగ్ న్యూస్ - రెపో రేట్ కట్ చేసిన రిజర్వ్ బ్యాంక్ - తగ్గనున్న వడ్డీ రేట్లు, EMIలు
Thandel Movie Review - తండేల్ రివ్యూ: సముద్రంలో చిక్కిన ప్రేమ... తీరానికి ఎలా చేరింది? నాగచైతన్య సినిమా హిట్టా? ఫట్టా?
Teenmar Mallanna Latest News: తీన్మార్ మలన్న సమరానికి సిద్ధమవుతున్నారా! రేవంత్‌పై తిరుగుబాటు చేస్తారా?
Sonusood: 'సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరం' - అరెస్ట్ వారెంట్ వార్తలపై సోనూసూద్ తీవ్ర అసహనం