By: Arun Kumar Veera | Updated at : 19 Nov 2024 10:11 AM (IST)
స్టాక్ మార్కెట్‌లో రూ.50 లక్షల కోట్ల నష్టం ( Image Source : Other )
Mistakes In Stock Market Trading: స్టాక్ మార్కెట్‌లో మెజారిటీ పెట్టుబడిదారులు నిరంతరం నష్టపోతున్నారు. కేవలం 7 వారాల్లోనే భారత స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు రూ.50 లక్షల కోట్లు పోగొట్టుకున్నారు. నిఫ్టీ, సెన్సెక్స్ ఇండెక్స్‌లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయుల నుంచి దాదాపు 10 శాతం దిగువన ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలో ట్రేడ్ చేస్తున్నప్పుడు మీరు 5 విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే, ఆ 5 విషయాలు 5 తప్పులుగా రూపాంతరం చెంది, 'శని'కి రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తాయి.
1. స్టాక్ మార్కెట్ గురించి అర్థం చేసుకోండి
మీరు స్టాక్ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా మార్కెట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి. అంటే.. మార్కెట్ ఎలా పనిచేస్తుంది, ట్రేడింగ్‌లో సాంకేతిక నిబంధనలు ఏమిటి, ఎక్కడ & ఎలా పెట్టుబడులు పెట్టాలి వంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి. 'ఏబీపీ దేశం' సహా చాలా తెలుగు యూట్యూబ్ ఛానెల్స్‌లో ఈ సమాచారం ఇప్పుడు ఉచితంగా, కొత్తవారికి సులభంగా అర్ధమయ్యేలా అందుబాటులో ఉంది. ఇదే కాకుండా, పెట్టుబడిదారులు పరిశ్రమ & మార్కెట్‌కు సంబంధించిన ప్రతి వార్తపై నిఘా ఉంచాలి. దీనివల్ల, ఏ షేర్లను కొనాలి అని మాత్రమే కాకుండా, షేర్లను ఎప్పుడు కొనాలి, ఎప్పుడు విక్రయించాలో కూడా తెలుస్తుంది. మార్కెట్‌లోకి వచ్చే వాళ్లకు ఎంట్రీతో పాటు ఎగ్జిట్ గురించి కూడా తెలిసుండాలి. లేదంటే, మీ పరిస్థితి పద్మవ్యూహంలో అభిమన్యుడి తరహాలో తయారవుతుంది.
2. షేర్ల విషయంలో అజాగ్రత్తగా ఉండకండి
మీరు షేర్ల ఎంపికపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా.. దీర్ఘకాలిక & స్వల్పకాలిక పెట్టుబడుల కోసం వివిధ రకాల షేర్లను ఎంచుకోండి. దీని కోసం స్టాక్ ఫండమెంటల్స్‌ను చూడాలి లేదా మార్కెట్ నిపుణుడితో మాట్లాడాలి. ఏదైనా స్టాక్ ఫండమెంటల్స్ చూడటానికి screener.in, nseguide.com, equitymaster.com, bigpaisa.com వంటి వెబ్‌సైట్‌లు ఉన్నాయి.
3. మీ పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం ఉండాలి
"అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టవద్దు" అనే సామెత ఉంది. స్టాక్ మార్కెట్‌కు కూడా ఇది వర్తిస్తుంది. నష్టాలను నివారించడానికి వైవిధ్య (డైవర్సిఫికేషన్) సూత్రం చాలా ముఖ్యం. అంటే, మీ డబ్బు మొత్తాన్ని ఒకే స్టాక్‌లో కాకుండా.. అనేక రంగాల్లో & అనేక షేర్లలో పెట్టుబడిగా పెట్టండి. ఇది రిస్క్‌ను తగ్గిస్తుంది. ఏదైనా రంగం లేదా షేరు క్షీణిస్తుంటే, ఆ నష్టాన్ని ఇతర రంగం లేదా ఇతర షేర్ల లాభాలతో భర్తీ చేయవచ్చు.
4. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టండి
చాలామంది పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్‌లో త్వరిత లాభాలను సంపాదించడానికి స్వల్పకాలిక ట్రేడింగ్ చేస్తారు. కానీ ఈ పద్ధతి చాలా రిస్క్‌తో కూడుకున్నది. ముఖ్యంగా, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో స్వల్పకాలిక ట్రేడింగ్ చేస్తే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. స్వల్పకాలిక ట్రేడింగ్‌కు బదులు దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే మార్కెట్ ఒడుదొడుకులను నివారించడమే కాకుండా మంచి రాబడి వచ్చే అవకాశం కూడా ఉంది.
5. మార్కెట్ సెంటిమెంట్‌ను అర్థం చేసుకోండి
చాలామంది ఇన్వెస్టర్లు మార్కెట్ సెంటిమెంట్ ప్రభావంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, ముఖ్యంగా మార్కెట్ పడిపోయినప్పుడు. గత కొన్ని వారాలుగా భారతీయ మార్కెట్‌లో ఇదే జరుగుతోంది. మార్కెట్ పతనాన్ని చూసి చాలా మంది కంగారుపడి తమ షేర్లను అమ్ముకుంటున్నారు. ప్రతి డిప్‌ను అవకాశంగా మార్చుకున్నవాడే మార్కెట్‌లో రాణిస్తాడు. స్టాక్ మార్కెట్ గురు 'వారెన్ బఫెట్' చెప్పింది కూడా ఇదే.
వాస్తవానికి, మార్కెట్ ఎలా పెరుగుతుందో అదే విధంగా సరిదిద్దుకుంటుంది. ఎలా పడిపోతుందో మళ్లీ అలాగే పెరుగుతుంది. కాబట్టి, తొందపడకుండా & భయపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసి, దాని ఫండమెంటల్స్ బాగుంటే & కంపెనీ బాగా పనిచేస్తుంటే, మీరు ఈ పతనం సమయంలో ఆ షేర్లను యాడ్ చేసుకుంటూ వెళ్లాలి తప్ప విక్రయించకూడదు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఆ వివరాలు వెల్లడించకపోతే రూ.10 లక్షలు ఫైన్ - ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వార్నింగ్
Investment Secret: డబ్బులు సంపాదించే ట్రిక్ - ఈ బడా ఇన్వెస్టర్ల సీక్రెట్ ఎవరూ మీకు చెప్పి ఉండరు!
House Construction Tips: ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ విషయాలను విస్మరిస్తున్నారా?, లక్షలాది రూపాయలు నష్టం!
New PAN Card: పాన్ 2.0 QR కోడ్ ప్రత్యేకత ఏంటి, పాత పాన్ కార్డ్ ఇక పనికిరాదా?
PF Account Rules: కొత్త ఉద్యోగంలో చేరిన ఎన్ని రోజుల తర్వాత పాత PF అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు?
Gold-Silver Prices Today 17 Dec: ఆభరణాలు కొనేవాళ్లకు షాక్, పెరిగిన పసిడి ధరలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్