By: Arun Kumar Veera | Updated at : 02 Dec 2024 11:57 AM (IST)
Bank Holidays List December 2024 ( Image Source : Other )
Bank Holiday List For December 2024: క్రిస్మస్ (Christmas 2024) సహా వివిధ జాతీయ & ప్రాంతీయ సెలవుల కారణంగా ఈ నెలలో (డిసెంబర్ 2024) దేశవ్యాప్తంగా బ్యాంకులు చాలా రోజుల పాటు సెలవుల్లో ఉంటాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారతాయి. సెలవుల పూర్తి జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన వెబ్‌సైట్‌లో ఉంచింది.
డిసెంబర్ నెలలో, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్, పా-టోగన్ నెంగ్మింజా సంగ్మా సంస్మరణ రోజులు, యు సోసో థామ్ వర్ధంతి, గోవా విమోచన దినోత్సవం, క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్, క్రిస్మస్ వేడుకలు, యు కియాంగ్ నాంగ్‌బా, నూతన సంవత్సర పండుగ/లాసాంగ్/నామ్‌సూంగ్‌తో వంటి సందర్భాలు, వేడుకలు ఉన్నాయి. ఆయా రోజుల్లో, ప్రాంతాన్ని బట్టి బ్యాంకులు సెలవులు పాటిస్తాయి. ఆదివారాలతో పాటు రెండు & నాలుగు శనివారాల్లోనూ దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతబడతాయి.
డిసెంబర్‌లో 5 ఆదివారాలు వచ్చాయి, ఈ రోజుల్లో బ్యాంక్‌లు పని చేయవతు. వీటికి అదనంగా, RBI మార్గదర్శకాల ప్రకారం, అన్ని షెడ్యూల్డ్ & నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు నెలలోని రెండో & నాలుగో శనివారం రోజుల్లో మూతబడతాయి.
తేదీ & రాష్ట్రం వారీగా డిసెంబర్ 2024లో బ్యాంక్ సెలవుల జాబితా:
డిసెంబరు 01 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
డిసెంబరు 3: గోవాలో ముఖ్యమైన ఆచారం అయిన 'సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫీస్ట్' సందర్భంగా, ఆ రాష్ట్రంలో బ్యాంకులు మూతబడతాయి
డిసెంబరు 08 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
డిసెంబర్ 12: మేఘాలయలో జరుపుకునే ప్రాంతీయ సెలవు దినం 'ప-టోగన్ నెంగ్మింజ సంగ్మా'. దీనికోసం మేఘాలయలో బ్యాంకులు సెలవులో ఉంటాయి
డిసెంబర్ 14 (శనివారం): రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
డిసెంబరు 15 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
డిసెంబరు 18: మేఘాలయ రాష్ట్ర చరిత్రలో ప్రముఖ వ్యక్తి యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు హాలిడే
డిసెంబరు 19: పోర్చుగీస్ పాలన అంతమై గోవా స్వాతంత్ర్యం పొందిన రోజు. గోవా విమోచన దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులు సెలవు తీసుకుంటాయి
డిసెంబరు 22 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
డిసెంబర్ 24: క్రిస్మస్ పండుగకు ముందు రోజు మధ్యాహ్నం నుంచి మిజోరం, నాగాలాండ్, మేఘాలయాలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 25: క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు
డిసెంబర్ 26: మిజోరం, నాగాలాండ్, మేఘాలయలలో పండుగ వేడుకలు కొనసాగుతాయి, బ్యాంకులు మూతబడతాయి
డిసెంబర్ 27: క్రిస్మస్ సంబరాలకు కొనసాగించడానికి నాగాలాండ్‌లో బ్యాంకులు సెలవు తీసుకుంటాయి
డిసెంబర్ 28 (శనివారం): నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
డిసెంబరు 29 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
డిసెంబరు 30: స్థానిక నాయకుడు యు కియాంగ్ నంగ్‌బా గౌరవార్ధం మేఘాలయలోని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 31: మిజోరాం, సిక్కింలో నూతన సంవత్సరం ముందస్తు వేడుకలు లేదా లాసాంగ్/నామ్‌సూంగ్ సందర్భంగా బ్యాంకులకు హాలిడే
ఈ రాష్ట్ర-నిర్దిష్ట సెలవులను పరిగణనలోకి తీసుకుని, కస్టమర్‌లు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
సెలవుల సమయంలో బ్యాంకింగ్ సేవలు
బ్యాంక్‌లకు సెలవులు ఉన్నప్పటికీ, UPI, IMPS, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ ఛానెల్‌ల ద్వారా ప్రజలు 24 గంటలూ ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ATMలు కూడా 24 గంటలూ సేవలు అందిస్తాయి.
మరో ఆసక్తికర కథనం: ITR ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్ మారింది - కొత్త తేదీ ఇదే
SIP- HIP And TIP: ఆర్థిక ప్రణాళికలో సిప్, హిప్, టిప్ మధ్య వ్యత్యాసం ఏంటి? ఏది మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్!
New Rules From November 1:బ్యాంకింగ్ రూల్స్ నుంచి ఆధార్ వరకు నవంబర్ నుంచి వస్తున్న 5 పెద్ద మార్పులు ఇవే!
EPF Money ATM Withdrawal Process : ATM నుంచి EPF డబ్బును ఎలా విత్‌డ్రా చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకోండి!
Gold Price : బంగారం, వెండి కొనాలా? ఇంకా కొన్ని రోజులు ఆగాలా? ధరలో తగ్గుదల ఉంటుందా? మరింత పెరుగుదల ఉంటుందా?
8th Pay Commission : ఎనిమిదో వేతన సంఘం ఛైర్‌పర్శన్‌గా నియమితులైన జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ ఎవరు?
Vizag Glass Bridge: వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
Karnataka doctor Murder case: డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ కేసులో సంచలనం - నీకోసమే మర్డర్ చేశానంటూ లవర్స్‌కు భర్త మెసెజులు
BRS MLAs Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ విడుదల, ఈ 6 నుంచి విచారణ
Constable Kanakam Series Season 2 : 'వేర్ ఈజ్ చంద్రిక?'... ఆన్సర్ రెడీ - 'కానిస్టేబుల్ కనకం' సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది!