By: ABP Desam | Updated at : 05 Jun 2023 02:49 PM (IST)
బ్యాంకింగ్ సేవలు ( Image Source : Pixabay )
Banking Services Unavailable:
హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు అలర్ట్! జూన్ నెలలో కొన్ని రోజులు ఈ రెండు బ్యాంకులకు చెందిన కొన్ని సేవలు పని చేయవని తెలిసింది. ఈ నెల 10, 18 తేదీల్లో ఉదయం 3 నుంచి 6 గంటల వరకు హెచ్‌డీఎఫ్‌సీ వినియోగదారులు బ్యాంకు బ్యాలెన్స్, డిపాజిట్లు, ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి సేవలను ఉపయోగించుకోలేరు. జూన్ 10న కొన్ని గంటల పాటు ఎంపిక చేసిన కొన్ని డెబిట్ కార్డుల సేవలకు అంతరాయం కలుగుతుందని కొటక్ మహీంద్రా బ్యాంకు వెల్లడించింది.
'వినియోగదారులకు మేం అత్యుత్తమ బ్యాంకింగ్ సేవలు, బ్యాంకింగ్ అనుభవం అందించేందుకు కట్టుబడ్డాం. ఇందుకోసం మేం అత్యవసరమైన సిస్టమ్ అప్‌గ్రేడేషన్, మెయింటెనెన్స్ చేపడుతున్నాం. ఇందులో భాగంగా కొన్ని రోజుల్లో కొన్ని గంటల పాటు మా సేవలు అందుబాటులో ఉండవు' అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (HDFC Bank) ఈమెయిల్ సందేశాలు పంపించింది. జూన్ 4న ఉదయం 3 నుంచి 6 గంటల మధ్య ఒకసారి సేవలు పనిచేయలేదు.
జూన్ 10న కొన్ని గంటల పాటు డెబిట్ కార్డు, స్పెండ్‌జ్ కార్డ్, గిఫ్ట్ కార్డు కస్టమర్లకు కొన్ని సేవలు అందుబాటులో ఉండవని కొటక్ మహీంద్రా బ్యాంకు (Kotak Mahindra Bank) తెలిపింది. కార్డు కంట్రోల్స్, కార్డు బ్లాకింగ్, అన్‌బ్లాకింగ్, ప్రైమరీ అకౌంట్ ఛేంజ్, అకౌంట్ లింకింగ్, అకౌంట్ డీలింకింగ్, కొత్త డెబిట్ కార్డు, ఇమేజ్ కార్డు కోసం రిక్వెస్టులు, కార్డు క్లోజర్, కార్డు ఎంక్వైరీ, వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్, టోకెనైజేషన్, పిన్ రీ జెనరేషన్ వంటివి సేవలు పని చేయవు. కాగా జూన్ 3న అప్పులకు సంబంధించిన సేవల్ని నిలిపివేశారు.
జూన్‌లో 12 రోజులు బ్యాంకులకు సెలవులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ కస్టమర్ల సౌలభ్యం కోసం ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్ హాలిడేస్ లిస్ట్‌ను ముందుగానే విడుదల చేస్తుంది. ప్రతి రాష్ట్రంలోని పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వచ్చే సెలవుల వివరాలు ఈ లిస్ట్‌లో ఉంటాయి. జూన్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉన్నాయి. శని, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులతో పాటు, పండుగలు, ఇతర కార్యక్రమాల వల్ల వచ్చే సెలవులు కూడా ఈ లిస్ట్‌లో కలిసి ఉన్నాయి. జూన్ నెలలో.. పూరీ రథయాత్ర, ఖర్చీ పూజ, ఈద్ ఉల్ అజా వంటి కొన్ని ముఖ్యమైన వేడుకలు ఉన్నాయి. బ్యాంకు సెలవుల జాబితా ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి మారుతుంది.
Also Read: ఇంకా ఫామ్-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్ కూడా ఉంది
2023 జూన్ నెలలో బ్యాంకులకు సెలవు రోజులు:
జూన్ 4, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 10, 2023- రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 11, 2023 - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 15, 2023- రాజా సంక్రాంతి కారణంగా మిజోరం, ఒడిశాలో బ్యాంకులు పని చేయవు
జూన్ 18, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 20, 2023- రథయాత్ర కారణంగా ఒడిశాలో బ్యాంకులు పని చేయవు
జూన్ 24, 2023- నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 25, 2023-ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 26, 2023- ఖర్చీ పూజ నేపథ్యంలో త్రిపురలో బ్యాంకులు పని చేయవు
జూన్ 28, 2023- ఈద్ ఉల్ అజా కారణంగా కేరళ, మహారాష్ట్ర, జమ్ము, కశ్మీర్‌లో బ్యాంకులను మూసిస్తారు
జూన్ 29, 2023- ఈద్ ఉల్ అజా సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు
జూన్ 30, 2023- ఈద్ ఉల్ అజా కారణంగా మిజోరాం, ఒడిశాలో బ్యాంకులను మూసివేస్తారు
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా
Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం
Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ