By: ABP Desam | Updated at : 20 Jan 2022 07:14 PM (IST)
Edited By: Ramakrishna Paladi
బ్యాంక్ ఎఫ్‌డీ
అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనమంటే మనందరికీ గుర్తొచ్చేది 'ఫిక్స్‌డ్ డిపాజిట్'! ఎందుకంటే బ్యాంకుల్లో చేసే డిపాజిట్లకు కేంద్ర ప్రభుత్వ బీమా రక్షణ ఉంటుంది. మరీ ఎక్కువ రాబడి కానప్పటికీ మంచి వడ్డీయే లభిస్తుంది. వేర్వేరు బ్యాంకులు వేర్వేరు కాలపరిమితితో కూడిన ఎఫ్‌డీలకు వేర్వేరు వడ్డీరేట్లను అమలు చేస్తుంటాయి.
సాధారణంగా ఎఫ్‌డీ కాలపరిమితి కనీసం ఏడు రోజుల నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు ఉంటుంది. ఏడు రోజుల నుంచి ఏడాది కాల వ్యవధి గల ఎఫ్‌డీలను స్వల్ప కాల ఎఫ్‌డీలు అంటారు. ఆర్‌బీఐ నిర్దేశాల ప్రకారం వడ్డీరేట్లు మారుతుంటాయి. ఎఫ్‌డీ కాల వ్యవధిని బట్టీ ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఏడాది కాల వ్యవధిగల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మిగతా వాటి కన్నా అధిక వడ్డీ అందిస్తున్నాయి.
అధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులు
* ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏడాది ఎఫ్‌డీకి 6 శాతం వడ్డీ అందిస్తోంది. రూ.10,000 డిపాజిట్ చేస్తే రూ.10,613 చేతికి అందుతాయి.
* ఆర్‌బీఎల్ బ్యాంకు కూడా 6 శాతం వడ్డీయే ఇస్తోంది.
* డీసీబీ బ్యాంక్ 5.55 శాతం వడ్డీ ఇస్తోంది. రూ.10,000 డిపాజిట్‌కు రూ.10,613 చేతికి అందుతాయి.
* బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 5.25 శాతం వడ్డీ ఇస్తున్నాయి. రూ.10,000కు మెచ్యూరిటీ సమయంలో రూ.10,535 అందుతాయి.
సీనియర్ సిటిజన్లకు
* ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏడాది ఎఫ్‌డీకి 6.5 శాతం వడ్డీ అందిస్తోంది. రూ.10,000 డిపాజిట్ చేస్తే రూ.10,666 చేతికి అందుతాయి.
* ఆర్‌బీఎల్ బ్యాంకు కూడా 6.5 శాతం వడ్డీయే ఇస్తోంది.
* డీసీబీ బ్యాంక్ 6.05 శాతం వడ్డీ ఇస్తోంది. రూ.10,000 డిపాజిట్‌కు రూ.10,618 చేతికి అందుతాయి.
* బంధన్ బ్యాంక్ 6.00 శాతం వడ్డీ ఇస్తోంది. రూ.10,000కు మెచ్యూరిటీ సమయంలో రూ.10,613 అందుతాయి.
* యాక్సిస్ బ్యాంక్ 5.75 శాతం వడ్డీ చెల్లిస్తోంది. రూ.10,000 పెట్టుబడి రూ.10,587 అవుతుంది.
పై బ్యాంకులు ఏడాది ఎఫ్‌డీలకు అత్యధిక వడ్డీ అందిస్తుండగా పెద్ద బ్యాంకులు సైతం వడ్డీరేట్లను సవరించాయి. కొన్ని రోజుల ముందే రూ.2 కోట్ల లోపు, రెండేళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచింది. పది బేసిస్ పాయింట్ల మేర సవరించింది. జనవరి 15, 2022 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ప్రైవేటు రంగంలోనే అతిపెద్ద బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ కూడా ముందుగానే వడ్డీరేట్లను పెంచింది. ఎక్కువ లిక్విడిటీ, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉండటంతో చాలామంది ఎఫ్‌డీలను సులభమైన, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తారు.
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!
Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్! ఈ సారి పార్ట్1, పార్ట్2గా విభజన!
Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!
Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!
PF Salary Limit: పీఎఫ్ జీతాల పరిమితి 25-30 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం! దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?
World Cheapest Silver Price: ప్రపంచంలో అత్యంత చౌకగా వెండి లభించే దేశం ఏదీ? భారత్ కంటే 40 వేల రూపాయల వరకు తక్కువ!
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Hyderabad Cyber Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో