search
×

Sensex Today: 251 పాయింట్లు పడ్డ సెన్సెక్స్‌! మేజర్‌ సపోర్ట్‌ బ్రేక్‌ చేసిన నిఫ్టీ!

Stock Market Opening 17 August 2023: స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి.

FOLLOW US: 
Share:

Stock Market Opening 17 August 2023:

స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. చైనా ఎకానమీ బలహీనత ఇన్వెస్టర్లను భయపెడుతోంది. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్లు ఇంకా పెంచే అవకాశం ఉండటం కలవరపెడుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 72 పాయింట్లు తగ్గి 19,392 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 251 పాయింట్లు తగ్గి 65,287 వద్ద కొనసాగుతున్నాయి. యూఎస్‌ ట్రెజరీ యీల్డ్‌ పెరుగుదలతో డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనంగా మొదలైంది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,539 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,503 వద్ద మొదలైంది. 65,257 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,535 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 251 పాయింట్ల నష్టంతో 65,287 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

బుధవారం 19,465 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,450 వద్ద ఓపెనైంది. 19,377 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,461 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 72 పాయింట్లు నష్టపోయి 19,392 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ఉంది. ఉదయం 43,897 వద్ద మొదలైంది. 43,831 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,015 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 28 పాయింట్లు పెరిగి 43,975 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 14 కంపెనీలు లాభాల్లో 36 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌, టైటాన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్బీఐ, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ షేర్లు లాభపడ్డాయి. ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, ఐటీసీ, పవర్‌ గ్రిడ్‌, సిప్లా, దివిస్‌ ల్యాబ్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్‌, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి. పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ పెరిగాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.59,020 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.72500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.170 తగ్గి రూ.23,700 వద్ద ఉంది.

Also Read: గుడ్‌న్యూస్‌! రూ.13,000 కోట్లతో కులవృత్తుల వారికి మోదీ కొత్త పథకం

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 17 Aug 2023 10:49 AM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!

Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి

Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి

RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది

RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది

One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?

One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?