search
×

Women And Finance In India: పని చేసే మహిళల వేతనాల్లో ఇంత వ్యత్యాసమా? క్రిసిల్-డిబిఎస్ బ్యాంక్ సంచలన రిపోర్ట్

Why Should not Women Get Equal Pay: దేశంలోని ప్రధాన నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలతో పాటు స్వయం ఉపాధి పొందుతున్న మహిళల వృత్తిపరమైన ఆకాంక్షలు, వ్యక్తిగత జీవనశైలి ప్రాధాన్యతలపై పరిశీలించబడింది.

FOLLOW US: 
Share:

Pay Gap In Women: దేశంలోని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్, ప్రైవేటు బ్యాంక్ డిబిఎస్ ఇండియా సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించాయి. ఈ రెండు ఉమెన్ అండ్ ఫైనాన్స్ పేరుతో నిర్వహించిన అధ్యయనానికి సంబంధించి రెండవ రిపోర్టును తాజా ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

ఇందులో దేశంలోని 10 నగరాల్లో జీతం, స్వయం ఉపాధి పొందుతున్న మహిళల వృత్తిపరమైన ఆకాంక్షలు, వ్యక్తిగత జీవనశైలి ప్రాధాన్యతలను పరిశించారు. దీనిలో గమనించిన అంశాలు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో నివశిస్తున్న మహిళల ఆలోచనలకు, ఆశయాలకు అద్దపడుతోంది. డిబిఎస్ అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా ఉద్యోగం చేస్తున్న మహిళల్లో జీతాల వ్యత్యాసం 23 శాతంగా ఉన్నట్లు తేలింది. లింగ వివక్ష 16 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. కోల్‌కత్తా నుంచి దేశ రాజధాని దిల్లీ వరకు పని చేసే ప్రాంతాల్లో అనేక వ్యత్యాసాలను ఈ సర్వే వెల్లడించింది.

నివేదిక ప్రకారం కోల్‌కత్తాలోని ఉద్యోగం చేస్తున్న మహిళల్లో 96 శాతం మంది తమ యజమానులతో జీతభత్యాల గురించే చర్చించటంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని తెలిపారు. అయితే ఇది అహ్మదాబాదులో కేవలం 33 శాతానికి పరిమితమైం. అలాగే నివేదికలో మహిళలు తమ ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో పొందుతున్న ప్రయోజనాలు, పాలసీల గురించి సైతం వెల్లడించింది. కోల్‌కత్తాలో 46 శాతం మహిళలు మెంటర్‌షిప్, కెరీర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ అత్యంత విలువైనవిగా భావిస్తుండగా.. దిల్లీలో మహిళలు 33 శాతం మంది జీతభత్యాలు, సంస్థలు అందించే పిల్లల సంరక్షణ బెనిఫిట్స్ విలువైనవిగా భావిస్తున్నట్లు వెల్లడైంది. 

నగరాల్లో ఉద్యోగం చేస్తున్న మహిళలు ఇంత బిజీ జీవితాన్ని గడుపుతున్నప్పటికీ గడచిన ఏడాది 66 శాతం మంది ఆరోగ్యంపై దృష్టి సారించి హెల్త్ చెకప్స్ చేయించుకున్నట్లు వెల్లడైంది. డిబిఎస్ బ్యాంకులో సైతం ఇదే ట్రెండ్ నమోదైంది. 57 శాతం మంది మహిళలు తమ హెల్త్ చెకప్స్ గురించి వెల్లడించారు. 

అధ్యయనం నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఉద్యోగాలు చేస్తున్న మహిళల ఆకాంక్షల గురించి వారి సంస్థలు మెరుగైన అవగాహన పొందేందుకు దోహదపడనుంది. ఇది ఉద్యోగ ప్రదేశంలో వారికి అవసరమైన, వారు కావాలనుకుంటున్న విభిన్న అవసరాలను పరిష్కరించటంలో సహాయపడుతుంది. ఇది వారిని వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగానూ అభివృద్ధి చెందేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. ఇప్పకీ కొనసాగుతున్న మూస పద్ధతులను విడిచి వారిపై వారికున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కచ్చితంగా సెలబ్రేట్‌ చేయాలని నివదిక పేర్కొంది. 

Also Read: ఆర్బీఐ హెచ్చరిక! లోన్స్ తీసుకునేటప్పుడు ఈ 4 విషయాలు గమనించాలని సూచన

Published at : 03 May 2024 07:33 AM (IST) Tags: DBS Bank India DBS CRISIL report CRISIL survey Women And Finance Urben Women

ఇవి కూడా చూడండి

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

Gold-Silver Prices Today 20 Dec: మీ నగరంలో చవకగా మారిన గోల్డ్‌, సిల్వర్‌ నగలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 20 Dec: మీ నగరంలో చవకగా మారిన గోల్డ్‌, సిల్వర్‌ నగలు -  ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Instant Loan Apps: అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ ఇవి, కానీ జాగ్రత్త!

Instant Loan Apps: అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ ఇవి, కానీ జాగ్రత్త!

Instant Loan: తక్షణం రూ.10,000 లోన్ తీసుకోవచ్చు - ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేయాలి?

Instant Loan: తక్షణం రూ.10,000 లోన్ తీసుకోవచ్చు - ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేయాలి?

Trending Gold Jewellery: ధర తక్కువ, మన్నిక ఎక్కువ - ఇప్పుడు ఎవరి ఒంటిపై చూసినా ఇవే నగలు!

Trending Gold Jewellery: ధర తక్కువ, మన్నిక ఎక్కువ - ఇప్పుడు ఎవరి ఒంటిపై చూసినా ఇవే నగలు!

టాప్ స్టోరీస్

Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం

Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం

Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?

Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?

తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు

తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు