By: Arun Kumar Veera | Updated at : 22 Apr 2024 02:11 PM (IST)
ఈటీఎఫ్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఏది బెస్ట్?
Types Of ETFs: మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కాస్త భిన్నం. ఇవి స్టాక్ మార్కెట్‌లో ఈక్విటీ షేర్ల తరహాలో ట్రేడ్ అవుతాయి. ట్రేడర్లు ఇంట్రాడేలో వివిధ రేట్ల దగ్గర ఈటీఎఫ్ యూనిట్లను కొనడం/అమ్మడం చేయొచ్చు. ఈటీఎఫ్ యూనిట్లను కొనడం అంటే.. ఆ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న అన్ని కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లే. ఉదాహరణకు.. నిఫ్టీ50 ఈటీఎఫ్‌ను ట్రేడ్ చేస్తే, నిఫ్టీ50 బాస్కెట్‌లో ఉన్న అన్ని కంపెనీల షేర్లను మీరు ట్రేడ్ చేసినట్లే లెక్క.
వివిధ రకాల ఈటీఎఫ్‌లు:
ఈక్విటీ ఈటీఎఫ్‌లు: ఎక్కువ ప్రజాదరణ పొందిన విభాగం ఇది. వివిధ రకాల స్టాక్ మార్కెట్ సూచీల (ఇండెక్స్) పనితీరును ఇవి ప్రతిబింబిస్తాయి. ఈక్విటీ మార్కెట్‌లో ఇన్‌డైరెక్ట్‌గా పెట్టుబడి పెట్టే అవకాశాన్ని ఈక్విటీ ఈటీఎఫ్‌లు అందిస్తాయి.
ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్స్: తక్కువ రిస్క్, స్థిరమైన రాబడిని కోరుకునే పెట్టుబడిదార్లకు ఇవి అనువైనవి. గవర్నమెంట్ బాండ్లు, కార్పొరేట్ బాండ్లు, ట్రెజరీలు సహా వివిధ రకాల స్థిర ఆదాయ సెక్యూరిటీల్లో ఇవి పెట్టుబడి పెడతాయి. తద్వారా, మొత్తం పోర్ట్‌ఫోలియో రిస్క్ తగ్గుతుంది, సాధారణ ఆదాయం అందుతుంది.
కమోడిటీ ఈటీఎఫ్‌లు: సాంప్రదాయ స్టాక్స్, బాండ్‌లను దాటి వైవిధ్యాన్ని (Diversity) చూపే ఫండ్స్ ఇవి. కమోడిటీ ఈటీఎఫ్‌లు విలువైన లోహాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ముడి పదార్థాల వంటి వాటిలో పెట్టుబడి పెడతాయి. కమోడిటీ మార్కెట్ సూచీలను ట్రాక్ చేయడం ద్వారా లేదా కమోడిటీ సంబంధిత స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా కమోడిటీస్ మార్కెట్‌లో కొనసాగుతాయి.
కరెన్సీ ఈటీఎఫ్‌లు: విదేశీ మారక ద్రవ్యం మార్కెట్‌లోకి అడుగు పెట్టే తలుపులను కరెన్సీ ఈటీఎఫ్‌లు తెరుస్తాయి. నిర్దిష్ట కరెన్సీలు లేదా కరెన్సీ బాస్కెట్‌ల వాల్యూను ఇవి ట్రాక్ చేస్తాయి. కరెన్సీ పెట్టుబడుల్లో వైవిధ్యం చూపడానికి, లేదా కరెన్సీ రిస్క్‌కు వ్యతిరేకంగా హెడ్జ్ చేయడానికి ఇవి అనువైనది.
రియల్ ఎస్టేట్ ఈటీఎఫ్‌లు: రియల్ ఎస్టేట్ రంగంలో ఆసక్తి ఉన్న పెట్టుబడిదార్లు రియల్ ఎస్టేట్ ఈటీఎఫ్‌లను ఎంచుకోవచ్చు. ఇవి సాధారణంగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌ల్లో (REITs) పెట్టుబడి పెడతాయి. రోజువారీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా, పాసివ్ మేనేజ్‌మెంట్ ద్వారా స్థిరమైన రాబడి అందిస్తాయి.
మల్టీ అసెట్ ఈటీఎఫ్‌లు: ఒకే రకమైన అసెట్ క్లాస్‌లోకి డబ్బు తీసుకెళ్లకుండా, పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని చూపుతాయి. ఈక్విటీలు, బాండ్లు, కమొడిటీలు, ఇతర సెక్యూరిటీల మిశ్రమంలో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. ఫలితంగా, పెట్టుబడిదారుకు బ్యాలెన్స్‌డ్ పోర్ట్‌ఫోలియో ఉంటుంది.
ఆల్టర్‌నేటివ్ ఈటీఎఫ్‌లు: సాంప్రదాయేతర వ్యూహాలు వీటి సొంతం. ప్రైవేట్ ఈక్విటీ నుంచి హెడ్జింగ్ టెక్నిక్స్ వరకు, ఈ ETFలు పెట్టుబడిదార్లకు పోర్ట్‌ఫోలియోల్లో వైవిధ్యం చూపిస్తాయి, సరికొత్త పెట్టుబడి మార్గాల ద్వారా రాబడి పెంచుకునే అవకాశం అందిస్తాయి.
సస్టైనబుల్ ఈటీఎఫ్‌లు: ఇది పర్యావరణ అనుకూల పెట్టుబడి మార్గం. ఎన్విరాన్‌మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ (ESG) ప్రమాణాలు పాటిస్తున్న కంపెనీలు లేదా సెక్యూరిటీల్లోనే సస్టైనబుల్ ఈటీఎఫ్‌లు పెట్టుబడి పెడతాయి. ఇకో ఫ్రెండ్లీగా ఉండాలనుకునే పెట్టుబడిదార్లు వీటిని ఎంచుకోవచ్చు.
ETFలో పెట్టుబడి పెట్టే ముందు మీ సొంతంగా పరిశోధన చేయడం చాలా ముఖ్యం. వివిధ ఈటీఎఫ్ పథకాలను పోల్చి చూసిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఆపిల్ సంస్థ బంపరాఫర్ - భారత్‌లో వచ్చే మూడేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు!
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
SIP , PPFలో లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?
Investments for Child : పిల్లల ఫ్యూచర్ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్‌తో అధిక రాబడి మీ సొంతం
Children Day: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్