By: Geddam Vijaya Madhuri | Updated at : 10 Jun 2025 01:55 PM (IST)
స్టాక్స్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే కలిగే లాభాలివే (Image Source : Freepik) ( Image Source : Other )
JSW Steel Shares : స్టాక్స్‌లో డబ్బులు పెడితే.. అన్నీ కలిసి వస్తే ఫ్యూచర్లో లాభాలు వస్తాయని అందరికీ తెలుసు. కానీ ఓ లక్ష రూపాయలు ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసిందంటే నమ్ముతారా? పైగా ఒకటి.. రెండూ.. కాదు అక్షరాల 80 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ వారు కొన్న స్టాక్ ఏంటి? అసలు ఈ స్టోరీ ఎంత వరకు నిజం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ వ్యక్తి తన తండ్రి లక్ష రూపాయలు పెట్టి JSW స్టీల్‌లో షేర్స్ కొన్నట్లు రీసెంట్గా తెలుసుకున్నాడు. అయితే అవి ఇప్పుడిప్పుడే కొన్నవి కాదు. 1990లో వీటిని కొనగోలు చేశాడు. అయితే దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఆ షేర్లు బయటపడ్డాయి. అప్పుడు అతని తండ్రి లక్షతో కొనగోలు చేసిన ఆ షేర్ల ధర ఇప్పుడు 80 కోట్లు అయ్యాయట. లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి లాభాలు చూడొచ్చో అనేదానికి ఈ స్టోరీ మంచి ఉదాహరణ.
సౌరవ్ దత్తా అనే ఇన్వెస్టర్ ఈ స్టోరీని X (ట్విట్టర్లో) షేర్ చేశాడు. ఓ వ్యక్తి తన తండ్రి 1990లో JSW షేర్లను లక్షకు కొన్నాడు. ఇప్పుడు వాటి ధర 80 కోట్లు అయిందని తెలిపాడు. లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కలిగే లాభమిది అంటూ.. 30 సంవత్సరాల క్రితం కొని ఉంచడం వల్ల ఈ స్థాయిలో లాభాలు పొందినట్లు రాసుకొచ్చాడు. దానికి సంబంధించిన ఫోటోను కూడా ట్వీట్‌కి జత చేశాడు.
Guy on Reddit discovered JSW shares bought by his dad in the 1990s for ₹1L.
Worth ₹80Cr today.
Power of buy right sell after 30yrs. pic.twitter.com/mZTpGt4LII— Sourav Dutta (@Dutta_Souravd) June 7, 2025
ఇది నిజమో.. అబద్ధమో కానీ.. ఈ పోస్ట్‌కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ దొరికింది. స్టాక్‌లో డబ్బులు పెట్టి ఓపికగా ఎదురు చూస్తే.. రాబడి ఎలా ఉంటుందనేది ఈ స్టోరి నిజం చేస్తుంది. లాస్లో ఉన్నప్పుడు కూడా షేర్లు అమ్మకుండా ఎదురు చూస్తే ఇలాంటి లాభాలు చూడొచ్చంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. మరికొందరు ఫన్నీగా మా నాన్నలు, తాతలు ఇలా ఎందుకు చేయరు మావ.. లైఫ్ సెట్ అయిపోయేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
మీరు స్టాక్‌లో డబ్బులు పెట్టాలన్నా.. లేదా పెట్టినా.. ఇన్వెస్ట్ చేసిన కంపెనీ మంచిదైతే వాటిని కొనండి. నష్టాల్లో ఉంటే తొందరపడి అమ్మకండి. మీరు ఎంత సమయం ఎదురు చూస్తే.. దాని విలువ అంత పెరుగుతుంది. అయితే మార్కెట్లోకి ఎప్పుడు ఎంట్రీ అవ్వాలో.. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలిసి ఉంటే నష్టాలు లేకుండా స్టాక్ మార్కెట్లో లాభాలు పొందవచ్చు.
RBI Key Decisions: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
IndiGo Flight Crisis : ఈ తేదీ వరకు ఇండిగో టికెట్ రద్దు చేస్తే పూర్తి రీఫండ్! పూర్తి వివరాలు తెలుసుకోండి!
Airtel Recharge Plan: ఎయిర్టెల్ వినియోగదారులకు బిగ్ షాక్ ! రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను సైలెంట్‌గా క్లోజ్!
Gold Price: బంగారం ధర 15నుంచి 30 శాతం వరకు పెరిగే ఛాన్స్! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడి!
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Goa Fire Accident: గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Tirupati Crime News: విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
Virat Kohli Records: సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలుకొట్టిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలో నెంబర్ 1 బ్యాటర్
Sonarika Bhadoria : పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ - కపుల్‌కు వెల్లువెత్తుతున్న విషెష్
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy