By: Arun Kumar Veera | Updated at : 20 Dec 2024 10:05 AM (IST)
రూ.10,000 ఇన్‌స్టాంట్ లోన్ కోసం అవసరమైన పత్రాలు ( Image Source : Other )
How To Apply For A Instant Loan: హఠాత్తుగా డబ్బులు అవసరమైనప్పుడు చేబదులు లేదా అప్పు తీసుకుంటాం. మీకు అర్జంట్‌గా రూ. 10,000 అవసరమైందనుకోండి, ఇన్‌స్టాంట్ లోన్ ఇచ్చే బ్యాంక్‌లు, చాలా లోన్ యాప్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు దరఖాస్తు చేసుకునే ముందు.. ఎవరు అర్హులు, ఏ అవసరం కోసం అప్పు తీసుకోవాలనే విషయాలపై క్లారిటీ ఉండాలి.
రూ. 10,000 ఇన్‌స్టాంట్ లోన్ కోసం అర్హతలు (రుణదాతను బట్టి వీటిలో కొన్ని మారొచ్చు)
1. కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ట వయస్సు సాధారణంగా 60 సంవత్సరాలు, కొన్నిసార్లు 65 సంవత్సరాల వరకు అందిస్తారు.
2. ప్రైవేట్/ ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న జీతం పొందేన వ్యక్తులు. వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు లేదా గిగ్ వర్కర్లు కూడా అర్హులు.
3. కనీస క్రెడిట్ స్కోర్ 650. ఇంతకంటే తక్కువ స్కోర్ ఉప్పటికీ అర్హులు కావచ్చు. కానీ, రూల్స్ మరింత కఠినంగా మారతాయి.
4. జీతం తీసుకుంటున్నా, స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందుతున్నా.. స్థిరమైన నెలవారీ ఆదాయ రుజువు అవసరం. నెలవారీ ఆదాయం లేకపోయినా, కొంతమంది రుణదాతలు సగటు ఆదాయాన్ని చూస్తారు.
5. ఈ అర్హతలన్నీ ఉన్నప్పటికీ లోన్ వస్తుందన్న గ్యారెంటీ లేదు. తుది నిర్ణయం రుణదాతదే.
రూ.10,000 ఇన్‌స్టాంట్ లోన్ కోసం అవసరమైన పత్రాలు
1. గుర్తింపు రుజువు - ఆధార్ కార్డ్, ఓటరు ID, PAN కార్డ్, పాస్‌పోర్ట్ వంటి వాటిలో ఏదో ఒకటి ఉండాలి
2. చిరునామా రుజువు - ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ID, పాస్‌పోర్ట్‌తో పాటు విద్యుత్, వాటర్ లేదా గ్యాస్ బిల్లును నివాస రుజువుగా చూపించొచ్చు. కొన్ని సందర్భాల్లో అద్దె ఒప్పందం కూడా పనికొస్తుంది.
3. ఆదాయ రుజువు - జీతం తీసుకునే వ్యక్తి అయితే గత 3 నెలల పేస్లిప్‌లు సమర్పించాలి. స్వయం ఉపాధి పొందే వ్యక్తి అయితే గత సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఇవ్వాలి.
4. బ్యాంక్ స్టేట్‌మెంట్ - కొంతమంది రుణదాతలు అడుగుతారు, మరికొందరు అడగరు
రూ. 10,000 ఇన్‌స్టాంట్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?
తక్షణ రుణం కోసం దరఖాస్తు చేయడం చాలా సులభం. చాలా బ్యాంక్‌లు ఆన్‌లైన్ అప్లికేషన్‌ను అందిస్తున్నాయి. లోన్ యాప్‌లో అయితే ఆన్‌లైన్‌లో మీ వివరాలు పూర్తి చేయాలి.
1. రుణదాత వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి
2. రుణదాత నిబంధనల ప్రకారం మీకు అన్ని అర్హతలు ఉన్నాయో, లేదో చూసుకోండి
3. మీ పేరు, వయస్సు, ఉద్యోగ స్థితి, ఆదాయం, లోన్ మొత్తం వంటి వివరాలను అందించండి
4. వ్యక్తిగత గుర్తింపు, చిరునామా, ఆదాయ రుజువు పత్రాలను అప్‌లోడ్ చేయండి
5. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసే ముందు అన్ని వివరాలను మరోమారు చెక్ చేసుకోండి
6. మీ దరఖాస్తును సమర్పించిన తర్వాత, రుణదాత వివరాలను ధృవీకరిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే, లోన్ ఆమోదం లభిస్తుంది
రుణదాత ఆమోదించిన లోన్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు తక్షణం క్రెడిట్ అవుతుంది. అయితే, లోన్ కోసం అప్లై చేసే ముందే, నిజంగా లోన్ తీసుకోవాల్సినంత అవసరం మీకు ఉందా అని మరోమారు ఆలోచించుకోండి.
విద్యార్థులు రూ. 10,000 ఇన్‌స్టాంట్ లోన్ దరఖాస్తు చేయవచ్చా?
విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, అయితే, విద్యార్ధులకు స్థిరమైన ఆదాయం ఉండకపోవచ్చు. కాబట్టి, గ్యారెంటర్ లేదా కో-అప్లిక్యాంట్ (తల్లిదండ్రుల వంటివారు) అవసరం కావచ్చు. సాధారణంగా, విద్యార్థుల పేరిట ఇచ్చే లోన్ తక్కువ వడ్డీతో, సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్స్‌తో ఉంటాయి.
మరో ఆసక్తికర కథనం: ఈ 5 అలవాట్లు మీకు ఉంటే ధనలక్ష్మి మీ ఇంటి నుంచి వెళ్లదు గాక వెళ్లదు!
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత