search
×

Year Ender 2023: అద్భుతం చేసిన టాక్స్‌ సేవింగ్‌ ఫండ్స్‌, ఈ ఏడాది 45 శాతం లాభాల వర్షం

ఈ ఏడాది కాలంలో, NSE నిఫ్టీ & BSE సెన్సెక్స్ రెండూ చాలా కొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి.

FOLLOW US: 
Share:

Year Ender 2023 Top 10 Tax Saving Funds: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్‌ ఒక మంచి ఆప్షన్‌. వీటికి ఏటికేడు ఆదరణ పెరుగుతోంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ల సంఖ్య వృద్ధి చెందుతూనే ఉంది. ప్రస్తుతం, స్టాక్‌ మార్కెట్ సూపర్‌ బూమ్‌లో ఉంది. మార్కెట్‌ మంచి లాభాలు పొందేందుకు పెట్టుబడిదార్లు మ్యూచువల్ ఫండ్స్ వైపు ఆకర్షితులవుతున్నారు.

పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్ (Tax Saving Mutual Funds)
ప్రస్తుతం, మార్కెట్‌లో చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడిదార్లు తమ లక్ష్యాలు & అవసరాలకు అనుగుణంగా తగిన పథకాన్ని ఎంచుకోవచ్చు. వీటిలో, ఆదాయ పన్నును ఆదా చేసే మ్యూచువల్ ఫండ్స్‌ కూడా ఉన్నాయి. వీటి పాపులారిటీ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. వీటి నుంచి అధిక రాబడి పొందడమే కాకుండా, పన్ను ఆదా చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్‌ని ELSS (Equity Linked Saving Scheme) ఫండ్స్ అని కూడా అంటారు.

2023లో స్టాక్ మార్కెట్‌లో రికార్డుల జోరు
2023 సంవత్సరం స్టాక్ మార్కెట్‌ జర్నీలో గొప్ప మైలురాయిగా నిలుస్తుంది. ఈ ఏడాది కాలంలో, NSE నిఫ్టీ & BSE సెన్సెక్స్ రెండూ చాలా కొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. 2023లో, నిఫ్టీ తొలిసారిగా 21 వేల పాయింట్ల స్థాయిని దాటింది, సెన్సెక్స్ 70 వేల పాయింట్ల శిఖరంపైకి చేరుకుంది.

బెంచ్‌మార్క్ కంటే 3 రెట్లు ఎక్కువ రాబడి
మార్కెట్‌ రేసులో టాక్స్‌ సేవింగ్‌ ఫండ్స్‌ కూడా స్పీడ్‌గా దూసుకెళ్లాయి. 2023 క్యాలెండర్‌ ఇయర్‌లో, తమ సబ్‌స్క్రైబర్‌లకు 45 శాతం వరకు అద్భుతమైన రాబడిని అందించాయి. ఈ నంబర్‌, బెంచ్‌మార్క్ సెన్సెక్స్ & నిఫ్టీ కంటే దాదాపు మూడున్నర రెట్లు ఎక్కువ. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సెన్సెక్స్‌ & నిఫ్టీలు వరుసగా 13.71 శాతం & 14.89 శాతం రిటర్న్స్‌ ఇచ్చాయి.

2023లో టాప్-10 ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ రిటర్న్స్ (YTD):

సుందరం లాంగ్ టర్మ్ టాక్స్ అడ్వాంటేజ్ ఫండ్ -- 44.36%
SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ --  34.91%
ITI ELSS టాక్స్‌ సేవర్ ఫండ్ --  34.67%
SBI లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ ఫండ్ --  34.23%
మోతీలాల్ ఓస్వాల్ ELSS టాక్స్‌ సేవర్ ఫండ్ --  34.05%
బ్యాంక్ ఆఫ్ ఇండియా టాక్స్ అడ్వాంటేజ్ ఫండ్ --  32.18%
సామ్‌కో ELSS టాక్స్‌ సేవర్ ఫండ్ -- 31.41%
వైట్‌ఓక్‌ క్యాపిటల్ ELSS టాక్స్‌ సేవర్ ఫండ్ --  30.55%
HDFC ELSS టాక్స్‌ సేవర్ --  30.39%
బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్‌ క్యాప్ ట్యాక్స్ ఫండ్ --  30.36%

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: నాలుగు నెలల తర్వాత మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం, అయితే ఈసారి కాస్త ఊరట

Published at : 13 Dec 2023 01:09 PM (IST) Tags: tax Saving Mutual Funds Year Ender 2023 Happy New year 2024 Goodbye 2023 tax saving schemes 2023

ఇవి కూడా చూడండి

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

టాప్ స్టోరీస్

Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే

Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే

Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం

Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం

AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు

AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు

Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల

Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల