By: Rama Krishna Paladi | Updated at : 28 Jul 2023 11:26 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Opening 27 July 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలను కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. యూఎస్ ఎకానమీ డేటా మదుపర్లను నిరాశపరిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 35 పాయింట్లు తగ్గి 19,624 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 176 పాయింట్లు పతనమై 66,090 వద్ద కొనసాగుతున్నాయి. పవర్ ఇండెక్స్ రెండు శాతం మేర పెరిగింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 66,266 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,266 వద్ద మొదలైంది. 65,991 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,351 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 176 పాయింట్ల నష్టంతో 66,090 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 19,659 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,659 వద్ద ఓపెనైంది. 19,595 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,695 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 35 పాయింట్లు తగ్గి 19,624 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 45,560 వద్ద మొదలైంది. 45,370 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,725 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 176 పాయింట్లు తగ్గి 45,502 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు నష్టపోయాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.60,110 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.2000 తగ్గి రూ.76400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.730 తగ్గి రూ.24,790 వద్ద కొనసాగుతోంది.
Also Read: టాప్ 10 ఐటీ కంపెనీలు - 3 నెలల్లో 21,327కు పడిపోయిన ఉద్యోగుల సంఖ్య!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Safeguard your investments! Verify CAS and reconcile with trades regularly.#InvestorAwareness #InvestorProtection #NSE #NSEIndia @ashishchauhan pic.twitter.com/iRgQpXPOl6
— NSE India (@NSEIndia) July 28, 2023
Market Update for the day.
— NSE India (@NSEIndia) July 27, 2023
See more:https://t.co/XW5Vr5nX8chttps://t.co/hyRwDLLexj#NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/CNO88lqtxt
Be part of a joint Investor Awareness Program by SEBI, NSE and NSDL on 28th July'23 at 3PM at ISMS Sankalp Business School, exclusively for investors in Ambegaon BK, Pune. Hurry up! Limited seats available.#InvestorAwareness #SEBI #NSE #StockMarket #ShareMarket @ashishchauhan pic.twitter.com/YpAZ4t4zkm
— NSE India (@NSEIndia) July 27, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!