By: Rama Krishna Paladi | Updated at : 31 Aug 2023 12:47 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening 31 August 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ సంకేతాలతో ఉదయం లాభాల్లోనే మొదలయ్యాయి. అదానీ గ్రూప్, హిండెన్‌బర్గ్ వివాదం మళ్లీ తెరపైకి రావడంతో ఇన్వెస్టర్లలో నెగెటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 41 పాయింట్లు తగ్గి 19,305 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 105 పాయింట్లు తగ్గి 64,981 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు కుదేలయ్యాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,087 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,178 వద్ద మొదలైంది. 64,962 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,277 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 105 పాయింట్ల నష్టంతో 64,981 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 19,347 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,373 వద్ద ఓపెనైంది. 19,292 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,388 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 41 పాయింట్లు తగ్గి 19,305 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ తగ్గింది. ఉదయం 44,265 వద్ద మొదలైంది. 43,970 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,399 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 220 పాయింట్ల నష్టంతో 44,012 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 31 నష్టాల్లో ఉన్నాయి. జియో ఫైనాన్స్, మారుతీ సుజుకీ, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, హిందాల్కో, టెక్ మహీంద్రా షేర్లు పెరిగాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, నెస్లే ఇండియా, బీపీసీఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు నష్టపోయాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.60,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.77,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 పెరిగి రూ.25,930 వద్ద ఉంది.
Also Read: ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్ - అకౌంట్ వివరాల్ని మార్చడానికి ఇకపై డెడ్‌లైన్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ