ఎండలు మండుతున్న నేపథ్యంలో పిల్లల విషయంలో జాగ్రత్త! వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ఎక్కువగా ఇండోర్ గేమ్స్ ఆడేలా చూడాలి. 4 నుంచి 9 ఏండ్ల పిల్లలకు 1 నుంచి 2 లీటర్ల నీళ్లు తాగించాలి. పిల్లలు హైడ్రేటెడ్ గా ఉండేందుకు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ తాపాలి. వేసవిలో వీలైనంత వరకు బయటి ఫుడ్ పెట్టకపోవడం మంచిది. పిల్లలకు తేలిక రంగు కలిగిన వదులు దుస్తులు వేయాలి. పిల్లలు ఉండే గది కూల్ గా ఉండేలా చూసుకోవాలి. చంటి పిల్లలకు ఎక్కువగా తల్లి పాలు పట్టాలి. రబ్బరు డైపర్లు వీలైనంత వరకు వాడకపోవడం మంచిది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com