By: Arun Kumar Veera | Updated at : 08 Jun 2024 10:32 AM (IST)
ఈ క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉంటే ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోకి ఫ్రీ ఎంట్రీ
Best Credit Cards For Airport Lounge Access: మన దేశంలో, స్థిరమైన ఆదాయం ఉన్న మెజారిటీ ప్రజల దగ్గర కనీసం ఒక్క క్రెడిట్ కార్డ్ అయినా ఉంటుంది. నిలకడగా డబ్బు సంపాదిస్తున్న వ్యక్తులకు బ్యాంక్‌లు వెంటపడి మరీ క్రెడిట్ కార్డ్‌లు అంటగడుతున్నాయి. మరోవైపు... గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. విమానయాన సంస్థలు, బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఈ స్పేస్‌లో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. తరచూ విమానయానం చేసే కస్టమర్లను ఆకర్షించేలా క్రెడిట్ కార్డ్ ఫీచర్లను ప్రకటిస్తున్నాయి. ఊరించే తాయిలాలతో కొత్త కార్డ్‌లను జారీ చేయడమే కాదు, ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డ్‌లనూ బ్యాంక్‌లు అప్‌గ్రేడ్ చేస్తున్నాయి.
ఎక్కువ డిమాండ్ ఉన్న ఫీచర్
విమాన ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని లాంచ్ చేస్తున్న క్రెడిట్ కార్డ్‌ల్లో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ఫీచర్‌కు చాలా డిమాండ్ ఉంది. ఎయిర్ ప్యాసెంజర్లు ఎక్కువగా కోరుకుంటున్న ఫెసిలిటీ ఇది. దీనివల్ల ప్రయాణ అనుభవం మెరుగు పడుతుంది, డబ్బు కూడా ఆదా అవుతుంది.
ప్రయాణీకుల కోసం రైల్వే స్టేషన్‌లలో వెయిటింగ్ రూమ్‌లు ఉన్నట్లే, విమానాశ్రయాల్లో లాంజ్‌లు ఉంటాయి. విమానాల కోసం ఎదురు చూసే ప్రయాణీకులు లాంజ్‌లో కూర్చుంటారు. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లు చాలా సౌకర్యవంతంగా & విశ్రాంతికి అనువుగా ఉంటాయి. అయితే... ఎయిర్‌పోర్ట్ లాంజ్‌ను అందరూ ఉచితంగా ఉపయోగించుకోలేరు. సాధారణంగా, విమానయాన సంస్థ అనుబంధ లాంజ్‌ల్లోకి వెళ్లడానికి ఫస్ట్ క్లాస్ లేదా బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు అనుమతి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ లేదా బిజినెస్ క్లాస్ టిక్కెట్ తీసుకోకపోయిప్పటికీ, ఎకానమీ క్లాస్ టిక్కెట్ తీసుకున్న వ్యక్తులకు కూడా కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. అయితే, కాంప్లిమెంటరీ యాక్సెస్ ప్రతిసారీ దొరక్కపోవచ్చు.
ఫస్ట్ క్లాస్/ బిజినెస్ క్లాస్ టిక్కెట్ లేదా కాంప్లిమెంటరీ యాక్సెస్ లేని వ్యక్తులు ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోకి వెళ్లడానికి కొంత డబ్బు చెల్లించాలి. మన దేశంలో అన్ని విమానాశ్రయ లాంజ్‌లోకి ప్రవేశ ధరలు ఒకేలా ఉండవు, విమానయాన సంస్థను బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా ఒక్కో విజిట్ రేట్ రూ.1,000 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ లాంజ్‌ల్లో సీటింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది, ఓ కునుకు కూడా తీయొచ్చు. ఫోన్, లాప్‌టాప్, ట్యాబ్, ఇయర్ బడ్స్ వంటివి ఛార్జ్ చేసుకోవడానికి ఛార్జింగ్ స్టేషన్‌లు ఉంటాయి. కాంప్లిమెంటరీ రిఫ్రెష్‌మెంట్‌లను కూడా విమానయాన కంపెనీలు అందిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, స్టార్ హోటల్‌కు వెళ్లిన అనుభవాన్ని లాంజ్‌లు అందిస్తాయి.
లాంజ్‌లోకి ఉచిత ప్రవేశం
ఫస్ట్ క్లాస్/ బిజినెస్ క్లాస్ టిక్కెట్ లేదా కాంప్లిమెంటరీ యాక్సెస్ లేనప్పుడు, కొన్ని క్రెడిట్ కార్డ్‌లు మీ డబ్బును ఆదా చేస్తాయి. ఉచిత ప్రవేశాన్ని లేదా తక్కువ ఖర్చుతో లాంజ్ యాక్సెస్‌ను ఆ కార్డ్‌లు అందిస్తాయి. దీనివల్ల, పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేకుండానే విమానాశ్రయ లాంజ్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఈ క్రెడిట్ కార్డ్‌లు మీ దగ్గర ఉంటే, దేశీయ & అంతర్జాతీయ విమానాశ్రయాల్లో లాంజ్ యాక్సెస్ ఉచితం:
-- హెచ్‌డీఎఫ్‌సీ రెగాలియా ఫస్డ్ క్రెడిట్ కార్డ్ (HDFC Regalia First Credit Card)
-- ఇంటర్‌మైల్స్ ఐసీఐసీఐ బ్యాంక్ సఫైరో క్రెడిట్ కార్డ్ (InterMiles ICICI Bank Sapphiro Credit Card)
-- ఎస్‌బీఐ ఎలైట్ ఎలైట్ క్రెడిట్ కార్డ్ (SBI ELITE Credit Card)
-- అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్లాటినం ట్రావెల్ క్రెడిట్ కార్డ్ (American Express Platinum Travel Credit Card)
-- యాక్సిస్ బ్యాంక్ విస్తారా ఇన్‌ఫినిట్ క్రెడిట్ కార్డ్ (Axis Bank Vistara Infinite Credit Card)
మరో ఆసక్తికర కథనం: ఒక్క రోజులోనే అతి భారీగా పసిడి పతనం - చక్రం తిప్పిన డ్రాగన్
Gold-Silver Prices Today 30 Nov: ప్యూర్ గోల్డ్, ఆర్నమెంట్ గోల్డ్ రేట్లు తగ్గాయ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Minor PAN Card: పిల్లల కోసం పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఏంటి లాభం?
Gold-Silver Prices Today 29 Nov: నగలు కొనేవాళ్లకు రోజుకో షాక్ ఇస్తున్న గోల్డ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
ఎఫ్డి మ్యాక్స్: బజాజ్ ఫైనాన్స్ యొక్క తాజా అధిక- రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫర్
Good Personal Loan: అత్యవసర ఖర్చుల్లో ఉన్నారా ? - పెద్దగా భారం పడని నాలుగు పర్సనల్ లోన్ మర్గాలు ఇవిగో
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్