By: ABP Desam | Updated at : 22 May 2023 10:36 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pixabay )
Stock Market Opening 22 May 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం పాజిటివ్‌గా మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అదానీ గ్రూప్ కంపెనీలు వరుసగా రెండో సెషన్లో దుమ్మురేపుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 63 పాయింట్లు పెరిగి 18,266 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 157 పాయింట్లు తగ్గి 61,887 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,729 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,579 వద్ద మొదలైంది. 61,579 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,989 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 157 పాయింట్ల లాభంతో 61,887 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 18,203 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,201 వద్ద ఓపెనైంది. 18,178 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,294 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 63 పాయింట్లు పెరిగి 18,266 వద్ద కొనసాగుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 43,877 వద్ద మొదలైంది. 43,787 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,026 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 91 పాయింట్లు తగ్గి 43,877 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, దివిస్ ల్యాబ్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, ఐచర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, ప్రైవేటు బ్యాంక్ సూచీలు ఎరుపెక్కాయి. ఐటీ, మెటల్ ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.61,410గా ఉంది. కిలో వెండి రూ.300 తగ్గి రూ.75,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.120 తగ్గి రూ.28,240 వద్ద కొనసాగుతోంది.
Also Read: గోల్డ్ షాపులు కిటకిట - ₹2000 నోట్లు తీసుకోవడానికి 'వన్ కండిషన్'
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
In today's #StockTerm, let's look at what Moving Average is!#NSE #StockMarket #ShareMarket #StockTerms #NSEIndia #InvestorEducation #StockMarketIndia #StockExchange #StockTrading #Stocks #Investing #Trading #MovingAverage pic.twitter.com/jMWVQHooqV
— NSE India (@NSEIndia) May 22, 2023
Can you spot the 3 companies from the Telecom sector that are listed on NSE? Write your answers in the comments below!#NSECrossword #Crossword #ShareMarket #StockMarket #NIFTY50 #Investor pic.twitter.com/yTL9NuCJgP
— NSE India (@NSEIndia) May 21, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్ ఆహ్వానించిన టీటీడీ