search
×

Aadhar: ఆధార్‌ కార్డ్‌లో అడ్రస్‌ మార్చుకోవాలా?, ఒక్క రూపాయి కట్టకుండా ఆ పని పూర్తి చేయొచ్చు

Aadhaar Card:మీ దగ్గర సరైన ప్రూఫ్‌ ఉంటే, మీ ఆధార్‌ కార్డ్‌లోని అడ్రస్‌ను తెలంగాణ చిరునామాలోకి ఈజీగా మార్చొచ్చు.

FOLLOW US: 
Share:

Update Address in Aadhaar Card: తెలంగాణ అడ్రస్‌తో మీకు ఆధార్‌ కార్డ్‌ ఉంటే, తెలంగాణలో ఈ మూల నుంచి ఆ మూల వరకు టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ఫ్రీగా తిరగొచ్చు. రేవంత్‌ రెడ్డి గవర్నమెంట్‌ ఇస్తున్న బంపర్‌ ఆఫర్‌ ఇది. ఒకవేళ, మీరు తెలంగాణలో నివశిస్తున్నా, మీ ఆధార్‌ కార్డ్‌లో తెలంగాణ అడ్రస్‌ లేకపోతే చింతించక్కర్లేదు. మీ దగ్గర సరైన ప్రూఫ్‌ ఉంటే, మీ ఆధార్‌ కార్డ్‌లోని అడ్రస్‌ను తెలంగాణ చిరునామాలోకి ఈజీగా మార్చొచ్చు. అదీ, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఆ పని పూర్తి చేయొచ్చు. 

ఆధార్‌ కార్డ్‌లో చిరునామాను మార్చుకోవడం సహా అన్ని వివరాలు అప్‌డేట్‌ మార్చుకోవడానికి, తప్పులు సరి చేసుకోవాలనుకోవడానికి ఇప్పుడు ఉచిత ‍ఆఫర్‌ (Update Aadhaar Details For Free) నడుస్తోంది. 

గత పదేళ్లుగా ఆధార్‌లో ఎలాంటి మార్పులు చేయని వ్యక్తుల కోసం ఉడాయ్‌ (Unique Identification Authority of India - UIDAI) 'ఫ్రీ ఆధార్‌ అప్‌డేషన్‌' అవకాశం ఇచ్చింది. వాస్తవానికి, ఆధార్‌ వివరాలను ఉచితంగా మార్చుకునే చివరి తేదీ ఈ మధ్యే, డిసెంబర్‌ 14, 2023తో ముగిసింది. ఉడాయ్‌ దీనిని మరోమారు పొడిగించింది. 

ఇప్పుడు, 2024 మార్చి 14వ తేదీ వరకు, ఇంటి అడ్రస్‌ సహా ఆధార్‌ వివరాలను ఉచితంగా ‍‌(Last Date For Update Aadhaar Details For Free) అప్‌డేట్‌ చేయవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా అప్‌డేట్‌ చేసే వాళ్లకే ఈ ఛాన్స్. ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయడం రాకపోతే.. ఆధార్‌ కేంద్రం/CSCకి వెళ్లి, అడ్రస్‌ సహా ఆధార్‌ సమాచారాన్ని మార్చుకోవచ్చు. దీనికి రూ.25 ఛార్జీ చెల్లించాలి. కానీ, అక్కడ ఒక్కో సవరణకు అనధికారికంగా రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. 

ఆధార్‌ కార్డ్‌లో అడ్రస్‌ వివరాలను ఫ్రీగా ఎలా అప్‌డేట్ చేయాలి? (How Update Address in Aadhaar Card For Free?)

ఉడాయ్‌ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి మీ ఆధార్ కార్డ్‌లోని అడ్రస్‌ను 'ఫ్రీ'గా అప్‌డేట్ చేయొచ్చు. దీనికోసం, మీ దగ్గర తగిన రుజువు పత్రాలు ఉండాలి. మీ అడ్రస్‌ను మార్చుకోవడానికి... మీ ఆధార్ నంబర్, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ ఉన్న ఫోన్‌, స్కాన్‌ చేసిన ఐడీ ప్రూఫ్‌లు ను దగ్గర పెట్టుకోవాలి. ఈ పోర్టల్‌లో ఆధార్‌ నంబర్‌తో లాగిన్‌ అయిన తర్వాత, రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా మీ వివరాలను అప్‌డేట్‌ చేయవచ్చు. 

ముందుగా myaadhaar.uidai.gov.in లింక్‌ ద్వారా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
మీ ఆధార్‌ నంబర్‌తో లాగిన్ అవ్వండి
మీ పేరు/జెండర్‌/పుట్టిన తేదీ, చిరునామా ఆప్షన్స్‌ ఎంచుకోండి
'అప్‌డేట్ ఆధార్' ఆప్షన్‌ ఎంచుకోండి
ఇప్పుడు, ఇంటి చిరునామా లేదా ఇతర సమాచారాన్ని అప్‌డేట్‌ చేయడానికి అక్కడ కనిపించే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
ఆ తర్వాత, స్కాన్ చేసిన ప్రూఫ్‌ కాపీలను అప్‌లోడ్ చేసి, డెమోగ్రాఫిక్ డేటాను (Demographic data) అప్‌డేట్‌ చేయండి

ఇప్పుడు మీకు ఒక అక్‌నాలెడ్జ్‌మెంట్‌ నంబర్ (URN) వస్తుంది. ఆ నంబర్‌ను సేవ్‌ చేసుకోండి. ఆధార్‌ అప్‌డేషన్‌ స్టేటస్‌ తనిఖీ చేయడానికి ఆ నంబర్‌ ఉపయోగపడుతుంది. ఈ నంబర్‌ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు, ఈ-మెయిల్‌ అడ్రస్‌కు కూడా వస్తుంది. అప్‌డేట్‌ చేసిన రెండు, మూడు రోజుల తర్వాత https://ssup.uidai.gov.in/checkSSUPStatus/checkupdatestatus లింక్‌ ద్వారా పోర్టల్‌లోకి వెళ్లి, మీ ఆధార్ కార్డ్ అప్‌డేషన్‌ స్టేటస్‌ను ‍‌(Track Aadhaar Updation Status) ట్రాక్ చేయవచ్చు.

మరో ఆసక్తికర కథనం: సమయం లేదు మిత్రమా, మరో 2 రోజులు ఆగితే పెనాల్టీతోనూ ITR ఫైల్‌ చేయలేరు

Published at : 28 Dec 2023 02:02 PM (IST) Tags: UIDAI AADHAR Card aadhar Updation Aadhaar Card Updation Latest News Aadhar Free Updation

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today 22 Dec: గోల్డ్‌ షోరూమ్‌కు వెళ్లే ముందు రేట్లు తెలుసుకోండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 22 Dec: గోల్డ్‌ షోరూమ్‌కు వెళ్లే ముందు రేట్లు తెలుసుకోండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Housing Loan: హోమ్‌ లోన్‌ మీరు తీసుకోండి, గ్యారెంటీ గవర్నమెంట్‌ ఇస్తుంది - ఆస్తి పేపర్ల తనఖా అక్కర్లేదు!

Housing Loan: హోమ్‌ లోన్‌ మీరు తీసుకోండి, గ్యారెంటీ గవర్నమెంట్‌ ఇస్తుంది - ఆస్తి పేపర్ల తనఖా అక్కర్లేదు!

Fixed Deposit Rates: ఈ నెలలో ఎఫ్‌డీ రేట్లను సవరించిన 5 బ్యాంకులు - ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్‌ కూడా ఉండొచ్చు!

Fixed Deposit Rates: ఈ నెలలో ఎఫ్‌డీ రేట్లను సవరించిన 5 బ్యాంకులు - ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్‌ కూడా ఉండొచ్చు!

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Gold-Silver Prices Today 21 Dec: ఒక్కరోజులో రూ.6,500 పెరిగిన గోల్డ్‌ - ఏపీ, తెలంగాణలో రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 21 Dec: ఒక్కరోజులో రూ.6,500 పెరిగిన గోల్డ్‌ - ఏపీ, తెలంగాణలో రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

టాప్ స్టోరీస్

Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 

Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 

Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్

Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్

Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!

Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!

PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ

PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ