By: ABP Desam | Updated at : 25 Sep 2023 11:41 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening 25 September 2023:
భారత స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. బెంచ్‌మార్క్ సూచీలు సోమవారమూ నష్టాల్లోనే మొదలయ్యాయి. ఆసియాలో మెజారిటీ సూచీలన్నీ నష్టపోవడం నెగెటివ్ సెంటిమెంటుకు దారితీసింది. పైగా అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు తోడయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 56 పాయింట్లు తగ్గి 19,618 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 179 పాయింట్లు తగ్గి 65,829 వద్ద కొనసాగుతున్నాయి. వినియోగ వస్తువులు మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 66,009 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,082 వద్ద మొదలైంది. 65,803 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,118 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 179 పాయింట్లు తగ్గి 65,829 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 19,674 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,678 వద్ద ఓపెనైంది. 19,611 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,713 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 56 పాయింట్లు తగ్గి 19,618 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 44,615 వద్ద మొదలైంది. 44,400 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,710 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 169 పాయింట్ల నష్టంతో 44,443 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 19 కంపెనీలు లాభాల్లో 31 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా కన్జూమర్, ఏసియన్ పెయింట్స్, యూపీఎల్ షేర్లు లాభపడ్డాయి. ఎస్బీఐ లైఫ్, ఇన్ఫీ, హీరోమోటో, ఎల్‌టీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. బ్యాంకు, ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువ నష్టపోయాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.59,950 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.75,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.24,560 వద్ద ఉంది.
క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?
భారత స్టాక్ మార్కెట్లు వరుస నాలుగో రోజు నష్టపోయాయి. రోజు మొత్తం తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆరంభంలో నష్టపోయిన సూచీలు ఆసియా మార్కెట్లు పుంజుకోవడంతో రీబౌండ్ అయ్యాయి. ఐరోపా స్టాక్స్ పడిపోవడం, యూఎస్ వడ్డీరేట్ల పెంపు వంటి అంశాలతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 68 పాయింట్లు తగ్గి 19,674 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 221 పాయింట్లు తగ్గి 66,009 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 82.94 వద్ద స్థిరపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Kidney Health : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్‌ని డైట్లో చేర్చుకోవాలట