By: ABP Desam | Updated at : 28 Dec 2023 01:25 PM (IST)
మరో 2 రోజులు ఆగితే పెనాల్టీతోనూ ITR ఫైల్ చేయలేరు
Belated ITR Filing Last Date: 2022-23 ఆర్థిక సంవత్సరానికి (2023-24 అసెస్‌మెంట్ ఇయర్) 2023 జులై 31 లోపు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదా?. అయితే, మీకు 2023 డిసెంబర్ 31 చాలా కీలక తేది. ఆలస్య రుసుముతో ITR ఫైల్ చేయడానికి ఇదే మీకు చివరి అవకాశం.
అంతేకాదు, ఇప్పటికే మీరు ITR ఫైల్ చేసి, దానిలో ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకోవడానికి కూడా ఇదే చివరి తేదీ. సవరించిన ఐటీఆర్‌ను (Revised ITR) ఆదాయపు పన్ను సెక్షన్ 139(5) కింద ఫైల్ చేయవచ్చు.
ఆలస్య రుసుముతో ITR ఫైల్ చేయడం ఎలా? (Filing of ITR with late fee)
బీలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేయడానికి, మీ వార్షిక ఆదాయాన్ని బట్టి రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా ఫైల్ చేసినా, అసలు ఐటీఆర్ కిందే దీనిని పరిగణిస్తారు.
- బీలేటెడ్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి, ముందుగా ఆదాయపు పన్ను విభాగం ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లండి.
- మీ ఐడీ & పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
- ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఆప్షన్‌ను, దానికి సంబంధించిన అసెస్‌మెంట్ ఇయర్ & ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకోండి.
- ఇప్పుడు, మీకు New Filing అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి Individual ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ITR Form-1ని ఎంచుకుని, Lets Gets Started క్లిక్ చేయాలి.
- ఇప్పుడు, ఆదాయపు పన్నుకు సంబంధించిన అన్ని వివరాలు మీ ముందుకు వస్తాయి.
- అవసరమైన వివరాలను పూరించండి. ఆ తర్వాత Proceed to Validation ఆప్షన్‌ను ఎంచుకోండి.
- పెనాల్టీ మొత్తాన్ని డిపాజిట్ చేయండి. ఇప్పుడు మీ బీలేటెడ్ ITR ఫైలింగ్ పూర్తవుతుంది.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ రూ.64 వేలు దాటిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
2022-23 ఆర్థిక సంవత్సరానికి మీరు ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయకపోతే సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. IT డిపార్ట్‌మెంట్ నుంచి మీకు నోటీసు వస్తుంది. మీరు ఐటీఆర్ ఎందుకు దాఖలు చేయలేదో ఐటీ విభాగం కారణం అడుగుతుంది. మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 23F ప్రకారం, వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న వ్యక్తులు ఆలస్యంగా ITR దాఖలు చేసినందుకు రూ.1,000 జరిమానా చెల్లించాలి. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉన్నవాళ్లు రూ. 5,000 జరిమానా చెల్లించాలి.
ఇ-ఫైలింగ్ (e-filing) పూర్తి చేసిన తర్వాత, 30 రోజులలోపు ఇ-వెరిఫికేషన్ (E-Verification) పూర్తి చేయాలి. ఇ-వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే, మీరు ITR ఫైల్ చేసినట్లు పరిగణించరు.
మరో ఆసక్తికర కథనం: ఈ రోజు రతన్ టాటా పుట్టినరోజు, ఆయన జీవితం గురించి మీకు తెలీని కొన్ని విషయాలుV
Tax Saving Tips: రూ.18 లక్షల జీతంపైనా "జీరో టాక్స్" - చట్టాన్ని మీ చుట్టం చేసుకోవచ్చు!
Multiple Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా, తగ్గుతుందా?
Dividend: 17 నెలల పసివాడు సంపాదించిన డివిడెండ్ రూ.3.3 కోట్లు - ఎవరీ ఏకాగ్ర?
Gold Creates New Records: 7 రోజుల్లో 5 రికార్డ్‌లు బద్ధలు - అక్షయ తృతీయ నాడు రేటు ఎలా ఉండొచ్చు?
Cheaper Life Insurance: చవకైన జీవిత బీమా కావాలా?, ఈ 7 సింపుల్ ట్రిక్స్ ప్రయత్నించండి
Anantapur Politics: పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
UPSC CSE Final Result 2024: సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
IPL 2025 LSG VS DC Result Update: ఢిల్లీ సిక్సర్.. ఆరో విజయంతో సత్తా చాటిన క్యాపిటల్స్, రాణించిన అభిషేక్, రాహుల్, ముఖేశ్, లక్నో చిత్తు