By: ABP Desam | Updated at : 29 Oct 2021 09:10 PM (IST)
ఈపీఎఫ్ ఖాతాల్లోకి నగదు
EPF interest: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పీఎఫ్ నగదుకు సంబంధించిన వడ్డీలపై కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. 2020-21కి గానూ రావాల్సిన ఈపీఎఫ్ వడ్డీని త్వరలోనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనుంది. తద్వారా 6 కోట్లకు పైగా ఈపీఎఫ్ ఖాతాదారులైన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.
ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు దీపావళికి ముందే వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర కార్మిక శాఖ ఈపీఎఫ్ వడ్డీని త్వరలోనే జమ చేయనుందని ఆ శాఖ కార్యదర్శి సునీల్ బర్త్‌వాల్ వెల్లడించారు. దీపావళి పండుగ సమయంలో ప్రతి ఏడాది కేంద్ర కార్మిక శాఖ, ఈపీఎఫ్ఓలు పీఎఫ్ ఖాతాదారులు నెలాఖరులోగా వడ్డీ నగదు అందుకోనున్నారు. ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ చేయడంపై గత కొన్ని రోజులుగా ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సమావేశమవుతున్నారు.
Also Read: సేవింగ్స్ ఖాతాలపై 7 శాతం వడ్డీ కావాలా..! ఈ బ్యాంకుల్లో ఇస్తున్నారు
కరోనా కష్ట కాలంలో ఈపీఎఫ్ ఖాతాలలో ఉద్యోగుల నగదుపై చెల్లించే వడ్డీని తగ్గిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈపీఎఫ్ఓ, కేంద్ర కార్మికశాఖ సమావేశమై వడ్డీ రేటును 8.5 శాతంగా యథాతథంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. కనుక ఈపీఎఫ్ ఖాతాదారులుగా ఉన్న 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు గత ఏడాది లభించిన వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాల్లో పొందనున్నారు.
ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఈ విధానాల్లో తెలుసుకోండి..
ఎస్ఎంఎస్ ద్వారా..
యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ద్వారా ఈపీఎఫ్ ఖాతాదారులు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఒక్క మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు రిజిస్టర్డ్ మొబైల్‌కు వస్తాయి. EPFOHO UAN ENG అని 7738299899 మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి ఇన్‌స్టాల్ మెంట్ వివరాలు అందుతాయి.
Also Read: క్రెడిట్ కార్డుపై రుణమా.. యమ డేంజర్! ఈ విషయాలు తెలుసుకున్నాకే తీసుకోండి!
మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్..
ఈపీఎఫ్ బ్యాలెన్స్ మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ఈపీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఈపీఎఫ్ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు. అయితే యూఏఎన్ నెంబర్, కేవైసీ లింక్ చేసి ఉన్న వారికి మాత్రమే పీఎఫ్ వివరాలు అందుతాయని ఈపీఎఫ్ఓ పేర్కొంది.
Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్!
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!
Gold-Silver Prices Today 14 Nov: పసిడిలో మహా పతనం, లక్షకు దిగువన వెండి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Swiggy: స్విగ్గీ ఉద్యోగులకు జాక్‌పాట్ - 500 మందికి రూ.కోట్లు వచ్చి పడ్డాయి
Train Journey: థర్డ్ ఏసీ టికెట్‌తో ఫస్ట్ ఏసీలో ప్రయాణం చేయొచ్చు, దీనికోసం ఏం చేయాలి?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!